జీవితం
మోహన్ కుమార్ దిగువ మధ్యతరగతి కి చెందిన దంపతులకు జన్మించాడు. తల్లిదండ్రులిద్దరూ గవర్నమెంట్ టీచర్స్ అవ్వటంతో వారు తమ కొడుకుని మంచి ఇంగ్లీష్ మీడియం స్కూల్లో చదివించారు. ప్లే గ్రౌండ్ లేని స్కూల్ లో పూర్తి చదువుమీద ఏకాగ్రతతో చదివిన మోహన్ ఎప్పుడూ స్కూల్ ఫస్ట్ వచ్చేవాడు. నెల్లూరు పంపించి అతనికి ఎంసెట్ కోచింగ్ ఇప్పించడంతో మంచి కాలేజీ లో ఇంజనీరింగ్ సీట్ వచ్చింది.
థర్డ్ ఇయర్ లోనే క్యాంపస్ ప్లేసెమెంట్, బ్రహ్మాండమయిన శాలరీతో ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో జాబ్ వచ్చింది. జాబ్ లో జాయిన్ అయిన మూడు నెలలలోనే రియల్ ఎస్టేట్ కంపెనీ వాళ్ళు అతని చుట్టూ తిరగటం. బ్యాంక్స్ లోన్ ఇష్టము మొర్రో అని మొత్తుకోవటంతో హైదరాబాద్ శివారులో ఒక అపార్ట్మెంట్ తీసుకున్నాడు. వెంటనే తల్లిదండ్రులు అతనికి పెళ్లి సంబంధాలు వెతకటం ప్రారంభించారు. చిన్నప్పుడు తన వీధి చివర ఉండే నళిని అంటే అతనికి చాల ఇష్టం. ఒక రోజు ధైర్యం చేసి పేరెంట్స్ కి చెబితే వారు ఇంటర్ క్యాస్ట్ అనే వంకతో తిరస్కరించారు. పేరెంట్స్ వేసుకున్న లెక్కలతో తూగే సరయిన పార్టీ దొరకక పోవడంతో మోహన్ కి 30 ఏండ్లు దాటాయి. తనతో పాటు జాబ్ చేసే ఒక అమ్మాయి తో స్నేహం ఏర్పడటం తో పేరెంట్స్ వద్దకు మళ్ళీ ప్రపోసల్ తెచ్చాడు. జాబ్ చేస్తున్న అమ్మాయి మరియూ ఆమె పేరెంట్స్ కి ఉన్న ఆస్తులు అన్నీ లెక్క కుదరడంతో ఈసారి ఆదర్శ వివాహానికి పచ్చ జెండా ఊపేసారు మోహన్ పేరెంట్స్.
పెళ్లయిన వెంటనే మరో ట్రిపుల్ బెడ్ రూమ్ ఫ్లాట్ బుక్ చేశారు. పిల్లలు వద్దనుకున్నా సరయిన కేర్ తీసుకోకపోవటంతో ఒక కూతురు పుట్టింది. ప్రెగ్నెంట్ సమయంలో జాబ్ మానెయ్యలేని పరిస్థితుల వల్ల విపరీతమయిన స్ట్రెస్ అనుభవించిన భార్య ఆరోగ్యం బాగా దెబ్బతింది. కూతురు పుట్టాక ఆమెకు ఆన్ సైట్ ఆఫర్ రావటంతో కూతురుని అత్తమామలకు వదిలి అమెరికా వెళ్ళింది. వెళ్లిన ఆరునెలలకు ఆరోగ్యం దెబ్బతినటంతో తిరిగి ఇండియా వచ్చేసింది. జాబ్ చెయ్యలేక పోవటంతో ఆమె ఇంటికి పరిమితం కావలసివచ్చింది.
మొత్తం ఫైనాన్సియల్ బర్డెన్ అంత తనమీద పడటం తో మోహన్ కుమార్ ఒక కంపెనీ నుండి మరో కంపెనీ కి మారుతూ మంచి ప్యాకెజీస్ సంపాదించుకుంటూ కష్టపడి సంపాదించాడు రెండు అపార్ట్మెంట్స్ కి తోడుగా విజయవాడలో స్థలం కూడా కొన్నాడు. తన చిరకాల వాంఛ అయిన ఆడి కార్ కూడా కొనుక్కున్నాడు. ఈ పది హేను సంవత్సరాలలో తిరుగులేని ఫెసిలిటీస్ ఏర్పరచుకున్నాడు. ఇప్పుడు మోహన్ కుమార్ వయస్సు నలభై అయిదు. భార్య కూతురుతో పాటు ఒక కుక్క పిల్లను కూడా పెంచుకుంటున్నాడు. ఆఫీస్ సమయంలో తప్ప మిగిలిన అన్ని సమయాలలో తాను ఆ కుక్కతోనే గడుపడం అలవాటు చేసుకున్నాడు. ఈ పదిహేను సంవత్సరాలలో ముప్పై కిలోలు బరువు పెరిగాడు. తనకు ఎప్పుడు వచ్చిందో తెలియదు కానీ ఇటీవల చెక్ చేసుకుంటే తనకు విపరీతమయిన హైపర్ టెన్షన్, డయాబెటిస్ ఉన్నట్లు తెలుసుకున్నాడు. ఇంతకు ముందు లాగ పని చెయ్యలేక పోతున్నాడు. డాక్టర్లు ఫిసికల్ ఎక్సరసైజ్ తప్పని సరి అని చెప్పారు. లేదంటే ఇంకా మూడు నాలుగు సంవత్సరంలో ఆరోగ్యం మరింత క్షీణించే అవకాశం ఉంది.
ఫుడ్ లో స్ట్రిక్ట్ రెస్ట్రిక్షన్స్. దానితో మోహన్ ప్రతీరోజు విపరీతమయిన ఆకలి, నీరసంతో బాధపడుతున్నాడు. ఆఫీస్ కి వెళ్ళక తప్పదు. ఇంకా కట్టాల్సిన EMI లు చాల ఉన్నాయి. భార్య విసుక్కుంటుంది. పేరెంట్స్ వృద్దులు అయిపోయారు. కూతురు ప్లే గ్రౌండ్ లేని హై స్కూల్ చదువుతుంది. కూతురు, భార్య కూడా తనకు ఏమాత్రం తీసిపోనీ బరువు పెరిగిపోయారు. వద్దన్నా కూతురు పీజ్జాలు తింటూ, కూల్ డ్రింక్స్ తాగేస్తుంది. రోజు రోజుకూ కరెన్సీ విలువ తగ్గి పోతుంది. ఖర్చులు పెరిగిపోతున్నాయి. స్ట్రెస్ పెరుగుతుంది. డాక్టర్స్ సీరియస్ వార్నింగ్ ఇచ్చారు ప్రతీ రోజు మార్నింగ్ వాక్ తప్పకుండ చెయ్యాలి.
అటువంటి స్థితిలో ఒక వేసవి కాలం ఉదయం ఏడున్నరకు వెళ్లాల్సిన మార్నింగ్ వాక్ ఎనిమిదిన్నర అయ్యింది. తనతో రోజు కుక్క కూడా వాక్ కి వస్తుంది. కుక్కను తాను కంట్రోల్ చెయ్యలేక పోవటంతో దానిని ఎప్పుడు డ్రైవర్ తో కార్ లోనే వదిలేస్తాడు. డ్రైవర్ తనను నెక్-లెస్ రోడ్డులో దించి అక్కడకు 4 కిలోమీటర్ల దూరంలో ఉన్న మరో ప్లేస్ దగ్గర పిక్ అప్ చేసుకుంటాను అన్నాడు. మోహన్ కి ఎండలో చెమటలు కారిపోతున్నాయి. విపరీతమైన ఆకలి. ఈ లోపు ఇంట్లోకి కావలసిన కూరగాయలు కొనుక్కొని వస్తాను అని చెప్పి కార్ తీసుకొని డ్రైవర్ వెళ్ళిపోసాగాడు. ఆ క్షణం ఆడి కార్ లో ఏసీ లో ఉన్న కుక్క అతనివైపు చూస్తూ ఉంది. చెమటల కక్కుతూ నీరసంతో మోహన్ కుక్క వైపు చూస్తున్నాడు. కార్ నెమ్మదిగా వెళ్లి పోతుంది. ఏసీ లో ఉన్న కుక్క మోహన్ ని చూస్తూనేఉంది. ఎండలో చెమటలు కక్కుతూ మోహన్ కుక్కను చూస్తున్నాడు. కార్ వెళ్లి పోయింది.
- హరి రాఘవ్
Keywords : life, existentialism, dog
(18.09.2017 10:59:54pm)
No. of visitors : 686
Suggested Posts
10 results found !
| నిజం ఆవస్యకతనిజాన్ని తెలుసుకోవడం అవసరమే. కానీ ప్రతీ నిజాన్ని తెలుసుకోవడం వల్ల జీవితం వృధా అవుతుంది. జ్ఞానం అనంతం. మనిషి జీవితం పరిమితం. పరిమిత జీవితకాలంలో చాలా వరకు తనకు తెలియకుండా సమాజ ప్రభావంతో కొట్టుకుపోతాడు. తనకు అర్థమయ్యింది అనుకునే లోపే తను అర్థం చేసుకున్నదంతా తప్పని అర్థమవుతుంది.
మనిషి తన మానసిక జీవితానికి సంబంధం లేని ఏ నిజాన్ని తెలుసుకున్నా అది వృధానే. అంత |
| నిజాలన్నీ అబద్దాలేమనిషి ప్రతీ క్షణం తన గతం నుండి భవిష్యత్తులోకి ప్రయాణం చేస్తూనే ఉంటాడు. జీవం ఉన్నంత వరకూ తనకు ఇష్టం ఉన్నా, లేకున్నా తన జీవితంలో మార్పు సంభవిస్తూనే ఉంటుంది. కాబట్టి #నేనెవరు? అన్న ప్రశ్నకు మనిషి దగ్గర ఎప్పటికీ సమాధానం ఉండదు. నేను ఫలానా అని చెప్పింది కేవలం తన గతం నుంచి తీసుకున్న కొంత భాగం లేదా ప్రస్తుతంలో తను అనుకున్న, చెప్పిన లక్షణం మాత్రమే.
ప్రతీ మనిషి త |
| జీవితంఆధునిక కాలంలో మనిషి తన జీవితంలో ఎదురయ్యే ఆనందాన్ని అనుభవించడం కన్నా, తను ఆ స్థితికి చేరుకున్నాని ఇతరులకు తెలియజేయడంలో ఆనందాన్ని వెతుక్కుంటున్నాడు. అనుకోకుండా ఒక ఆహ్లాదకరమైన వాతావరణం ఏర్పడినా లేదా ఏదైనా విహార యాత్రకు వెళ్ళినా ఆ అందమైన అనుభూతులను ఆస్వాదించ కుండా అక్కడ సెల్ఫీలు ఎలా తీసుకుంటే బాగుంటదో అనే ఆలోచనలే వారి మనస్సులో మొదలవుతాయి. |
| మనిషి జీవితం జీవించడానికా? శోధించడానికా?ఇతర జంతువులకు లేని అద్భుతమైన జ్ఞాపక శక్తి, సృజనాత్మక శక్తి మనిషికి లభించింది. అదే సమయంలో మనిషి ఆ జ్ఞాపక శక్తి, సృజనాత్మక శక్తి మనిషిని అనంతమైన దుఃఖంలోకి నెట్టివేస్తుంది. లభించిన సమాచారంలో అవసరమైనదేదో అనవసరమైనదేదో తేల్చుకోలేక ప్రతీ సమాచారాన్ని పరిగణలోకి తీసుకొని అవసరం లేని భయాలను, వేదనను పెంచుకోవడంలో మనిషి సిద్ధహస్తుడు. మనిషి తనకున్న భయాల నుంచి ఒక అభయం క |
| పోరాటమా? బ్రతుకా?మెయిన్ స్ర్టీమ్ మీడియా లాగా కాకుండా ఫేస్‌బుక్ గ్రూప్స్ లోను, ఇతర సామాజిక మాధ్యమాలలోను ప్రతీఒక్కరు స్పందించే అవకాశం ఉంటుంది. ఇది ఒక మంచి పరిణామం. ఏ సమస్యకయినా పరిష్కారం కనుగొనడంలో చర్చించడం ఒక ఉన్నతమయిన మార్గం. అయితే ఇందులో ఉన్న ఇబ్బంది ఏంటంటే చాలామంది చర్చల వరకే పరిమితం అవుతారు. |
| భార్యభర్తల మధ్య విభేదాలకు కల్చర్ ఎలా కారణమవుతుంది? వైవాహిక జీవితంలో కులాంతర, మతాంతర, ప్రాంతాంతర అంశాలు ప్రభావితం చేస్తాయా? ఒకవేళ అటువంటి అంశాలుంటే వాటిని ఎలా ఎదుర్కోవాలి? క్రాస్ కల్చర్ మ్యారేజ్ లలో చిన్నచిన్న ఇబ్బందులను సరయిన రీతిలో అర్థం చేసుకోకపోతే ఎలా జీవితాల మీద ప్రభావితం చేసే అవకాశం ఉంది? |
| సాంకేతిక అగాధంలో మనిషి..కాలానుగుణంగా సాంకేతిక పరిజ్ఞానం పెరుగుతూ వస్తుంది. ఒకప్పుడు పచ్చి మాంసం, పండ్లు తినే మనిషి మంటను కనుగొనడడం మానవ చరిత్రలో అతి పెద్ద అభివృద్ధి(?)గా భావించవచ్చు. తరువాతి క్రమంలో ఇంధనాలను మండించడం ద్వారా పారిశ్రామిక రంగాలకు పునాది పడింది. తదుపరి విద్యుత్తును కనిపెట్టడం ద్వారా మానవ, జంతు శ్రమకు బదులుగా విద్యుత్తును వాడుకునే పరికరాలు రూపొందాయి. చివరికి కుట్టు |
| ఆనందం నీ ఛాయస్ఈ విశ్వంలో జరిగిన ప్రతీ సంఘటనకు వెనుక ఏదో ఒక కారణం ఉంటుంది. కారణం లేకుండా ఏదీ జరగదు. అయితే జీవించడానికి మాత్రం ఏ కారణం అవసరం లేదు. చాలామంది తామ జీవితం దుర్భరంగా మారినపుడు అసలు తాము ఎందుకు జీవిస్తున్నామో అర్థం కావడం లేదు అని అంటుంటారు. కొందరి వైవాహిక సంబంధాలు దెబ్బతిన్నపుడు పిల్లల కోసం జీవిస్తున్నట్లు చెప్పుకుంటారు. కానీ వ్యక్తి తన జీవితం ఎప్పుడూ తన కోసమ |
| ఆనందపు తలుపులుమనిషి జీవితానికి పరమార్థం వెతికే పనిలో పడతారు కొందరు మేధావులు. హాయిగా జీవించడమే తప్ప మారే పరమార్థం ఉండేది తెలుసుకుంటారు అందులో కొందరు. భార్య పిల్లలను వదిలి జ్ఞానం కోసం వెళ్లిన బుద్ధుడు ప్రపంచాన్ని గురువు, దేవుడు అయ్యాడు. కానీ ఆ భార్య పిల్లల దృష్టిలో బుద్ధుడు వేరు. సమాజంలో ఉన్న స్థితిని మరచి, ఉన్న భాద్యతలు మరచి భవిష్యత్తుకు ఇతరులను వదిలి వెళ్లడం వల్ల సమాజ |
| లైఫ్ ఛేంజింగ్ ఇయర్ - 2018మిత్రువులందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈ రోజు నుండి నూతన సంవత్సరం ప్రారంభమవుతుంది. నిజానికి ప్రకృతిలో ఏదీ మారదు. మారాల్సింది మనం. మార్పు రావలసింది మన ఆలోచన విధానంలో. మనం మారితే ప్రపంచం మారుతుంది. మనం మారితే తోటి వారిలో మార్పు వస్తుంది. ముఖ్యంగా విద్యార్థులు గమనించాల్సిన విషయం ఇది. మనం సమర్థవంతంగా మన టైం ని మేనేజ్ చేసుకోకుండా ఏవో వంకలు వెతుక్కోవటం లోన |
| డాలర్లు వస్తున్నాయి గాని ఎండ రావడం లేదు |
| కెరీర్ మీద ఇంటరెస్ట్ ఎలా వస్తుంది? |
| టీనేజ్ కి వచ్చిన పిల్లలతో ఎలా ప్రవర్తించాలి? |
| మీ పిల్లలను అనుమానంతో దండిస్తున్నారా? |
| మీ పిల్లలకు స్మార్ట్ ఫోన్స్ ఇస్తున్నారా? |
| NRI పేరెంట్స్ పిల్లల విషయంలో శ్రద్ధ వహించాల్సిన అంశాలు |
| టీనేజ్ ఆడపిల్లలకు సోషల్ మీడియాలో ఎదురయ్యే ఇబ్బందులేంటి? |
| బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్ళే ముందు తరువాత ప్రవర్తన |
| పిల్లలను కనాలి అనుకున్నపుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? |
| మీ పిల్లల ముందే మీరు పోట్లాడుకుంటున్నారా? జాగ్రత్త!! |
| పిల్లలకు ఆటలను దూరం చేస్తున్నారా? |
| మనుసులో భావాలే కలలుగా వస్తాయా? |
| Love | మనం నిజంగా ప్రేమిస్తున్నామా..? |
| తల్లిదండ్రుల మానసిక సమస్యలు పిల్లలకు వారసత్వంగా వస్తాయా? |
| టీనేజ్ అమ్మాయిలతో పేరెంట్స్ ఎలా మెలగాలి? |
| మనిషి జీవితం జీవించడానికా? శోధించడానికా? |
more..