ఫేస్బుక్ అడిక్షన్
ప్రతీ టెక్నాలజీ యొక్క పాజిటివ్ ఇంపాక్ట్ సమాజం మీద ఎలాగయితే ఉంటుందో అదే విధంగా నెగటివ్ ఇంపాక్ట్ కూడా సమాజం మీద ఉంటుంది. ఇంటర్నెట్ వచ్చిన తరువాత హాట్ మెయిల్ నుండి మొదలుకొని యాహూ మెసెంజర్ వరకు తొంబైల్లో యువత సమయాన్ని వృధా చేస్తే, 2000 నుండి రకరకాల డిస్కషన్ ఫోరమ్స్, బ్లాగ్స్, ఆర్కూట్ వంటి సోషల్ మీడియా భారిన పడి అనేక మంది తమ విలువయిన సమయాన్ని వృధా చేసుకున్నారు. తాజాగా వాట్సాప్, పేస్ బుక్ వంటి సోషల్ మీడియా సైట్స్ 2010 నుండి ప్రపంచ యువత ప్రొడక్టివిటీని కిల్ చేస్తున్నాయని సర్వేలు చెబుతున్నాయి.
ఎందుకు యువత సోషల్ మీడియాకి బానిసగా మారుతుంది. తన కెరీర్, కొన్నిసార్లు జీవితాలను ఫణంగా పెట్టి కూడా సోషల్ మీడియా మీదనే సమయం వెచ్చించడానికి కారణం ఏంటి? బ్లూ వేల్ ఛాలెంజ్ కాదు సోషల్ మీడియానే ఒక పెద్ద బ్లూ వేల్ అయ్యిందన్న విషయాన్నీ యువత ఎందుకు గ్రహించలేకపోతుంది? దీని వెనుక ఉన్న మానసిక కారణాలు ఏంటి?
ప్రపంచీకరణ తరువాత ప్రతీ వ్యాపారానికి కన్సూమర్స్ కేవలం ఒక దేశమో ఒక ప్రాంతమో కాకుండా ప్రపంచం మొత్తం ఉంటున్నారు. కాబట్టి వ్యాపారస్తులు ప్రపంచ వ్యాప్తంగా అధికంగా కొనుగోలు శక్తి ఉండి మానసికంగా బలహీనంగా ఉన్న డెమోగ్రఫీని ఉద్దేశ్యంలో పెట్టుకొని తమ వ్యాపారాలను డిజైన్ చేస్తుంటారు. నలభై దాటినా వారికి కొనుగోలు శక్తి ఎక్కువ ఉన్నప్పటికీ వారు మానసికంగా ధృడంగా ఉండటం వల్ల తొందరగా టెంప్ట్ అయ్యే అవకాశాలు తక్కువ. అదే సమయంలో టీన్స్ నుండి మొదలుకొని కొత్తగా కెరీర్ లోకి ప్రవేశించిన వారు, కొత్తగా వైవాహిక జీవితంలోకి ప్రవేశించిన వారికి సరిపడా డబ్బు ఉండి, ప్రతీ విషయాన్నీ తొందరగా అహానికి తీసుకుంటారు.
ప్రతీ విషయాన్నీ తొందరగా అహానికి తీసుకోవటం, తొందరగా జడ్జ్ చేసే కన్సూమర్స్ వ్యాపారస్తులకు మంచి కన్సూమర్స్ అవుతారు. వారిని ఆటిట్యూడ్ ని తమ వ్యాపారానికి అనుకూలంగా మార్చుకోవటం అత్యంత సులభం. ఒకసారి టీవీలలో, ప్రింట్ మీడియాలో వచ్చే అడ్వార్టైజ్మెంట్స్ ని గమనించినట్లయితే అవి పూర్తిగా మానసికంగా బలహీనంగా ఉన్నవారిని టార్గెట్ చేసి రూపొందించినవై ఉంటాయి.
అదే వ్యాపార సూత్రాన్ని తీసుకొని రూపొందించబడినవి ఈ సోషల్ మీడియా సైట్స్. సోషల్ మీడియా వ్యాపారపరమైన విజయం వ్యక్తుల మానసిక బలహీనతల మీద ఆధారపడి ఉంటుంది. ప్రత్యేకంగా ఫేస్ బుక్ వ్యక్తులలో అహాన్ని నింపే ప్రక్రియ వేరే ఏ సోషల్ మీడియా సైట్ చెయ్యలేక పోయింది. ఆర్కూట్ లో కొంత వరకు అది జరిగినా అక్కడ మనం ఎవరి ప్రొఫైల్ ని చూస్తామో అన్న విషయం బహిరంగం అవ్వటం వల్ల వ్యక్తుల అహాలు దెబ్బతినేవి. సరిగ్గా అదే అంశాన్ని ప్రైవసీ చేస్తూ పేస్ బుక్ తన మాయాజాలాన్ని ప్రజల మీదకు వదిలింది. ఎట్టి పరిస్థితులలోను ఒకరి ప్రొఫైల్ ఎవరెవరు చూసారు అన్న విషయాన్నీ పేస్ బుక్ బయటకు చెప్పదు. మీ ప్రొఫైల్ ఎవరు చూసారో చెబుతామని కొన్ని యాప్స్ వచ్చినా అవి కేవలం గెస్ మాత్రమే చేస్తాయి గాని ఖచ్చితమైన సమాచారాన్ని ఇవ్వలేవు.
ఇక పోతే పేస్ బుక్ పోస్టులకు అంతేంటీసీ అవసరం లేదు. ఎవరు ఎవరి మీదయినా, దేని మీదనయినా తమ అభిప్రాయాలూ వ్యక్తం చెయ్యొచ్చు. ఇది చాల వరకు వ్యకి అహాన్ని చల్లార్చుకోడానికి ఉపయోగపడుతుంది. ఇందులో అహంతో కూడిన వ్యక్తులకు అత్యంత సహాయ పడుతున్నవి వ్యక్తులపై పెట్టే ఇండైరెక్ట్ పోస్టులు. వీరు ఎవరి మీద పెడుతున్నారో వారికి ఇవి చేరవు. వీరి చుట్టూ ఉన్నవాళ్లు వీరికి చప్పట్లు కొట్టడంతో అహం కొంత వరకు కుదుటపడుతుంది. అప్పటికి అప్పుడు ఈ ప్రాక్టీస్ వ్యక్తుల ఎమోషన్స్ తగ్గించుకోడానికి ఉపయోగపడుతున్నా దీర్ఘ కాలంలో వారు పేస్ బుక్ కి బానిసగా అయ్యేటటువంటి అవకాశాలు ఉన్నాయి.
ప్రస్తుత కాలంలో ప్రపంచంలో డ్రగ్స్ కన్నా ఎక్కువగా అత్యధిక యువతను నిర్వీర్యులుగా చేస్తున్నది సోషల్ మీడియా అనటంలో సందేహం లేదు. కొద్దిగా పాజిటివ్ ఇంపాక్ట్ ఉన్నప్పటికీ కేవలం హైసెల్ఫ్ ఎస్టీమ్ ఉన్నవారు మాత్రమే దీనిని ఉపయోగించుకో గలుగుతున్నారు. కాబట్టి ఎవరికీ వారు తాము ఎంత సమయం ఎందు కోసం సోషల్ మీడియాలో గడుపుతున్నామో ప్రశ్నించుకుని తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది.
- హరి రాఘవ్
Keywords : facebook, orkut, social media, teens, consumers
(19.09.2017 12:42:37pm)
No. of visitors : 230
Suggested Posts
5 results found !
| ఫేస్బుక్ ఓసీడీ (FBOCD)ఫేస్బుక్ ఓసీడీ (FBOCD) మూడు రకాలుగా ఉంటుంది. ఇందులో #మొదటి రకం వారు తెల్లవారు ఝామున లేచిన వెంటనే ʹగుడ్ మార్నింగ్ʹ అంటూ పోస్ట్ పెట్టడడం తో ప్రారంభమయి అర్థ రాత్రి గుడ్ నైట్ అని పెట్టే వరకు కొనసాగుతుంది. ఈ మధ్యలో |
| సోషల్ మీడియాలో పోకిరీల భారిన పడకుండా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి?సోషల్ మీడియాలో పోకిరీల భారిన పడకుండా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? |
| ఫేస్బుక్ పోస్టులను బట్టి ఒత్తిడి అంచనా?ప్రతీ వ్యక్తి జీవితకాలంలో రక రకాల స్థితులలో ఒత్తిడికి లోనవుతూ ఉంటాడు. ఆ సందర్భాలలో అతని నిర్ణయాలను ఒత్తిడి ప్రభావితం చేస్తుంటుంది. అతని ప్రవర్తన కూడా సరిగా లేకపోవడం గమనించవచ్చు. చాలాసార్లు ఒత్తిడిలో తీసుకున్న నిర్ణయాల వల్ల మానవ సంబంధాలు దెబ్బతినే అవకాశాలుంటాయి. వ్యాపారపరంగా నష్టాలను చవి చూడవచ్చు. ఎదుటి వ్యక్తి ఒత్తిడిలో ఉన్నాడు అన్నసంగతిని గమనించాల్సిన |
| మానసిక రుగ్మతలకు కారణమవుతున్న ఫేస్ బుక్సైకాలజిస్ట్ ఒక వ్యక్తి మానసిక సమస్య గురించి విశ్లేషించేటపుడు ఆ వ్యక్తి శారీరక అంశాలతో పాటు బాల్యం, విద్య, అతను పెరిగిన వాతావరణం, సంస్కృతి, ప్రేమ, ప్రస్తుత వైవాహిక, సామాజిక, ఆర్థిక పరిస్థితులు వంటి ఎన్నో వాటిని అధ్యయనం చేస్తాడు. కొన్ని వివిధ రకాల సైకలాజికల్ టెస్ట్స్ ద్వారా తెలుసుకుంటే కొన్ని అతనితో సంభాషించడం ద్వారా, కొన్ని ఆబ్సెర్వేషన్ ద్వారా తెలుసుకుంటా |
| యువతను డిప్రెషన్ లోకి నెడుతున్న ఫేస్బుక్ప్రస్తుత సోషల్ మీడియాలో ఫేస్బుక్ దే అగ్రస్థానం. దాదాపు సోషల్ మీడియా ఉపయోగించే వారందరికీ ఫేస్బుక్ అకౌంట్ ఉంటుంది. ట్విట్టర్ తో సహా అనేక ఇతర సోషల్ మీడియా సైట్ లు ఉన్నప్పటికీ ఫేస్బుక్ ఇచ్చేటటువంటి ఫీచర్స్ వల్ల యూజర్స్ ఫేస్బుక్ కి అతిగా అటాచ్ అవుతున్నారు. కొందరు రోజుకు 6 నుంచి 8 ఫేస్బుక్ లో గడపటం కూడా జరుగుతుంది. సామజిక ఉద్యమాలకు, భావజాల వ్యాప్తికి ఫేస్బుక |
| డాలర్లు వస్తున్నాయి గాని ఎండ రావడం లేదు |
| కెరీర్ మీద ఇంటరెస్ట్ ఎలా వస్తుంది? |
| టీనేజ్ కి వచ్చిన పిల్లలతో ఎలా ప్రవర్తించాలి? |
| మీ పిల్లలను అనుమానంతో దండిస్తున్నారా? |
| మీ పిల్లలకు స్మార్ట్ ఫోన్స్ ఇస్తున్నారా? |
| NRI పేరెంట్స్ పిల్లల విషయంలో శ్రద్ధ వహించాల్సిన అంశాలు |
| టీనేజ్ ఆడపిల్లలకు సోషల్ మీడియాలో ఎదురయ్యే ఇబ్బందులేంటి? |
| బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్ళే ముందు తరువాత ప్రవర్తన |
| పిల్లలను కనాలి అనుకున్నపుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? |
| మీ పిల్లల ముందే మీరు పోట్లాడుకుంటున్నారా? జాగ్రత్త!! |
| పిల్లలకు ఆటలను దూరం చేస్తున్నారా? |
| మనుసులో భావాలే కలలుగా వస్తాయా? |
| Love | మనం నిజంగా ప్రేమిస్తున్నామా..? |
| తల్లిదండ్రుల మానసిక సమస్యలు పిల్లలకు వారసత్వంగా వస్తాయా? |
| టీనేజ్ అమ్మాయిలతో పేరెంట్స్ ఎలా మెలగాలి? |
| మనిషి జీవితం జీవించడానికా? శోధించడానికా? |
more..