దేవుని సృష్టిలో గ్రహణాల పాత్ర
ప్రకృతిలో ఏ జీవికి అవసరం పడని దేవుడు అనే కాన్సెప్ట్ మనిషికి అవసరం పడింది. దానికి కారణం మనిషికి ఉన్న మెమరీ, ఎమోషన్స్ కావచ్చు. రోజు సూర్యుడు తూర్పున ఉదయించడం, పడమర అస్తమించడం, రాత్రి పూట చంద్రుడు, నక్షత్రాలు, తోక చుక్కలు, ఉల్కలు ఇవన్నీ మనిషికి సహజంగా అనిపించినా హఠాత్తుగా వచ్చే వరదలు, భూకంపాలు వంటి ప్రకృతి వైపరీత్యాలు మనిషిని భయాందోళనలకు గురిచేసింది.
సహజంగా చిన్నతంలో తమను దండించడానికి వచ్చిన తల్లిదండ్రులను గాని మరెవరయినా పెద్దలను బ్రతిమాలాడుకోవటంతో వారు కొన్నిసార్లు వెనుకకు తగ్గే అవకాశం ఉంటుంది. చిన్నప్పుడు తాను నేర్చుకున్న ఆ కాన్సెప్ట్ తో మనిషి మొదట ప్రకృతిని పూజించడం మొదలు పెట్టాడు. వరదలు వచ్చినపుడు నదిని వేడుకోవటం, భూకంపం వచ్చినపుడు భూమిని వేడుకోవటం, అలాగే చెట్టుని, పుట్టను ప్రకృతి లోని అన్నిటినీ వేడుకోవటం ప్రారంభించాడు.
ఆ తరువాత మనిషిని అత్యంత భయాందోళనకు గురిచేసిన అంశం గ్రహణాలు అందులోనూ సూర్య గ్రహణం వారిని తీవ్ర భయకంపితులను చేసింది. అన్ని జీవన ప్రక్రియలకు శక్తిని అందించే సూర్యుడు హఠాత్తుగా మాయం కావటం వారిని ఆశ్చర్యంతో పాటు ఆలోచనకు గురిచేసింది. ఏదో ఒక దుష్ట శక్తి వీటిని చేస్తుంది అని నమ్మి దానినుండి బయట పడటానికి అంతకు మించిన శక్తి ఏదో ఉంది అని నమ్మి వేడుకోవటం ద్వారా తనకు తాను ధైర్యాన్ని పొందాడు. దానినే దైవంగా నమ్మి తనకు ఆపద వచ్చినప్పుడలా ఆ దైవాన్ని వేడుకోవటం ప్రారంభించాడు.
గణ వ్యవస్థ నుండి క్రమంగా సొంత ఆస్తిని ఏర్పరచుకొని భూస్వామ్య వ్యవస్థ, రాజరికం తో పాటు నేటి ప్రజాస్వామ్యం పేరుతో నడిచే పెట్టుబడి దారీ వ్యవస్థ వరకు బలవంతఁడు బలహీనుని లొంగ దీసుకోవటానికి కనిపెట్టిన అనేక స్ట్రాటజీస్ లో దేవుడు అనే కాన్సెప్ట్ ఎక్కువగా ఉపయోగపడింది. దేవుడి పేరుతో ప్రజలను భయపెట్టి లొంగ దీసుకోవటం సులభం అవ్వటంతో తెలివయిన వారు పూజారులుగా (మతాన్ని బట్టి రకరకాలుగా దేవుడికి ప్రజలకు మధ్యవర్తిత్వం వహిస్తున్నాము అని చెప్పుకునేవారు) అవతరించి దేవుడు అనే కాన్సెప్ట్ ని మనుషులలో పెంపొందించారు.
- హరి రాఘవ్
Keywords : eclipse, sun, god, reason
(19.09.2017 08:50:55pm)
No. of visitors : 716
Suggested Posts
Sorry, there are no suggested posts
| డాలర్లు వస్తున్నాయి గాని ఎండ రావడం లేదు |
| కెరీర్ మీద ఇంటరెస్ట్ ఎలా వస్తుంది? |
| టీనేజ్ కి వచ్చిన పిల్లలతో ఎలా ప్రవర్తించాలి? |
| మీ పిల్లలను అనుమానంతో దండిస్తున్నారా? |
| మీ పిల్లలకు స్మార్ట్ ఫోన్స్ ఇస్తున్నారా? |
| NRI పేరెంట్స్ పిల్లల విషయంలో శ్రద్ధ వహించాల్సిన అంశాలు |
| టీనేజ్ ఆడపిల్లలకు సోషల్ మీడియాలో ఎదురయ్యే ఇబ్బందులేంటి? |
| బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్ళే ముందు తరువాత ప్రవర్తన |
| పిల్లలను కనాలి అనుకున్నపుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? |
| మీ పిల్లల ముందే మీరు పోట్లాడుకుంటున్నారా? జాగ్రత్త!! |
| పిల్లలకు ఆటలను దూరం చేస్తున్నారా? |
| మనుసులో భావాలే కలలుగా వస్తాయా? |
| Love | మనం నిజంగా ప్రేమిస్తున్నామా..? |
| తల్లిదండ్రుల మానసిక సమస్యలు పిల్లలకు వారసత్వంగా వస్తాయా? |
| టీనేజ్ అమ్మాయిలతో పేరెంట్స్ ఎలా మెలగాలి? |
| మనిషి జీవితం జీవించడానికా? శోధించడానికా? |
more..