మానవత్వం లేని ఏ వాదమయినా అది ఉగ్రవాదమే..
ఏ వాదమయినా ఏదో ఒక సందర్భంలో అప్పటి పరిస్థితులను బట్టి వ్యక్తుల ఆలోచనల నుండి పుడుతుంది. ఏవాదం కూడా దానికి అదిగా గాలిలో నుండి పుట్టదు. వాదం ఏదయినా అప్పుడు ఆ వాదాన్ని మొదలు పెట్టిన వ్యక్తులు ఎదుర్కొన్న పరిస్థితులను వ్యతిరేకిస్తూ పుడుతుంది తప్ప ఆ పరిస్థితులను అంగీకరిస్తే పుట్టదు. సో, అన్ని వాదాలు అవి పుట్టే సందర్భంలో అప్పటివరకు ఉన్న వాదాలను వ్యతిరేకిస్తూ తీవ్రమయిన సంఘర్షణలతో పుడుతుంది.
ఎవరి ఆలోచనల నుండి పుట్టిందో ఆ వాదం తరువాత ఆ వ్యక్తి కూడా వ్యతిరేకించే అవకాశం కూడా కొన్ని సందర్భాలలో ఉంటుంది. ఇక్కడ మనం వ్యక్తిని చలనంలో అర్థం చేసుకోవాలి. వ్యక్తి స్థిరం కాదు. వ్యక్తి మారుతూ ఉంటాడు. తనకు ఇష్టం ఉన్న లేకున్నా అతను మారుతూనే ఉంటాడు. చాల సందర్భాలలో ఆ వ్యక్తికీ తనలో వచ్చిన మార్పు అర్థం కాకా పోవచ్చు. ఒక వేళ వ్యక్తి తాను ప్రతిపాదించిన వాదానికి చివరి వరకు కట్టుబడి ఉన్నా అదే వాదం తరువాత (కొన్ని సందర్భాలలో అతను బ్రతికే ఉన్నా) మరికొందరి చేతులలోకి మారుతుంది.
అలా మారిన వాదం కొత్త వాళ్ళ చేతులలో ఆలోచనలకూ లేదా అవసరాలకు అనుగుణంగా మారుతుంది. ఇక్కడ మనం వాదం యొక్క స్వచ్ఛత కంటే దాని పేరు ఉపయోగించుకునే వాళ్ల సంఖ్యా మరియూ వాళ్ల బలం పైన ఆ మార్పు ఉంటుంది. ప్రపంచంలో ఏ వాదము కూడా స్వచ్ఛంగా కొనసాగలేదు. వ్యక్తుల అవసరాలను బట్టి దాని స్వరూపం పూర్తిగా మారిపోతుంది. బుద్ధిజంను గమనిస్తే మనకు ఈ మార్పు అర్థం అవుతుంది.
మానవ వాదము మూఢ విశ్వాసాలకు వ్యతిరేకంగా మనిషి భౌతికమైన ప్రపంచానికి దగ్గరగా ఆలోచన ఉండాలి ఆ ఆవిధంగా మనిషి బ్రతకాలి అనే సిద్ధాంతంతో పుట్టింది. అయితే తదుపరి చాలామంది మానవ వాదులం అనుకునే వాళ్ళు మత విశ్వాసాలు, దేవుడు వంటివి మాత్రమే మూఢ విశ్వాసాలు అని నమ్ముతారు. వాటిని గుడ్డిగా వ్యతిరేకించడం, గేళి చెయ్యటం మానవ విధంగా భావిస్తూ ఉంటారు.
వాదం ఏదయినా ఒక వ్యక్తి ఒక వాదం దగ్గర ఆగిపోయి దాని మీద విపరీతమయిన ప్రేమను, అభిమానం పెంచుకొంటే అంతటితో అతని ఆలోచన ఆగిపోతుంది. హేతుబద్దంగా అతని ఆలోచన చనిపోయినట్లు లెక్క. ఏ వాదాన్నయినా తెలుసుకోవాలి దాని తరువాత కూడా ప్రయాణం కొనసాగించాలి. కానీ కొందరు వ్యక్తులు తమకు అంది వచ్చిన ఏదో ఒక వాదాన్ని తీసుకొని ప్రచారం చేసి లబ్ది పొందుతారు. మానవత్వం లేని ఏ వాదమయినా అది ఉగ్రవాదమే..
- హరి రాఘవ్
Keywords : humanism, humanist, ism, philosophy
(07.02.2017 02:58:18pm)
No. of visitors : 912
Suggested Posts
1 results found !
| హ్యూమనిజంహ్యూమనిజం జంతువుల వలే కాకుండా మనిషి సహజంగా విలువలతో కూడిన ప్రవర్తన కలిగియుంటాడు, తరువాత సమాజ ప్రభావం వలన చెడుగా మారతాడు అని నమ్ముతుంది. దీనినే #హ్యూమనిస్టిక్ #సైకాలజీ అని కూడా అంటారు. పర్సన్ సెంటర్డ్ థెరపీ, సెల్ఫ్-యాక్షువలైజేషన్ వంటి థెరపీలు హ్యూమనిజంలో భాగాలు.
యాభైవ దశకంలో అబ్రహం మాసలౌ, కార్ల్ రోజర్స్, షార్లెట్ బహెల్ర్ మరియూ కొందరు సైకాలజిస్ట్లు ప్రతిప |
| డాలర్లు వస్తున్నాయి గాని ఎండ రావడం లేదు |
| కెరీర్ మీద ఇంటరెస్ట్ ఎలా వస్తుంది? |
| టీనేజ్ కి వచ్చిన పిల్లలతో ఎలా ప్రవర్తించాలి? |
| మీ పిల్లలను అనుమానంతో దండిస్తున్నారా? |
| మీ పిల్లలకు స్మార్ట్ ఫోన్స్ ఇస్తున్నారా? |
| NRI పేరెంట్స్ పిల్లల విషయంలో శ్రద్ధ వహించాల్సిన అంశాలు |
| టీనేజ్ ఆడపిల్లలకు సోషల్ మీడియాలో ఎదురయ్యే ఇబ్బందులేంటి? |
| బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్ళే ముందు తరువాత ప్రవర్తన |
| పిల్లలను కనాలి అనుకున్నపుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? |
| మీ పిల్లల ముందే మీరు పోట్లాడుకుంటున్నారా? జాగ్రత్త!! |
| పిల్లలకు ఆటలను దూరం చేస్తున్నారా? |
| మనుసులో భావాలే కలలుగా వస్తాయా? |
| Love | మనం నిజంగా ప్రేమిస్తున్నామా..? |
| తల్లిదండ్రుల మానసిక సమస్యలు పిల్లలకు వారసత్వంగా వస్తాయా? |
| టీనేజ్ అమ్మాయిలతో పేరెంట్స్ ఎలా మెలగాలి? |
| మనిషి జీవితం జీవించడానికా? శోధించడానికా? |
more..