చీమ మెదడులో చేరిన వైరస్

చీమ

చాల కాలం క్రితం ఒక ప్రత్యేకమైన చీమల జాతి ఉండేదట. ఆ జాతి అంతరించి పోవడానికి ఒక అరుదైన వైరస్ కారణం. ఈ వైరస్ కేవలం ఆ చీమల మెదడు ఆధారం గానే జీవించగలదు. అడవిలో నివసించే ఈ చీమలు చాల శక్తివంతమైనవి మరియూ తెలివయినవి కూడా. ఎలా చేరిందో తెలియదు ఆ అరుదైన వైరస్ ఆ చీమల జాతికి చెందిన ఒక చీమ మెదడులోకి చేరుకుంది.

అప్పటి నుండి ఆ వైరస్ ఆ చీమ మెదడును హ్యాండిల్ చెయ్యడం మొదలు పెట్టింది. ఏ ఆహారం తీసుకుంటే ఆ అరుదైన వైరస్ బలపడుతుందో ఆ ఆహరం పట్ల చీమకు ఇష్టం కలిగే లాగ చీమ టేస్ట్ ని మార్చి వేసింది. అప్పటి నుండి చీమ అదే ఆహరం తీసుకోవడం మొదలెట్టింది. ఫలితంగా ఆ వైరస్ మరింత బలపడి మెదడు మొత్తాన్ని ఆక్రమించింది. క్రమంగా చీమ మెదడు సైజు పెరగడం, ఫలితంగా చీమ తల పెరగడం మొదలయ్యింది. ఆ చీమ బక్క చిక్కిపోయినా వైరస్ బలపడే ఆహారాన్నే తీసుకుంటూ ఉంది.

చివరకు ఆ వైరస్ ఆ చీమను తన జాతి చీమలు ఎక్కువ ఉండే చెట్టు వద్దకు వెళ్లే లాగ ప్రోత్సహించింది. ఆ చెట్టు వద్దకు చేరుకోగానే తన తలను బలంగా ఉన్న చెట్టు మొదలుకు గుద్దుకుని తల పగల కొట్టుకుని చని పోయిలాగా చేసింది. చని పోయిన చీమను చూడడానికి వచ్చిన చీమల మొదడుల్లోకి ఆ వైరస్ చేరుకుంది. క్రమంగా ఆ చీమలను కూడా అదే విధమైన ఆహరం తీసుకుని తల చెట్టు మొదలుకు బాదుకుని చనిపోయే లాగ చేసింది. అలా మరిన్ని చీమలలోకి ఆ వైరస్ సోకింది. ఆ విధంగా ఆ చీమల జాతి మొత్తం అంతరించి పోయింది.

ఎప్పుడో చదివిన సరిగా గుర్తు లేని ఈ కథ మనిషి మస్తిష్కాలలో చేరిపోయిన అహం ఎలా పనిచేస్తుందో చెబుతుంది. మనిషిలో అహం చేరిన తరువాత కేవలం ఆ అహం బలపరిచే సమాచారాన్ని మాత్రమే అంగీకరించే అవకాశాలుంటాయి. ఫలితంగా ఆ అహం మరింత బలపడుతుంది తప్ప అహాన్ని తగ్గించే సమాచారాన్ని ఆ వ్యక్తి అంగీకరించడు అని తెలియజేయడమే రచయిత ఉద్దేశ్యం.

#HariRaghav

Keywords : ego, psychology, existentialism
(03.09.2019 10:30:14am)

No. of visitors : 1750

Suggested Posts


2 results found !


జ్ఞానం - అజ్ఞానం - అహం

ఒక మనిషికి దేని గురించి జ్ఞానం ఉండాలి? ఎందుకు ఉండాలి? ఎంతవరకు ఉండాలి? అనే జ్ఞానం ప్రతీ వ్యక్తికీ అవసరం. అవసరం ఉన్న లేకున్నా ప్రతీ విషయం పట్ల జ్ఞానం కలిగి ఉం

నేను - నమ్మకాలు - మనోభావాలు

నేను అంటే ఆస్తికులు మత గ్రంధాల ఆధారంగా ఆత్మగా భావిస్తారు. నాస్తికులు ఈ వాదనను కొట్టి పారేస్తారు. అయితే నేను ఎవరు అని హేతుబద్దంగా ప్రశ్నించుకుంటే " నేను - నా
Search Engine

బయలాజికల్ మదర్
ఫేస్బుక్ ఓసీడీ (FBOCD)
నిజం ఆవస్యకత
నిజాలన్నీ అబద్దాలే
కెరీర్
వ్యక్తి
జీవితం
హ్యూమనిజం
నేనెవరు?
PTSD
డాలర్లు వస్తున్నాయి గాని ఎండ రావడం లేదు
రిజర్వేషన్స్
కెరీర్ మీద ఇంటరెస్ట్ ఎలా వస్తుంది?
టీనేజ్ కి వచ్చిన పిల్లలతో ఎలా ప్రవర్తించాలి?
మీ పిల్లలను అనుమానంతో దండిస్తున్నారా?
Autism Treatment
మీ పిల్లలకు స్మార్ట్ ఫోన్స్ ఇస్తున్నారా?
NRI పేరెంట్స్ పిల్లల విషయంలో శ్రద్ధ వహించాల్సిన అంశాలు
టీనేజ్ ఆడపిల్లలకు సోషల్ మీడియాలో ఎదురయ్యే ఇబ్బందులేంటి?
బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్ళే ముందు తరువాత ప్రవర్తన
పిల్లలను కనాలి అనుకున్నపుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
మీ పిల్లల ముందే మీరు పోట్లాడుకుంటున్నారా? జాగ్రత్త!!
పిల్లలకు ఆటలను దూరం చేస్తున్నారా?
మనుసులో భావాలే కలలుగా వస్తాయా?
కలలు నిజాలు అవుతాయా?
ఎంప్టీ నెస్ట్ సిండ్రోమ్
Love | మనం నిజంగా ప్రేమిస్తున్నామా..?
తల్లిదండ్రుల మానసిక సమస్యలు పిల్లలకు వారసత్వంగా వస్తాయా?
టీనేజ్ అమ్మాయిలతో పేరెంట్స్ ఎలా మెలగాలి?
రెండవ కూతురు
ఏకాగ్రత పెంచుకోవడం ఎలా?
మనిషి జీవితం జీవించడానికా? శోధించడానికా?
ఫ్రీ థింకింగ్
పోరాటమా? బ్రతుకా?
పిల్లల్లో లెర్నడ్ హెల్ప్‌లెస్‌నెస్ ఎందుకు డెవలప్ అవుతుంది?
more..
చీమ