ఒంటరి బిడ్డ
ఇందిరా గాంధీ హయాములో దేశంలో జనసాంద్రత ఎక్కువగా ఉంది దాన్ని నియంత్రించాలని కుటుంభం నియంత్రణ పథకాలను తెచ్చారు. ప్రభుత్వం చాల డబ్బు వెచ్చించి చిన్నకుటుంబం వల్ల కలిగే లాభాలను ప్రచారం చేసింది. ʹమేమిద్దరం మాకిద్దరుʹ అనే నినాదం దేశంలో ప్రతీ గ్రామంలో గోడలపైన దర్శనమిచ్చింది. పీవీ నరసింహారావు హయాంలో మొదలయిన గ్లోబలైజేషన్ వల్ల ప్రజలలో ఆర్థికంగా పోటీ పడటం పెరిగి చివరికి ఒక బిడ్డ చాలు అనే నిర్ణయానికి చాల మంది వచ్చారు.
మారిన సామజిక, ఆర్థిక పరిస్థితులలో ఒక్కరే బిడ్డని కనడం సాధారణం అయిపోయింది. అది ఫ్యాషన్ గా మారక పోయినా ప్రజల ఆర్థిక పోటీ తత్వం ఆ స్థితికి నెట్టివేసింది. ఒక్కరే బిడ్డ ఉండటం వల్ల చాల ఆర్థిక పరమైన లాభాలు ఉన్నాయి. అదే సమయంలో ఆ ప్రభావం ఆ బిడ్డ మానసిక స్థితిపైన కూడా ఉంటుంది. Child is the father of the man. ఒక వ్యక్తి మానసిక స్థితి అతను పెరిగిన వాతావరణాన్ని బట్టి ఉంటుంది. బాల్యంలో ఎదురయినా పరిస్థితులను బట్టి అతనిలో ఎమోషన్స్ ఉంటాయి. వ్యక్తి మానసిక స్థితి బర్త్ ఆర్డర్ ని బట్టి కూడా ఉంటుంది.
ఒక్కరే బిడ్డ ఉన్న ఇంట్లో పేరెంట్స్ బిడ్డ పట్ల ఓవర్ whelming రియాక్షన్ చూపిస్తూ ఉంటారు. వారి పిల్లలు పెద్దయ్యాక ఎలా ఉండాలి అనే ఊహను కేవలం ఆ బిడ్డ మీద మాత్రమే ఊహించుకోవటం వల్ల ఎక్కువగా బిడ్డ ప్రవర్తనను టీచింగ్ ద్వారా కంట్రోల్ చెయ్యాలి అని చూస్తారు. ఫలితం గా బిడ్డ సహజ స్థితిలో నేర్చుకోవలసినవి కూడా వేరొకరు టీచ్ చేస్తే నేర్చుకోవలసి వస్తుంది. తాను సహజంగా ఎదుర్కొన్న పరిస్థితులనుండి నేర్చుకున్న దానికి పేరెంట్స్ కండిషనల్ గా నేర్పించిన వాటికి తేడా ఉంటుంది. సహజ స్థితిలో మానసిక స్వేచ్ఛ ఉంటుంది. పేరెంట్స్ టీచ్ చేసిన దానిలో ప్రీ-కంక్లూషన్ ఉంది.
తల్లిదండ్రుల అతి శ్రద్ధ వల్ల బిడ్డ ఎమోషనల్ బ్లాక్ మెయిలింగ్ చెయ్యటం ప్రారంభిస్తాడు. ఉన్న ఒక్కగానొక్క బిడ్డ వ్యక్తిత్వం ఎలా మారుతుందో అన్న భయంతో పేరెంట్స్ డెసిషన్ మేకింగ్ లో తేడా వస్తుంది. ఫలితంగా ఆ బిడ్డ తనకు కావలసిన వాటిని ఎమోషనల్ బ్లాక్ మెయిలింగ్ ద్వారా ఎలా పొందాలో నేర్చుకుంటాడు. జీవితంలో అతను పెరిగిన తరువాత కూడా ఈ ఎమోషనల్ బ్లాక్ మెయిలింగ్ అతని వ్యక్తిత్వంలో ప్రతిఫలిస్తుంది.
ఒంటరి బిడ్డ బాల్యంలో ఎక్కువ సమయం తనకన్నా వయస్సులో చాల పెద్దవారయినా పేరెంట్స్ తోనే గడపడం వల్ల మాములు స్థితిలో పెరిగిన వారికంటే ఎక్కువ మెచ్యూర్డ్ గా ఉన్నట్లు ప్రవర్తిస్తారు. కానీ విషయం వచ్చేసరికి ఎమోషనల్ గా ఒక్కసారిగా బయట పడిపోవటం గమనించవచ్చు. చాల సార్లు మేధావిలా ప్రవర్తిస్తూ కొన్ని సార్లు దానికి పూర్తి భిన్నమయిన ప్రవర్తన కలిగి ఉంటారు. వీరిలో ఇతరులతో పోల్చితే ఎక్కువ arrogance ఉంటుంది. ఇతరుల మీద వెర్బల్ గా, ఫిసికల్ గా ఎక్కువగా దాడులు చెయ్యటాన్ని మనం గమనించవచ్చు. ఒంటరిగా పెరిగిన జీవిత భాగస్వామిని చేసుకున్నట్లయితే వీరి మధ్య ఇగో తో కూడిన conflicts ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. ఇతరులను, సమాజాన్ని జడ్జ్ చెయ్యటం, ఎలాగయినా విజయం సాధించాలి అనే విపరీతమయిన కోర్కె వీరిలో ఎక్కువ ఉంటుంది. వీరు చిన్న చిన్న ఓటమిని కూడా భరించలేరు.
- హరి రాఘవ్
Keywords : only child, single child, kids, parents, parenting
(16.09.2017 11:13:03pm)
No. of visitors : 809
Suggested Posts
10 results found !
| బయలాజికల్ మదర్19 సంవత్సరాల స్నేహ కడప జిల్లా జమ్మలమడుగు నుండి హైదరాబాద్ వచ్చి హాస్టల్లో ఉంటూ బి.ఫార్మసీ చదువుతుంది. గత కొన్ని నెలలుగా తీవ్రమైన డిప్రెషన్‌తో బాధ పడుతున్న స్నేహ కౌన్సిలింగ్ తీసుకుంటుంది. ఆమె బాల్యం గురించి లోతయిన విశ్లేషణ చేస్తున్నపుడు కొన్ని సున్నితమైన అంశాల పైన మరింత స్పష్టత వచ్చింది.
స్నేహకు ఊహ తెలిసీ తెలియని వయస్సులో తల్లి చనిపోయింది. బయటి వాళ్ళయితే |
| NRI పేరెంట్స్ పిల్లల విషయంలో శ్రద్ధ వహించాల్సిన అంశాలుNRI పేరెంట్స్ పిల్లల విషయంలో శ్రద్ధ వహించాల్సిన అంశాలు |
| టీనేజ్ ఆడపిల్లలకు సోషల్ మీడియాలో ఎదురయ్యే ఇబ్బందులేంటి?టీనేజ్ ఆడపిల్లలకు సోషల్ మీడియాలో ఎదురయ్యే ఇబ్బందులేంటి? |
| పిల్లలను కనాలి అనుకున్నపుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి?పిల్లలను కనాలి అనుకున్నపుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? |
| మీ పిల్లల ముందే మీరు పోట్లాడుకుంటున్నారా? జాగ్రత్త!!మీ పిల్లల ముందే మీరు పోట్లాడుకుంటున్నారా? జాగ్రత్త!! |
| పిల్లలకు ఆటలను దూరం చేస్తున్నారా?పిల్లలకు ఆటలను దూరం చేస్తున్నారా? |
| తల్లిదండ్రుల మానసిక సమస్యలు పిల్లలకు వారసత్వంగా వస్తాయా?తల్లిదండ్రుల మానసిక సమస్యలు పిల్లలకు వారసత్వంగా వస్తాయా? |
| ఒంటరి బిడ్డ వలన ఇబ్బంది ఏంటి?ఇందిరా గాంధీ హయాములో దేశంలో జనసాంద్రత ఎక్కువగా ఉంది దాన్ని నియంత్రించాలని కుటుంభం నియంత్రణ పథకాలను తెచ్చారు. ప్రభుత్వం చాల డబ్బు వెచ్చించి చిన్నకుటుంబం వల్ల కలిగే లాభాలను ప్రచారం చేసింది. ʹమేమిద్దరం మాకిద్దరుʹ అనే నినాదం దేశంలో ప్రతీ గ్రామంలో గోడలపైన దర్శనమిచ్చింది. పీవీ నరసింహారావు హయాంలో మొదలయిన గ్లోబలైజేషన్ వల్ల ప్రజలలో ఆర్థికంగా పోటీ పడటం పెరిగి చివర |
| పిల్లలు ఏవిధంగా మన నుంచి నేర్చుకుంటారు?పిల్లలు మన ద్వారా వచ్చారు గాని మనకోసం రాలేదు. వారు మనం ఏం చెబుతున్నామో అది కాకుండా మనం ఏం చేస్తూంటామో అది చూసి నేర్చుకుంటారు. పిల్లలకు బలవంతంగా రుద్దటం వల్ల నేర్చుకోక పోగా దానికి విరుద్ధంగా ప్రవర్తించే అవకాశముంటుంది. |
| కూతురి పెంపకంలో తండ్రి పాత్ర ఎందుకు ముఖ్యమైనది?ఆడపిల్లల మనస్తత్వం మగవాళ్ల మనస్తత్వానికి భిన్నంగా ఎందుకు ఉంటుంది? ఇరువురి ప్రవర్తనలో తేడాలు కారణాలేంటి? ఆడపిల్లల పెంపకంలో తండ్రి పాత్ర ఏంటి? తండ్రికి దూరంగా పెరిగిన ఆడపిల్లల్లో వచ్చే మానసిక సమస్యలేంటి? అటువంటి వారి పట్ల భర్త ఎటువంటి జాగ్రత్తలు వహించాలి? పెళ్లయ్యాక మగపిల్లలకు రాని మానసిక సమస్యలు ఆడపిల్లలకు రావడానికి కారణమేంటి? |
| డాలర్లు వస్తున్నాయి గాని ఎండ రావడం లేదు |
| కెరీర్ మీద ఇంటరెస్ట్ ఎలా వస్తుంది? |
| టీనేజ్ కి వచ్చిన పిల్లలతో ఎలా ప్రవర్తించాలి? |
| మీ పిల్లలను అనుమానంతో దండిస్తున్నారా? |
| మీ పిల్లలకు స్మార్ట్ ఫోన్స్ ఇస్తున్నారా? |
| NRI పేరెంట్స్ పిల్లల విషయంలో శ్రద్ధ వహించాల్సిన అంశాలు |
| టీనేజ్ ఆడపిల్లలకు సోషల్ మీడియాలో ఎదురయ్యే ఇబ్బందులేంటి? |
| బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్ళే ముందు తరువాత ప్రవర్తన |
| పిల్లలను కనాలి అనుకున్నపుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? |
| మీ పిల్లల ముందే మీరు పోట్లాడుకుంటున్నారా? జాగ్రత్త!! |
| పిల్లలకు ఆటలను దూరం చేస్తున్నారా? |
| మనుసులో భావాలే కలలుగా వస్తాయా? |
| Love | మనం నిజంగా ప్రేమిస్తున్నామా..? |
| తల్లిదండ్రుల మానసిక సమస్యలు పిల్లలకు వారసత్వంగా వస్తాయా? |
| టీనేజ్ అమ్మాయిలతో పేరెంట్స్ ఎలా మెలగాలి? |
| మనిషి జీవితం జీవించడానికా? శోధించడానికా? |
more..