శాస్త్రం - సైన్స్
ʹసైన్స్ʹ కి తెలుగులో ʹశాస్త్రంʹ అని చాల సంవత్సరాలుగా వాడుతున్నారు. కానీ మతసంబంధమయిన విషయాలను కూడా ʹశాస్త్రంʹ అని వాడటంతో ఈ మధ్య సైన్స్ ని ʹవిజ్ఞాన శాస్త్రంʹగా వాడుతున్నారు.
సైన్స్ నిరంతరం అప్డేట్ అవుతూ ఉంటుంది. సైన్స్ లో అల్టిమేట్ ట్రూత్ ఉండదు. నిరూపించ పడిన విషయం మళ్ళీ, మళ్ళీ ప్రశ్నించి నిరూపించే క్రమంలో క్రొత్త ఆవిష్కరణలు వస్తాయి. పూర్వ కాలంలో మనిషి తాను అబ్సర్వ్ చేసిన దానిని బట్టి భూ కేంద్రంగా విశ్వం ఉంది అనుకున్నారు. అది కూడా సైన్స్ నే. కానీ అప్పటి సైన్స్. తరువాత ఇంకా డీప్ అబ్సర్వ్ చేస్తే భూమి తన చుట్టూ తానూ తిరగటం వలన మనకు సూర్యుడు, నక్షత్రాలు భూమి చుట్టూ తిరుగుతాయి అనిపిస్తుంది అంతే తప్ప నిజానికి అవి భూమి చుట్టూ తిరగటం లేదు. భూమి సూర్యుని చుట్టూ తిరుగుతుంది అనేది అర్థం అయ్యింది. అది సైన్స్ అప్డేట్ చేసుకుంది. ఇంకా భవిష్యత్ లో కొత్త అప్డేట్స్ ఉండే అవకాశం కూడా ఉంది.
మత పరమయిన విశేషాలు అల్టిమేట్ ట్రూత్స్ గా భావించాల్సి ఉంటుంది. అవి మారవు. ప్రశ్నించడానికి, అప్డేట్ అవ్వటానికి అవకాశం లేదు. అవి కేవలం విశ్వాసాలు. విశ్వాసాలలో వ్యక్తికి సంబంధించిన అహం కలసి ఉండటంతో దాని విరుద్దమయిన ఆవిష్కరణలను అంగీకరించలేడు. అందు వలన మత పరమయిన శాస్త్రాలు అలాగే ఉండిపోతాయి. కొన్ని మానవ విలువలకు విరుద్ధంగా ఉన్న ఆచారాలు సమాజంలో వచ్చిన విప్లవం వలన మతం వాటిని ఆచరించడం మానివేస్తుంది. అది అప్డేట్ కాదు. ఉదాహరణకు ʹసతీ సహగమనంʹ.
ఇది హిందూ మతానికి మాత్రం సంబంధిచిన విషయం కాదు. అన్ని మతాలలో ఇటువంటివి ఉంటాయి. మనం మతానికి మతానికి మధ్యలో ఏ మతం గొప్పది అని విశ్లేషిస్తే విషయం అర్థం కాదు. అన్ని మతాలు కూడా విశ్వాసాలే. సైన్స్ విశ్వాసం కాదు.
- హరి రాఘవ్
Keywords : religion, science
(24.09.2017 08:13:41am)
No. of visitors : 1126
Suggested Posts
4 results found !
| పేదరికంలో ఆకలి చావులుంటాయి తప్ప ఆత్మహత్యలుండవుమనిషి ప్రాధమిక అవసరాలు తీరనిదే ఇతర విషయాలను పట్టించుకోడు. ప్రాధమిక అవసరాలకోసం తను ఏమయినా చేస్తాడు. సాటి ప్రాణిని చంపుతాడు. సాటి మనిషిని చంపుతాడు, అవసరమైతే బానిసత్వం వహిస్తాడు. ఎవరికయినా తలొంచుతాడు. అది మతమయినా, పెట్టుబడి దారుడయినా, దోపిడీ దారుడయినా.. ప్రాధమిక అవసరాలు తీరనిదే తను హేతుబద్దంగా ఆలోచించలేడు, సైంటిఫిక్ థింకింగ్ అలవర్చుకోలేడు.
సైన్స్ ఎప్పుడూ ఉ |
| సామాజిక దృక్పధం లేని శాస్త్రవేత్తలు ఉగ్రవాదులకన్నా ప్రమాదంసమాజంలో శాస్త్రీయ దృక్పధం పెరగాలని ప్రతీ ఒక్కరూ కోరుకుంటారు. ఈ విషయం భారత రాజ్యాంగంలో సైతం స్పష్టంగా చెప్పబడినది. అందుకు అనుకూలంగా ప్రభుత్వాలు చర్యలు చేపట్టాలి. మూఢనమ్మకాలను పారద్రోలుతూ ప్రజలలో అవగాహనా సదస్సులు నిర్వహించాలి. మూఢ నమ్మకాలకు వ్యతిరేకంగా చట్టాలు రూపొంచాలి. సైన్స్ ప్రచారకులు పెరగాలి. ఇటీవల భారత్ లో హేతువాదులు, నాస్తికుల పైన మత ఛాందస వాదులు, |
| భారత్ లో పరిశోధనల పై కుల ప్రభావంనేటి చదువుకున్న యువతకు సైన్స్ అనగానే నాసా లేదా ఇస్రో గుర్తొస్తుంటాయి. ఏది చెప్పినా నాసా చెప్పాలి. లేదా ఇస్రో చెయ్యాలి. చివరికి పురాణాలలో చెప్పబడిన వాటిని కూడా నాసా పరిశోధించి చెప్పింది అని ప్రచారం చెయ్యటం వాటిని ప్రజలు నమ్మటం జరుగుతుంది. ఇవి కేవలం స్పేస్ కి సంబంధించిన పరిశోధనలు చేసే సంస్థలు. గేమ్స్ లో క్రికెట్ కి విపరీతమైన గ్లామర్ రుద్దినట్లు సైన్స్ లో క |
| నాస్తికత్వం - సైన్స్నాస్తికత్వం వేరు సైన్స్ వేరు. నాస్తికత్వం పరిధి చాల చిన్నది. దేవుడు, మతము మొదలైన ఆధ్యాత్మిక నమ్మకాలకు సంబంధిచినది మాత్రమే. సైన్స్ కి పరిధి లేదు. ఇది విశ్వం మొత్తానికి సంబంధిచినది. దీనికి ఆస్తికుడు, నాస్తికుడు, లేదా ఆ మతం వాడు ఈ మతం వాడు అని సంబంధం ఉండదు. పసిపిల్లవాడు తన తల్లి చనుబాలు త్రాగటం దగ్గరనుండి రాకెట్ ప్రయోగించడం వరకు ప్రతీ దానిలో సైన్స్ ఉంటుంది. |
| డాలర్లు వస్తున్నాయి గాని ఎండ రావడం లేదు |
| కెరీర్ మీద ఇంటరెస్ట్ ఎలా వస్తుంది? |
| టీనేజ్ కి వచ్చిన పిల్లలతో ఎలా ప్రవర్తించాలి? |
| మీ పిల్లలను అనుమానంతో దండిస్తున్నారా? |
| మీ పిల్లలకు స్మార్ట్ ఫోన్స్ ఇస్తున్నారా? |
| NRI పేరెంట్స్ పిల్లల విషయంలో శ్రద్ధ వహించాల్సిన అంశాలు |
| టీనేజ్ ఆడపిల్లలకు సోషల్ మీడియాలో ఎదురయ్యే ఇబ్బందులేంటి? |
| బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్ళే ముందు తరువాత ప్రవర్తన |
| పిల్లలను కనాలి అనుకున్నపుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? |
| మీ పిల్లల ముందే మీరు పోట్లాడుకుంటున్నారా? జాగ్రత్త!! |
| పిల్లలకు ఆటలను దూరం చేస్తున్నారా? |
| మనుసులో భావాలే కలలుగా వస్తాయా? |
| Love | మనం నిజంగా ప్రేమిస్తున్నామా..? |
| తల్లిదండ్రుల మానసిక సమస్యలు పిల్లలకు వారసత్వంగా వస్తాయా? |
| టీనేజ్ అమ్మాయిలతో పేరెంట్స్ ఎలా మెలగాలి? |
| మనిషి జీవితం జీవించడానికా? శోధించడానికా? |
more..