హేతువాదం
ఒక వ్యక్తి తాను బాహ్యప్రపంచం నుండి గ్రహించిన సమాచారం తన మనస్సులో ఉన్న జ్ఞాపకాలతో విశ్లేషించినపుడు తనకు ఒక ఆలోచన లేదా అభిప్రాయం ఏర్పడుతుంది. అలా ఏర్పడిన అభిప్రాయం కాలక్రమేణా విశ్వాసంగా, నమ్మకంగా మారుతుంది. ఎప్పుడయితే ఆ సమాచారం నమ్మకంగా మారిందో ఆ తరువాత అదే సమాచారాన్ని ప్రతీసారీ విశ్లేషించకుండా తన నమ్మకాన్ని మాత్రమే తీసుకోవటం జరుగుతుంది. దీనిని మెంటల్ షార్ట్ కట్ అంటాము. సమయాభావం వల్ల లేదా మానసిక శ్రమ చెయ్యటానికి సిద్ధంగా లేనపుడు వ్యక్తి పూర్తిగా తన నమ్మకాల మీద ఆధారపడతాడు.
ఒక వ్యక్తి తనకు ఏర్పడిన నమ్మకాన్ని ఇతరులకు వివరించినపుడు వారు ఇతని ప్రభావంలో ఉన్నట్లయితే వెంటనే అంగీకరిస్తారు. అలా కాకుండా ఎవరన్నా ఇతని నమ్మకాన్ని ప్రశ్నించినపుడు ఆ నమ్మకాన్ని హేతుబద్దంగా వివరించాల్సిన అవసరం ఉంటుంది. ఎప్పుడయితే రెండవ వ్యక్తికి కూడా ఇతని నమ్మకంలో హేతుబద్దత కనిపిస్తే అప్పుడు రెండవ వ్యక్తి దానిని అంగీకరించే అవకాశం ఉంటుంది. లేనట్లయితే ఆ నమ్మకం తిరస్కరించబడుతుంది.
హేతువు అంటే కారణం. ఏదయినా ఒక చర్యకు కారణాన్ని భౌతికంగా రుజువులతో చూపడం కానీ లేదా లాజికల్ గా వివరించడాన్ని హేతుబద్ధ వివరణ అంటారు. ప్రతీ విషయాన్నీ ప్రశ్నించి, పరిశోధించి మూల కారణాన్ని అన్వేషించడాని హేతుబద్ధ ఆలోచన అంటారు. అలా కాకుండా ఆ సమాచారం అందించిన వ్యక్తి మీద లేదా పుస్తకం మీద ఉన్న గౌరవంతో కానీ, లేదా మరేదయినా ఎమోషన్స్ తో గాని అంగీకరించినా అంది అహేతుకం అవుతుంది.
ఆదిమకాలం నుంచి మనిషి ఎమోషన్స్ ఒకవైపు విషయాన్నీ హేతుబద్దంగా విశ్లేషించకుండా అంగీకరించేలాగా చేస్తుంటే మరోవైపు హేతుబద్దంగా విశ్లేషించడం ద్వారా ప్రగతి సాధిస్తున్నాడు. హేతుబద్దమయిన ఆలోచనే మనిషి నిప్పుని కనుగొనటం నుండి విద్యుత్తు, టెలిఫోన్, కంప్యూటర్ వరకు సాంకేతిక అభివృద్ధికి ఉపయోగపడింది. అంతే కాకుండా మనిషి సమాజంగా ఏర్పడి బలహీనుడికి కూడా ఈ ప్రకృతిలో బ్రతికే హక్కుని, విలువలను ఏర్పాటు చేసుకోటానికి కూడా హేతువాదం తోడ్పడింది.
మనిషి తాను అంగీకరించినా అంగీకరించక పోయినా విషయాన్నీ ఇతరులకు వివరించేటపుడు హేతుబద్దంగానే వివరించాలి. చివరికి హేతువాదం అవసరం లేదు అనేవాళ్ళు కూడా ఎందుకు అవసరం లేదో హేతుబద్దంగా వివరించాలి. కానీ మత విశ్వాసాలను, లేదంటే పెట్టుబడి దారులు నిర్వచించే విలువలను మూఢంగా విశ్వసించే వారు హేతువాదం అవసరం లేదు అని విశ్వసిస్తారు. దానిలో వారికి రకరకాలయిన లాభాలు ఉంటాయి. కాబట్టి వారు ప్రజలను హేతువాదంను అంగీకరించనివ్వకుండా బలవంతంగా మూఢ విశ్వాసాలలో మ్రగ్గే లాగా చేస్తుంటారు.
ప్రస్తుతం సమాజం సమాచార యుగంలో ఉంది. ఎటువైపు చూసినా సమాచారం. పుస్తకాల నుంచి మొదలుకుని, టీవీలు, కంప్యూటర్స్, స్మార్ట్ ఫోన్స్, టాబ్స్ ఇలా రకరకాల డివైసెస్ ద్వారా నిరంతరం మనిషికి సమాచారం లభిస్తుంది. అయితే ఈ సమాచారంలో ఏది సత్యం ఏది అసత్యమో తెలుసుకోవటం ప్రస్తుత సమాజంలో మనిషికి నిజంగా ఒక ఛాలెంజ్. ఒక సమాచారాన్ని విశ్వసించే లోపు దానికి భిన్నమయిన వాదన వచ్చేస్తుంది. అది విశ్వసించేలోపు అది సత్యం కాదు అంటూ మరొక సమాచారం వస్తుంది. ఇటువంటి తరుణంలో మనిషి ఖచ్చితంగా హేతుబద్ధ ఆలోచనా విధానాలను తెలుసుకొని అవలంభించాల్సి వస్తుంది. లేదంటే నిత్యం సమాచార హోరులో ఎటు కొట్టుకుపోతాడో తనకే అర్థం కాదు.
అయితే ప్రస్తుత బిజీ జీవితాలలో మనిషి దేనినీ హేతుబద్దంగా విశ్లేషించే సమయం గాని, ఓపిక గాని ఉండటం లేదు. దానికి తోడు విద్య విధానాలు కూడా కేవలం ఉద్యోగస్తులను తయారు చెయ్యటం మాత్రమే తమ అంతిమ లక్ష్యంగా డిజైన్ చెయ్యబడటంతో నేడు విద్యార్థి విషయాన్నీ అంగీకరించడం కానీ, ఖండించడం గాని చేస్తున్నాడు తప్ప హేతుబద్దంగా విశ్లేషించలేక పోతున్నాడు. ఈ విధమయిన జీవితాలలో ప్రతీ వ్యక్తి విషయాలను విశ్లేషించకుండా ఏదో ఒక స్టాండ్ తీసుకొని దానిని మూఢంగా విశ్వసిస్తున్నాడు. ఫలితంగా వారి పట్ల వారికి నమ్మకం తగ్గిపోయి ఏ సమస్య వచ్చిన న్యూమరాలజిస్టుల వద్దకో , జ్యోతీష్యుల వద్దకో లేదా బాబాలు, ముల్లాలు, పాస్టర్ల వద్దకో వెళ్తున్నారు. పెట్టుబడి దారులు, మతం ఆధారంగా రాజకీయాలు చేసేవారు ప్రజలలోని ఈ మూఢ విశ్వాసాలను పెంపొందించి రకరకాలుగా వారిని బానిసలుగా చేసుకుంటున్నారు.
మూఢ విశ్వాసాలకు వ్యతిరేకంగా ప్రజలను చైతన్య పరిచే హేతువాదుల మీద దాడులు చేసి హతమార్చడం మొదటి నుంచి ఉన్నప్పటికీ గత కొన్ని సంవత్సరాలుగా ఎక్కువయ్యాయి. బహిరంగంగా చంపుతాము అని బెదిరించడం. చంపెయ్యాలి అని పిలుపులు ఇవ్వటం కూడా పెరిగింది. ఇటువంటి చర్యలకు పాల్పడే వారికి ప్రభుత్వాలు, పెట్టుబడి దారులు, కొన్ని మీడియా సంస్థలు అండగా ఉంటున్నాయి అనేది బహిరంగ రహస్యం. ఇటువంటి సమయంలో హేతువాదులు, మేధావులు, జర్నలిస్టులు ప్రజలను చైతన్య పరచవలసిన అవసరం ఎంతయినా ఉంది. బెదిరింపులు ఎవరికయినా వచ్చినపుడు మొహమాటం లేకుండా ఖండించి వారికి ప్రతీ ఒక్కరు అండగా నిలవాలి.
- హరి రాఘవ్
Keywords : rationalism
(17.09.2017 12:49:28pm)
No. of visitors : 2394
Suggested Posts
10 results found !
| పేదరికంలో ఆకలి చావులుంటాయి తప్ప ఆత్మహత్యలుండవుమనిషి ప్రాధమిక అవసరాలు తీరనిదే ఇతర విషయాలను పట్టించుకోడు. ప్రాధమిక అవసరాలకోసం తను ఏమయినా చేస్తాడు. సాటి ప్రాణిని చంపుతాడు. సాటి మనిషిని చంపుతాడు, అవసరమైతే బానిసత్వం వహిస్తాడు. ఎవరికయినా తలొంచుతాడు. అది మతమయినా, పెట్టుబడి దారుడయినా, దోపిడీ దారుడయినా.. ప్రాధమిక అవసరాలు తీరనిదే తను హేతుబద్దంగా ఆలోచించలేడు, సైంటిఫిక్ థింకింగ్ అలవర్చుకోలేడు.
సైన్స్ ఎప్పుడూ ఉ |
| అనైతిక హేతువాదం విషంపై వాక్యంలో 3 పదాలు ఉన్నాయి. 1) అనైతికత 2) హేతువాదం 3) విషం. ఈ మూడు పదాలను ఏ ఉద్దేశ్యంతో చెప్పబడినవో వివరించి విశ్లేషితే పూర్తిగా అర్థం అయ్యే అవకాశాలు ఎక్కువ.
విషం :
మొదట విషం అనే పదం గురించి విశ్లేషిస్తే అది ప్రమాదకరం, అపాయకరం అనే అర్థంతో వాడబడింది. అయితే ఇక్కడ ఎవరికి ప్రమాదకరం అనే విషయాన్ని చెప్పాలి. ఇది మానవాళి మొత్తానికి చెప్పబడినది. సాధారణంగా మానవా |
| హేతువాదులు అంటే ఎవరు?1) హేతువాదులు అంటే ఎవరు? విషయాన్నీ హేతుబద్దంగా విశ్లేషించి అర్థం చేసుకునేవారు. అలాగే ఇతరులకు వివరించేటపుడు హేతుబద్దంగా వివరించేవారు. హేతువాదులు అంటే హిందువులను తిట్టేవారు, ముస్లిమ్స్ ని తిట్టేవారు, క్రైస్తవులను తిట్టేవారు కాదు. తిట్టడం, పోట్లాడటం, అవమానించడం హేతువాదులు పని కాదు. ఎవరన్నా హేతువాదులు అలా చేస్తుంటే అది వారి వ్యక్తిగత లక్షణం తప్ప హేతువాదానిక |
| పూర్తి హేతుబద్ధత ఎంత వరకు సాధ్యం?సాధారణంగా వ్యక్తులు తమకు తాము హేతువాదులుగా చెప్పుకుంటారు. నాస్తికులే కాకుండా చాలామంది ఆస్తికులు కూడా తమను హేతువాదులుగా భావిస్తూ ఉంటారు. ప్రతీ ఒక్కరూ కూడా తమ ఆలోచన హేతుబద్దమైనదిగానే భావిస్తూ ఉంటారు. నిజంగా ప్రపంచంలో ఎవరయినా ఒక వ్యక్తి పూర్తి హేతుబద్దంగా ఆలోచించగలడా? అని ప్రశ్నించుకుంటే ʹలేదుʹ అనే సమాధానమే వస్తుంది. మనిషి ఆలోచనలను ప్రభావితం చేసే అంశాల గుర |
| హేతువాద వ్యాప్తికొంత కాలం క్రితం రాజస్థాన్ లోని జైసల్మేర్ అనే చిన్న పట్టణంలో ఒక పది మంది హేతువాదులు ఉండేవారు. వారు వారి ఉద్యోగాలు చేసుకొంటున్న క్రమంలో ఒకరి గురించి ఒకరు తెలుసుకొని స్నేహితులుగా మారారు. వారు పది మంది ప్రతీ ఆదివారం ఒకదగ్గర టీ, బిస్కేట్స్ తీసుకుంటూ హేతువాదం గురించి చర్చించుకునే వారు. అలాగే మూఢనమ్మకాల గురించి చర్చించుకునేవారు. మూఢనమ్మకాలు కలిగిఉన్నవారి మీద |
| వృద్ధాప్యంలో కొందరు నాస్తికులు ఎందుకు ఆస్తికులుగా మారతారు?హేతువాద నాస్తికుడిగా మారటం ఒక రాజకీయ పార్టీ నుండి వేరొక రాజకీయ పార్టీకి మారినట్లు కాదు. నిజమయిన హేతువాది మీద తీవ్రమయిన మానసిక ఒత్తిడి ఉంటుంది. దేనిని హేతుబద్దంగా ఆలోచించాలి, ఎంతవరకు హేతుబద్దంగా ఆలోచించాలి అనే విషయాలు అర్థం కాక ప్రతీ విషయాన్నీ తను హేతుబద్దంగా విశ్లేషించే ప్రయత్నం చేస్తాడు. అపరిమితంగా హేతుబద్ధ విశ్లేషణ వల్ల అతను పడే మానసిక శ్రమ ఈ ఒత్తిడికి |
| మానవత్వం - హేతువాదంతల్లిదండ్రుల సమాధుల మధ్యలో ఒక చిన్న పిల్లవాడు నిద్రిస్తూ ఉండే ఒక ఫోటో సామాజిక మాధ్యమాలలో ఎప్పటినుండో హల్ చల్ చేస్తుంది. దానిని నమ్మిన వారు తిరిగి షేర్ చెయ్యటం జరుగుతూ ఉంది. అయితే కొంచెం రీసెర్చ్ చేస్తే అది ఒక ఫోటో షూట్ లో భాగంగా తీసింది. అది నిజం కాదు అని తెలుస్తుంది.
విషయం ఏమిటంటే ప్రతీ సందర్భంలోనూ మనస్సు హేతుబద్దంగానే ఆలోచిస్తోందా? అలాగే ఆలోచించాలా? కొ |
| నాస్తికత్వం - సైన్స్నాస్తికత్వం వేరు సైన్స్ వేరు. నాస్తికత్వం పరిధి చాల చిన్నది. దేవుడు, మతము మొదలైన ఆధ్యాత్మిక నమ్మకాలకు సంబంధిచినది మాత్రమే. సైన్స్ కి పరిధి లేదు. ఇది విశ్వం మొత్తానికి సంబంధిచినది. దీనికి ఆస్తికుడు, నాస్తికుడు, లేదా ఆ మతం వాడు ఈ మతం వాడు అని సంబంధం ఉండదు. పసిపిల్లవాడు తన తల్లి చనుబాలు త్రాగటం దగ్గరనుండి రాకెట్ ప్రయోగించడం వరకు ప్రతీ దానిలో సైన్స్ ఉంటుంది. |
| హేతువాదం - కమ్యూనికేషన్ఏదయినా ఒక విషయాన్నీ హేతుబద్దంగా కమ్యూనికేట్ చెయ్యాలి అంటే మొదట కమ్యూనికేషన్ గురించి కొంత అవగాహన ఏర్పర్చుకోవలసి ఉంటుంది. కమ్యూనికేషన్ అనగానే చాల మంది భాష అను |
| పరిమిత హేతువాదంకార్ల్ మార్క్స్, మావో, వివేకానంద, రమణానంద, గాంధీ, బుద్ధుడు లేదా మరెవరో చెప్పాడనో మనిషి ఆ సిద్ధాంతాలను పట్టుకొని వేలాడటం వృధా. ఈ స్థితి మానసికమైన జడత్వానికి |