ఫేస్బుక్ ఓసీడీ (FBOCD)

ఫేస్బుక్

ʹహరి రాఘవ్ గారు!! నాకెందుకో ఇది కూడా #OCD అనిపిస్తుంది. మా అమ్మాయికి 38 సంవత్సరాలు రోజంతా ఫోన్ పట్టుకుని ఫేస్బుక్ బ్రౌజ్ చేస్తూనే ఉంటుంది. రాత్రి పడుకునే దాకా ఫేస్బుక్ చెక్ చేసి పడుకుంటుంది. లేవ గానే మొదట చేసే పని కూడా ఫేస్బుక్ చెక్ చెయ్యడమే. మధ్యలో మెలుకువ వస్తే ఒక సారి చెక్ చేస్తుంది. దానితో పిల్లలను, భర్తను పట్టించుకోవడం తగ్గి పోయింది. సమయానికి వంట చెయ్యలేక పోతుంది. ఎక్కడికన్నా వెల్దామంటే టైంకి రెడీ అవ్వలేక పోతుంది. ఆరోగ్యం కూడా దెబ్బ తింటుంది.ʹ

62 సంవత్సరాల కల్పవల్లి గారు అడిగిన ప్రశ్న. ప్రస్తుతం కల్పవల్లిగారు అమెరికాలోని కాలిఫోర్నియా లో తన కూతురు దగ్గర ఉంటుంది. ఇంతకు ముందు కల్పవల్లి గారు ఒక యూనివిర్సిటీ లో ప్రొఫెసర్ గా పని చేసి ప్రస్తుతం విశ్రాంతి తీసుకుంటున్నారు. కల్పవల్లి గారు చెప్పింది నిజమే. ఫేస్బుక్ మాత్రమే కాదు ఏ ఆలోచన అయితే తమ కంట్రోల్ లో లేకుండా నిరంతరం మనలను ఇబ్బంది పెడుతూ మన దైనందిన జీవనానికి ఇబ్బందిగా మారితే దానిని OCD గా పిలవ వచ్చు. అది పుస్తకాలు చదవడం, సోషల్ మీడియా లో గడపడం, టీవీ చూడడం, నిరంతరం రకరకాల సమావేశాలకు హాజరు కావడం, సినెమా హీరోలకు, రాజకీయ నాయకులకు, కవులకు, మేధావులకు, ఇతర సెలెబ్రెటీస్ కి ఫాన్స్ గా మారి నిరంతరం వారి ఆలోచనలో బ్రతకడం, ఏదయినా సిద్ధాంతాన్ని నమ్మి నిరంతరం దాని కోసమే ఆలోచించడం, నిరంతరం ఏదో ఒక ఉద్యమంలో పాల్గొనడడం, విపరీతంగా డబ్బు సంపాదించాలనుకోవడం, ఎప్పుడూ విజయం కోసం ప్రయత్నిస్తూనే ఉండడం కూడా మనం OCD గా పరిగణించ వచ్చు.

ఫేస్బుక్ ఓసీడీ (FBOCD) మూడు రకాలుగా ఉంటుంది. ఇందులో #మొదటి రకం వారు తెల్లవారు ఝామున లేచిన వెంటనే ʹగుడ్ మార్నింగ్ʹ అంటూ పోస్ట్ పెట్టడడం తో ప్రారంభమయి అర్థ రాత్రి గుడ్ నైట్ అని పెట్టే వరకు కొనసాగుతుంది. ఈ మధ్యలో అనేక విషయాలను వారు పోస్టు చేస్తూ ఉంటారు. తమకు చీమ కుట్టినా, తినే ఆహారంలో ఉప్పు ఎక్కువయినా, జీవిత భాగస్వామికి చిన్న జ్వరం వచ్చినా, పిల్లలు తన మీద చేసిన కామెంట్స్, పనిమనిషి, పాల వాడు అడిగిన ప్రశ్నలు, తాను చదువుతున్న (చదివే సమయం ఉండదు) పుస్తకాలు, కొన్న డ్రెస్, రెస్టారెంట్ లో ఆర్డర్ ఇచ్చిన ఫుడ్, సినిమా టికెట్స్, పిల్లలకు వచ్చిన మార్కులు ఇలా ప్రతీ విషయాన్నీ ఫేస్బుక్ లో పోస్ట్ చేస్తూ ఉంటారు. కాలింగ్ బెల్ మోగినా ఆ విషయాన్నీ ఫేస్బుక్ లో పోస్ట్ పెట్టిన తరువాత మాత్రమే వారు డోర్ తీస్తారు.

#రెండవ రకం వారు పోస్టులు లేదా ఫోటోలు అతి కొద్దిగా మాత్రమే పెడతారు. కానీ వీరు నిరంతరం ఆ పోస్టులు లేదా ఫోటోలకు ఎన్ని లైక్స్ వచ్చాయి? ఎన్ని కామెంట్స్ వచ్చాయి? ఎవరు ఏమని కామెంట్ చేశారు అని నిరంతరం చెక్ చేస్తూ ఉంటారు. 10 నిమిషాల పాటు ఫేస్బుక్ కి దూరంగా ఉండగానే వీరికి ఆందోళన ప్రారంభ మవుతుంది. ఎవరయినా ఎమన్నా కామెంట్ చేసారా? ఎవరన్నా వెటకారంగా ఏమన్నా అన్నారా? ఇలా వారి ఆలోచన కొన సాగుతుంది. ముఖ్యంగా వీరు పోస్టు, లేదా ఫోటో పెట్టిన మొదటి నిమిషం విపరీతమైన ఒత్తిడికి లోనవుతారు. మొదటి లైక్ వచ్చేవరకు వారి గుండె కొట్టుకునే వేగం పెరుగుతుంది. శ్వాస తీసుకునే రేట్ కూడా పెరుగుతుంది. ఎవరో ఒకరు ఆ పోస్ట్ లైక్ చేసాక మాత్రమే వీరి ఒత్తిడి తగ్గుతుంది.

#మూడవ రకం వారు ఎక్కువ పోస్టులు పెట్టరు. కానీ వీరు నిరంతరం న్యూస్ ఫీడ్, మరియూ ఇతరుల టైం లైన్స్ పరిశీలిస్తూ ఉంటారు. వీరికి ఇతరుల జీవితాల మీద ఎక్కువ ఇంటరెస్ట్ ఉంటుంది. వారు ఏం చేస్తున్నారు? వారు ఎవరి పోస్టులకు లైక్స్ కొట్టారు. ఎవరి పోస్టులకు కామెంట్ చేశారు. అందులో వారిని ఏమని సంభోదించారు? వారికి వీరికి ఉన్న సంబంధం ఏంటి? ఇతరులు పోస్టు చేసిన ఫోటోలను క్షుణంగా పరిశీలించి దానిని బట్టి వారి లైఫ్ స్టైల్ ని అంచనా వేయడం వంటి అనేక పరిశోధనలు చేయడంలో వారి సమయాన్నంతా వెచ్చిస్తూ ఉంటారు. అలాగే ఏ ప్రొఫైల్ ఒరిజినల్, ఏ ప్రొఫైల్ ఫేక్ అనేది పరిశోధిస్తూ ఉంటారు. ఈ విధమైన ప్రవర్తన నుండి బయట పడాలని అనుకున్నా బయటకు రాలేక పోతుంటారు.

#HariRaghav 13.10.2019

Keywords : facebook, ocd, psychology
(13.10.2019 11:58:52am)

No. of visitors : 2000

Suggested Posts


Sorry, there are no suggested posts
Search Engine

బయలాజికల్ మదర్
నిజం ఆవస్యకత
నిజాలన్నీ అబద్దాలే
కెరీర్
చీమ మెదడులో చేరిన వైరస్
వ్యక్తి
జీవితం
హ్యూమనిజం
నేనెవరు?
PTSD
డాలర్లు వస్తున్నాయి గాని ఎండ రావడం లేదు
రిజర్వేషన్స్
కెరీర్ మీద ఇంటరెస్ట్ ఎలా వస్తుంది?
టీనేజ్ కి వచ్చిన పిల్లలతో ఎలా ప్రవర్తించాలి?
మీ పిల్లలను అనుమానంతో దండిస్తున్నారా?
Autism Treatment
మీ పిల్లలకు స్మార్ట్ ఫోన్స్ ఇస్తున్నారా?
NRI పేరెంట్స్ పిల్లల విషయంలో శ్రద్ధ వహించాల్సిన అంశాలు
టీనేజ్ ఆడపిల్లలకు సోషల్ మీడియాలో ఎదురయ్యే ఇబ్బందులేంటి?
బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్ళే ముందు తరువాత ప్రవర్తన
పిల్లలను కనాలి అనుకున్నపుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
మీ పిల్లల ముందే మీరు పోట్లాడుకుంటున్నారా? జాగ్రత్త!!
పిల్లలకు ఆటలను దూరం చేస్తున్నారా?
మనుసులో భావాలే కలలుగా వస్తాయా?
కలలు నిజాలు అవుతాయా?
ఎంప్టీ నెస్ట్ సిండ్రోమ్
Love | మనం నిజంగా ప్రేమిస్తున్నామా..?
తల్లిదండ్రుల మానసిక సమస్యలు పిల్లలకు వారసత్వంగా వస్తాయా?
టీనేజ్ అమ్మాయిలతో పేరెంట్స్ ఎలా మెలగాలి?
రెండవ కూతురు
ఏకాగ్రత పెంచుకోవడం ఎలా?
మనిషి జీవితం జీవించడానికా? శోధించడానికా?
ఫ్రీ థింకింగ్
పోరాటమా? బ్రతుకా?
పిల్లల్లో లెర్నడ్ హెల్ప్‌లెస్‌నెస్ ఎందుకు డెవలప్ అవుతుంది?
more..
ఫేస్బుక్