అమాయక గిరిజనులపై నగరపు వికృతదాడి

అమాయక

వారంతా అమాయకపు గిరిపుత్రులు. వారంతా ప్రకృతి ఒడిలో స్వచ్ఛమైన నవ్వులు చిందిస్తూ బ్రతికే మానవులు. వారంతా చెట్లు చేమలతో, అడవి జంతువులతో ప్రేమతో కలసి జీవనం సాగిస్తున్న మానవమూర్తులు. వారంతా అక్షజ్ఞానం లేకున్నా సాటి మనిషుల పట్ల, జీవుల పట్ల అమితమైన ప్రేమాభిమానాలు కురిపించగల కరుణామూర్తులు. వారంతా రక్తాన్ని చెమటగా మార్చి పుడమి తల్లి నుండి బంగారాన్ని తియ్యగల రైతుబిడ్డలు. వారికి కపటం తెలియదు. సాఫ్ట్ స్కిల్స్ తెలియవు. సో కాల్డ్ డీసెన్సీ తెలియదు. వారికి కంప్యూటర్ జ్ఞానం లేదు. వారికి ఈ దేశ రాజ్యాంగం తెలియదు. వారికి ఈ దేశ ప్రధాని ఎవరో తెలియదు. ఈ రాష్ట్ర రాజధాని తెలియదు. సరిహద్దులు తెలియవు, అసలు ఈ దేశం పేరే తెలియదు.

కానీ వారంతా భారతీయులు. మనం గొప్పగా చెప్పుకునే భారతమాత బిడ్డలు. వారు విదేశీయులు కాదు. తీవ్రవాదులు కాదు. వేల కోట్లు బ్యాంకులకు ఎగ్గొట్టిన బడా నేరస్తులు కాదు. మతం మత్తులో విచక్షణ మరచి సాటి మనుషులను క్రూరంగా చంపే మతోన్మాదులు కాదు. తన అభిమాన హీరోని ప్రశ్నిస్తే ప్రాణాలు తీస్తాము అనే సో కాల్డ్ నాగరికులు కాదు. వారంతా అమాయకపు గిరిపుత్రులు. తుమ్మ జిగురు తీసి, చింత పండును ఏరి, వెదురు తడికెలు అల్లి బ్రతుకును వెళ్లదీసుకుంటున్న నిరుపేద శ్రామికులు.

ʹపోడుʹ చేసుకోవటం వారి జన్మ హక్కు. ప్రకృతి న్యాయ సూత్రాల ప్రకారం పోడు వారి హక్కు. భారత రాజ్యాంగం ప్రకారం పోడు వాళ్ళ హక్కు. ఈ దేశంలోని అడవి వారి సొత్తు. వారు వారి అడవిలో నివస్తిస్తుంటే నాగరికులం అని చెప్పుకునే మనం వారి హక్కులు కాల రాస్తూ వంద మంది నివాసం ఉండే గూడెం మీద రెండు వందల మంది పోలీసులతో తెగబడి వాళ్ళను శారీరకంగా, మానసికంగా హింసించాము. గిరిజన మహిళల చీరలు లాగి చెట్లకు తాళ్లతో కట్టేసి వికృతం గా హింసించాము. మర్నాడే ప్రభుత్వం ఇచ్చే చీరల వార్తలు రాస్తూ కొట్టుకు పోతున్నాము. ఇదీ మన మానసిక దౌర్భాగ్యం. ఇదీ మనం గొప్పగా చెప్పుకునే మానవత్వం.

- హరి రాఘవ్

Keywords : gotti, koyas, adivasi, tribes, tadwai
(20.09.2017 07:57:51am)

No. of visitors : 850

Suggested Posts


3 results found !


గొత్తికోయలను మానవ దృక్పధంలో ఆదుకోవాలి

ప్రకృతిలో సరిహద్దు నాగరిక మానవులు గీసుకున్న ఊహాజనిత రేఖలే తప్ప అవి నిజమయినవి కావు. రాష్ట్ర సరిహద్దులు, దేశ సరిహద్దులు కేవలం నాగరిక మానవులకు మాత్రమే ఉంటాయి. పక్షులు, జంతువులు, సెలయేర్లు, నదులకు ఎటువంటి సరిహద్దులు ఉండవు. అలాగే ప్రకృతితో సహజీవనం చేస్తున్న ఆదివాసులకు సరిహద్దుల పేరిట విడదీయటం సరికాదు. సెప్టెంబర్ నెలలో భూపాలపల్లి జిల్లాలో గొత్తికోయల మీద పోలీస

అమాయక గొత్తి కోయల్ని తరలించొద్దు - హైకోర్టు

జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా తాడ్వాయి మండలం జలగలంచ గ్రామంలో నివసిస్తున్న గొత్తి కోయలను అక్కడి నుంచి ఖాళీ చేయించవద్దని తెలంగాణ ప్రభుత్వాన్ని ఉమ్మడి హైకోర్టు ఆదేశించింది. గొత్తి కోయల జీవన విధానా నికి ఇబ్బందులు కల్పించరాదని, వెంటనే వారికి తాగునీటి సౌకర్యం కల్పించాలని ఆదేశిస్తూ మధ్యం తర ఉత్తర్వులు జారీ చేసింది. అడవుల్లో నివాసం ఉండేందుకు ఆదివాసీలకు చట్టం వెసులు

ఎంత కాలం ఈ రిజర్వేషన్స్..??

కొందరు ఆదివాసులకు, దళితులకు, బిసిలకు వేల సంవత్సరాలుగా అన్యాయం జరిగన మాట వాస్తవమే. అందుకు బదులుగా ఇచ్చిన రిజర్వేషన్స్ ఒప్పుకుంటాము కానీ ఎన్ని సంవత్సరాలని ఇస్
Search Engine

బయలాజికల్ మదర్
ఫేస్బుక్ ఓసీడీ (FBOCD)
నిజం ఆవస్యకత
నిజాలన్నీ అబద్దాలే
కెరీర్
చీమ మెదడులో చేరిన వైరస్
వ్యక్తి
జీవితం
హ్యూమనిజం
నేనెవరు?
PTSD
డాలర్లు వస్తున్నాయి గాని ఎండ రావడం లేదు
రిజర్వేషన్స్
కెరీర్ మీద ఇంటరెస్ట్ ఎలా వస్తుంది?
టీనేజ్ కి వచ్చిన పిల్లలతో ఎలా ప్రవర్తించాలి?
మీ పిల్లలను అనుమానంతో దండిస్తున్నారా?
Autism Treatment
మీ పిల్లలకు స్మార్ట్ ఫోన్స్ ఇస్తున్నారా?
NRI పేరెంట్స్ పిల్లల విషయంలో శ్రద్ధ వహించాల్సిన అంశాలు
టీనేజ్ ఆడపిల్లలకు సోషల్ మీడియాలో ఎదురయ్యే ఇబ్బందులేంటి?
బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్ళే ముందు తరువాత ప్రవర్తన
పిల్లలను కనాలి అనుకున్నపుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
మీ పిల్లల ముందే మీరు పోట్లాడుకుంటున్నారా? జాగ్రత్త!!
పిల్లలకు ఆటలను దూరం చేస్తున్నారా?
మనుసులో భావాలే కలలుగా వస్తాయా?
కలలు నిజాలు అవుతాయా?
ఎంప్టీ నెస్ట్ సిండ్రోమ్
Love | మనం నిజంగా ప్రేమిస్తున్నామా..?
తల్లిదండ్రుల మానసిక సమస్యలు పిల్లలకు వారసత్వంగా వస్తాయా?
టీనేజ్ అమ్మాయిలతో పేరెంట్స్ ఎలా మెలగాలి?
రెండవ కూతురు
ఏకాగ్రత పెంచుకోవడం ఎలా?
మనిషి జీవితం జీవించడానికా? శోధించడానికా?
ఫ్రీ థింకింగ్
పోరాటమా? బ్రతుకా?
more..
అమాయక