బయలాజికల్ మదర్

బయలాజికల్

19 సంవత్సరాల స్నేహ కడప జిల్లా జమ్మలమడుగు నుండి హైదరాబాద్ వచ్చి హాస్టల్లో ఉంటూ బి.ఫార్మసీ చదువుతుంది. గత కొన్ని నెలలుగా తీవ్రమైన డిప్రెషన్‌తో బాధ పడుతున్న స్నేహ కౌన్సిలింగ్ తీసుకుంటుంది. ఆమె బాల్యం గురించి లోతయిన విశ్లేషణ చేస్తున్నపుడు కొన్ని సున్నితమైన అంశాల పైన మరింత స్పష్టత వచ్చింది.

స్నేహకు ఊహ తెలిసీ తెలియని వయస్సులో తల్లి చనిపోయింది. బయటి వాళ్ళయితే బిడ్డను సరిగా చూసుకోరనే భయంతో స్నేహా పిన్నినే తన తండ్రి పెళ్లి చేసుకున్నాడు. (ఆస్తికి సంబంధించిన ఇతర కారణాలు కూడా ఉన్నాయి) స్నేహ పిన్ని చాలా మంచిది. తనను చాలా ప్రేమగా పెంచింది. తన కోసం ఇంకా పిల్లలను కూడా కనలేదు.

ఇంకా డీప్‌గా వెళినపుడు స్నేహ చెప్పిన విషయం. ʹనాకు ఊహ తెలిసీ తెలియని వయస్సులో అమ్మతో నిద్రిస్తునపుడు కొన్ని సార్లు మధ్య రాత్రిలో మెలకువ వచ్చి చూస్తే అమ్మ నాతో లేక పోవడం గమనించి భయంతో ఏడ్చేదానిని. నా ఏడుపు విన్న వెంటనే వేరే బెడ్ రూం నుంచి డ్రస్ సరిచేసుకుంటూ వచ్చి అమ్మ నాతో పడుకునేది. బహుశ ఆ సమయంలో అమ్మ నాన్నతో సెక్స్ లో ఉండేదని వయస్సు పెరిగాక తెలిసింది. అమ్మ తరువాత పిన్ని నాతో పడుకునేది. అలాగే కొన్ని సార్లు మధ్య రాత్రి మెలకువ వచ్చి నాతో పిన్ని లేక పోవడం గమనించి ఏడ్చేదాన్ని. ఎవరూ రెస్పాండ్ కాకపోతే వెళ్ళి వేరే బెడ్ రూం డోర్ కొట్టే దాన్ని. డోర్ లోపలి నుంచి లాక్ చేసి ఉండేది. నా సౌండ్ విని వెంటనే పిన్ని లాక్ ఓపెన్ చేసుకుని వచ్చి నా బుగ్గమీద కిస్ చేసి నాతో పాటు ఉండి నన్ను నిద్ర పుచ్చేది.....ʹ

ఇక్కడ గమనిస్తే బయిలాజికల్ మదర్ తన భర్తతో గడిపే సమయంలో కూడా తన మనస్సు ఎప్పుడూ బిడ్డ కేర్ కోసం ఆలోచించి డోర్ వేసుకోలేదు. బిడ్డ లేవగానే భర్త నుండి వేరుపడి బిడ్డ కోసం వచ్చింది. కాని పిన్ని ఎంత మంచి హృదయం ఉన్నా తన భర్తతో సెక్స్ బిడ్డకు తెలియ గూడదని డోర్ లాక్ చేసుకుంది. ఆ చిన్న తేడా కూడా బిడ్డ మానసిక స్థితి మీద ప్రభావముంటుంది.

నేడు పేరెంట్స్ పిల్లలకు బేబీ సిట్టర్స్ గా గ్రాండ్ పేరెంట్స్ ని, ఆయమ్మ లను పెడుతున్నారు. లేదా కాస్ట్లీ డే కేర్‌లో పెడుతున్నారు. ఎంత కాస్టిలీ కేర్‌లో వేసినా బయలాజికల్ మదర్‌ని రీ ప్లేస్ చెయ్యలేదు అనే విషయం గ్రహించాలి.

#HariRaghav 18.01.2019

Keywords : biological mother, parenting, kids
(23.10.2019 06:12:11pm)

No. of visitors : 2449

Suggested Posts


10 results found !


NRI పేరెంట్స్ పిల్లల విషయంలో శ్రద్ధ వహించాల్సిన అంశాలు

NRI పేరెంట్స్ పిల్లల విషయంలో శ్రద్ధ వహించాల్సిన అంశాలు

టీనేజ్ ఆడపిల్లలకు సోషల్ మీడియాలో ఎదురయ్యే ఇబ్బందులేంటి?

టీనేజ్ ఆడపిల్లలకు సోషల్ మీడియాలో ఎదురయ్యే ఇబ్బందులేంటి?

పిల్లలను కనాలి అనుకున్నపుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి?

పిల్లలను కనాలి అనుకున్నపుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి?

మీ పిల్లల ముందే మీరు పోట్లాడుకుంటున్నారా? జాగ్రత్త!!

మీ పిల్లల ముందే మీరు పోట్లాడుకుంటున్నారా? జాగ్రత్త!!

పిల్లలకు ఆటలను దూరం చేస్తున్నారా?

పిల్లలకు ఆటలను దూరం చేస్తున్నారా?

తల్లిదండ్రుల మానసిక సమస్యలు పిల్లలకు వారసత్వంగా వస్తాయా?

తల్లిదండ్రుల మానసిక సమస్యలు పిల్లలకు వారసత్వంగా వస్తాయా?

ఒంటరి బిడ్డ వలన ఇబ్బంది ఏంటి?

ఇందిరా గాంధీ హయాములో దేశంలో జనసాంద్రత ఎక్కువగా ఉంది దాన్ని నియంత్రించాలని కుటుంభం నియంత్రణ పథకాలను తెచ్చారు. ప్రభుత్వం చాల డబ్బు వెచ్చించి చిన్నకుటుంబం వల్ల కలిగే లాభాలను ప్రచారం చేసింది. ʹమేమిద్దరం మాకిద్దరుʹ అనే నినాదం దేశంలో ప్రతీ గ్రామంలో గోడలపైన దర్శనమిచ్చింది. పీవీ నరసింహారావు హయాంలో మొదలయిన గ్లోబలైజేషన్ వల్ల ప్రజలలో ఆర్థికంగా పోటీ పడటం పెరిగి చివర

పిల్లలు ఏవిధంగా మన నుంచి నేర్చుకుంటారు?

పిల్లలు మన ద్వారా వచ్చారు గాని మనకోసం రాలేదు. వారు మనం ఏం చెబుతున్నామో అది కాకుండా మనం ఏం చేస్తూంటామో అది చూసి నేర్చుకుంటారు. పిల్లలకు బలవంతంగా రుద్దటం వల్ల నేర్చుకోక పోగా దానికి విరుద్ధంగా ప్రవర్తించే అవకాశముంటుంది.

కూతురి పెంపకంలో తండ్రి పాత్ర ఎందుకు ముఖ్యమైనది?

ఆడపిల్లల మనస్తత్వం మగవాళ్ల మనస్తత్వానికి భిన్నంగా ఎందుకు ఉంటుంది? ఇరువురి ప్రవర్తనలో తేడాలు కారణాలేంటి? ఆడపిల్లల పెంపకంలో తండ్రి పాత్ర ఏంటి? తండ్రికి దూరంగా పెరిగిన ఆడపిల్లల్లో వచ్చే మానసిక సమస్యలేంటి? అటువంటి వారి పట్ల భర్త ఎటువంటి జాగ్రత్తలు వహించాలి? పెళ్లయ్యాక మగపిల్లలకు రాని మానసిక సమస్యలు ఆడపిల్లలకు రావడానికి కారణమేంటి?

పిల్లల పెంపకం - నేటి పరిస్థితులు

సృష్టిలో ఏ పేరెంట్స్ కి కూడా తమ బిడ్డలపై ప్రేమ లేకుండా ఉండదు. పురాణ కాలంలో ప్రహ్లాదుని తండ్రి అయిన హిరణ్య కశ్యపుని నుండి మొదలు నేటి తరం పేరెంట్స్ వరకు ఎవరూ కూడా తమ బిడ్డలు వృద్ధి లోకి రావాలనే తప్ప చెడిపోవాలి, సమాజానికి హానికరంగా మారాలని కోరుకోరు. కాని వారి వారి పెంపకం లో ఉన్న వైరుధ్యాల వలన బిడ్డలు వివిధ రకాలుగా ఎదిగి తరువాత గొప్ప వారిగా లేదా నేరస్తులుగ
Search Engine

ఫేస్బుక్ ఓసీడీ (FBOCD)
నిజం ఆవస్యకత
నిజాలన్నీ అబద్దాలే
కెరీర్
చీమ మెదడులో చేరిన వైరస్
వ్యక్తి
జీవితం
హ్యూమనిజం
నేనెవరు?
PTSD
డాలర్లు వస్తున్నాయి గాని ఎండ రావడం లేదు
రిజర్వేషన్స్
కెరీర్ మీద ఇంటరెస్ట్ ఎలా వస్తుంది?
టీనేజ్ కి వచ్చిన పిల్లలతో ఎలా ప్రవర్తించాలి?
మీ పిల్లలను అనుమానంతో దండిస్తున్నారా?
Autism Treatment
మీ పిల్లలకు స్మార్ట్ ఫోన్స్ ఇస్తున్నారా?
NRI పేరెంట్స్ పిల్లల విషయంలో శ్రద్ధ వహించాల్సిన అంశాలు
టీనేజ్ ఆడపిల్లలకు సోషల్ మీడియాలో ఎదురయ్యే ఇబ్బందులేంటి?
బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్ళే ముందు తరువాత ప్రవర్తన
పిల్లలను కనాలి అనుకున్నపుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
మీ పిల్లల ముందే మీరు పోట్లాడుకుంటున్నారా? జాగ్రత్త!!
పిల్లలకు ఆటలను దూరం చేస్తున్నారా?
మనుసులో భావాలే కలలుగా వస్తాయా?
కలలు నిజాలు అవుతాయా?
ఎంప్టీ నెస్ట్ సిండ్రోమ్
Love | మనం నిజంగా ప్రేమిస్తున్నామా..?
తల్లిదండ్రుల మానసిక సమస్యలు పిల్లలకు వారసత్వంగా వస్తాయా?
టీనేజ్ అమ్మాయిలతో పేరెంట్స్ ఎలా మెలగాలి?
రెండవ కూతురు
ఏకాగ్రత పెంచుకోవడం ఎలా?
మనిషి జీవితం జీవించడానికా? శోధించడానికా?
ఫ్రీ థింకింగ్
పోరాటమా? బ్రతుకా?
పిల్లల్లో లెర్నడ్ హెల్ప్‌లెస్‌నెస్ ఎందుకు డెవలప్ అవుతుంది?
more..
బయలాజికల్