కెరీర్

కెరీర్

ʹహరి రాఘవ్ గారు!! మీరెన్ని చెప్పినా మనిషి కెరీర్ కే ఇంపార్టెన్స్ ఇవ్వాలి అనిపిస్తుంది. మీ మాటలను నమ్మి ఒక్క రోజు రెస్ట్ తీసుకున్నా కెరీర్ లో వెనుకబడి పోవడం ఖాయం. మిగిలిన వాళ్ళు ముందుకు వెళ్లి పోతారు. అంతెందుకు మీరు మాత్రం అన్నేసి కౌన్సెలింగ్స్ ఇవ్వడం లేదా? మీకు కూడా కెరీర్ ముఖ్యం కాదా? నా కెందుకో మీరు చెప్పే దానిని పూర్తిగా నమ్మ బుద్ధి కావడం లేదు.ʹ

ʹనమ్మవద్దు. ఆలోచించండి. మీకు సులువుగా ఉన్న పనే చెయ్యండి. అది కెరీర్ కావచ్చు లేదా జీవితం కావచ్చు. పెద్దగా తేడా ఉండదు. జీవితం కోసం కెరీర్, కెరీర్ కోసం జీవితం చూడడానికి ఒకే విధంగా ఉంటాయి. దాదాపు అంతే శ్రమ ఉంటుంది. కానీ ఫలితంలో చాల తేడా ఉంటుంది. మీరూ వర్క్ చేస్తున్నారు. నేనూ వర్క్ చేస్తున్నాను. మీకంటే నేను ఎక్కువ శ్రమ చేస్తుండొచ్చు కూడా. ఎంత సేపు చేస్తున్నాము ఎంత కష్టపడుతున్నాము కాదు. ఎందుకు చేస్తున్నాము అనేది ముఖ్యం.

అడవిలో బ్రతుకుతున్న జింక చాల వేగంగా పరిగెడుతుంది. సింహం కూడా వేగంగానే పరిగెడుతుంది. కానీ రెండిటి పరుగులకు మధ్య తేడా ఉంది. జింక తన ప్రాణం నిలబెట్టుకోవడం కోసం భయంతో పారిపోతూ పరిగెడుతుంది. సింహం తన ఆహరం కోసం వేటాడుతూ పరిగెడుతుంది. జింక సింహం కంటే వేగంగా పరిగెడితేనే తన ప్రాణం నిలబడుతుంది. సింహం జింక కన్నా వేగంగా పరిగెడితేనే ఆహరం లభిస్తుంది. కానీ సింహం ఒక జింకను వేటాడితే చాలు ఆరోజుకు ఆహరం లభిస్తుంది. తరువాత తాను హాయిగా రిలాక్స్ అవుతుంది. కానీ జింక మాత్రం ఒక సింహాన్ని తప్పించుకుంటే సరిపోదు. మరో సింహం వెంటాడుతుంది. తరువాత హైనాలు, అడవి కుక్కలు అన్నీ వెంటాడుతూనే ఉంటాయి. రోజు మొత్తం తనను తానూ కాపాడుకోవడం కోసం అడవిలో ఉన్న ప్రతీ క్రూరమృగానికన్నా వేగంగా పరిగెత్తాల్సి ఉంటుంది. సో, నీ పరుగు జింకలాగా ప్రాణాలు నిలబెట్టుకోడానికా లేక సింహంలాగా వేటాడడానికా అనేది నిర్ణయించు కోవలసింది నువ్వే...ʹ

#HariRaghav

Keywords : career, psychology, existentialism
(04.09.2019 01:32:35pm)

No. of visitors : 2515

Suggested Posts


2 results found !


కెరీర్ మీద ఇంటరెస్ట్ ఎలా వస్తుంది?

ఒక వ్యక్తికి ఒక సబ్జెక్టు పట్ల ఇంటరెస్ట్ ఉన్నదీ లేనిదీ ఎలా తెలుస్తుంది? కెరీర్ ఎన్నుకునేటపుడు ఎటువంటి అంశాలను పరిగణలోకి తీసుకోవాలి? ఒకవేళ కెరీర్ మార్చుకోవాల్సి వస్తే ఎటువంటి శ్రద్ధ వహించాలి?

ప్రపంచం చాల విశాలమైనది

వ్యక్తి తను పుట్టిన ఊరు, కుటుంబం, స్నేహితులకు అతిగా కనెక్టయ్యి పోతాడు. లేదా పెరిగే క్రమంలో ఏర్పడ్డ పరిచాయలు, స్నేహాలకు, తన జీవిత భాగస్వామికి అతని/ఆమె సర్కిల్ లో ఉన్న వారికి తెలియకుండా కనెక్ట్ అయిపోతారు. నిరంతరం వారిని మెప్పించాలి. వారి దగ్గర తానేంటో ప్రూవ్ చేసుకోవాలనే ప్రయత్నంలో జీవితాన్ని వృధా చేసుకుంటూ ఉంటాడు. నేను సైకాలజీ చదివే రోజులలో మా ప్రొఫెస్సర్
Search Engine

బయలాజికల్ మదర్
ఫేస్బుక్ ఓసీడీ (FBOCD)
నిజం ఆవస్యకత
నిజాలన్నీ అబద్దాలే
చీమ మెదడులో చేరిన వైరస్
వ్యక్తి
జీవితం
హ్యూమనిజం
నేనెవరు?
PTSD
డాలర్లు వస్తున్నాయి గాని ఎండ రావడం లేదు
రిజర్వేషన్స్
కెరీర్ మీద ఇంటరెస్ట్ ఎలా వస్తుంది?
టీనేజ్ కి వచ్చిన పిల్లలతో ఎలా ప్రవర్తించాలి?
మీ పిల్లలను అనుమానంతో దండిస్తున్నారా?
Autism Treatment
మీ పిల్లలకు స్మార్ట్ ఫోన్స్ ఇస్తున్నారా?
NRI పేరెంట్స్ పిల్లల విషయంలో శ్రద్ధ వహించాల్సిన అంశాలు
టీనేజ్ ఆడపిల్లలకు సోషల్ మీడియాలో ఎదురయ్యే ఇబ్బందులేంటి?
బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్ళే ముందు తరువాత ప్రవర్తన
పిల్లలను కనాలి అనుకున్నపుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
మీ పిల్లల ముందే మీరు పోట్లాడుకుంటున్నారా? జాగ్రత్త!!
పిల్లలకు ఆటలను దూరం చేస్తున్నారా?
మనుసులో భావాలే కలలుగా వస్తాయా?
కలలు నిజాలు అవుతాయా?
ఎంప్టీ నెస్ట్ సిండ్రోమ్
Love | మనం నిజంగా ప్రేమిస్తున్నామా..?
తల్లిదండ్రుల మానసిక సమస్యలు పిల్లలకు వారసత్వంగా వస్తాయా?
టీనేజ్ అమ్మాయిలతో పేరెంట్స్ ఎలా మెలగాలి?
రెండవ కూతురు
ఏకాగ్రత పెంచుకోవడం ఎలా?
మనిషి జీవితం జీవించడానికా? శోధించడానికా?
ఫ్రీ థింకింగ్
పోరాటమా? బ్రతుకా?
పిల్లల్లో లెర్నడ్ హెల్ప్‌లెస్‌నెస్ ఎందుకు డెవలప్ అవుతుంది?
more..
కెరీర్