PTSD

PTSD

#కౌన్సిలింగ్‌ ప్రక్రియ చాలా సంక్లిష్టమైనది. ప్రతీ క్లయింట్ పరిస్థితి విభిన్నమైనది. బాధాకరమైనది. ఏ బాధ లేనివారు కౌన్సిలర్ వద్దకు వచ్చి వారి విలువైన సమయాన్ని, డబ్బుని వృధా చేసుకోరు. ఇండియాలో ఉన్న ఏకైక #ఎక్సిస్టేన్షియల్ #సైకాలజిస్ట్ కావడం వల్ల అనేక దూర ప్రాంతాల నుండి అనేక బాధాకరమైన కేసులు నా దగ్గరకు వస్తుంటాయి.

చాలా సార్లు క్లయింట్‌ తమ మనస్సు లోతులలో నిక్షిప్తమైన బాధను పంచుకునే అవకాశం ఎక్కడా లభించదు. భర్తతో గాని, పేరెంట్స్ తోగాని, సిబ్లింగ్స్ తోగాని మరెవరితో గాని పంచుకోలేని బాధను కౌన్సిలర్ మీద నమ్మకం ఏర్పడితే పంచుకుంటారు. అలా పంచుకున్న రోజు నుంచి రెండు మూడు రోజులు వారు చాలా డిప్రెస్సుడ్‌గా గడుపుతారు. సరిగా నిద్ర పట్టదు. శరీరమంతా నీరసం ఆవహించి నట్లుంటుంది. అందుకు కారణం హృదయంతరాలలో నిక్షిప్తమైన బాధ కౌన్సిలింగ్ సమయంలో గుర్తు తెచ్చుకోవడం. ఈ దశలో కొందరు కౌన్సిలింగ్ నుంచి విత్‌డ్రా అయిపోతారు కూడా. గత రెండు వారాలుగా ఇస్తున్న కౌన్సిలింగ్స్ లో అమెరికాలో స్థిరపడ్డ ఇద్దరు మహిళల విషయంలో ఇలా జరిగింది. వారిరువురూ కూడా మొదటి మూడు సెషన్ల సమయాన విపరీతమైన బాధను అనుభవించారు. ఆ బాధను ఎదుర్కోడానికి కౌన్సిలర్ ఇచ్చిన మెథడ్స్ ని ఉపయోగించి బయటపడి తరువాతి సెషన్లు తీసుకుంటున్నారు.

అందుకు భిన్నమైన పరిస్థితి నిన్న ఎదుర్కున్నాను. మధురైకి చెందిన ఒంటరి మహిళ తన 16 సంవత్సరాల కూతురు కోసం అనేక సార్లు అపాయింట్‌మెంట్ తీసుకుంది. ఎన్నిసార్లు తీసుకున్నా తన కూతురుని తీసుకుని హైదరాబాద్ రాలేక పోయింది. గత రెండు సంవత్సరాల నుండి చెన్నైలో డాక్టర్ల మెడికేషన్, సైకాలజిస్ట్ ల కౌన్సిలింగ్ ఇప్పిస్తున్నా ఫలితంలేక పోవడంతో నా వద్దకు తీసుకురావాలనే నిర్ణయం తీసుకున్నారు.

ఎట్టకేలకు బంధువుల సహకారంతో నిన్న తీసుకురాగలిగారు. 16 సంవత్సరాల అమ్మాయికి తన 4 ఏండ్ల వయస్సులోనే కళ్ళ ముందే తండ్రి చనిపోవడం, 14 ఏండ్ల వయస్సులో తల్లితో స్కూటర్ మీద ప్రయాణిస్తుండగా జరిగిన యాక్సిడెంట్లో మొహమంతా కొట్టుకుపోయి రక్తమోడుతూ అపస్మారక స్థితిలో ఉన్న తల్లిని కాపాడుకోవడం కోసం 30 నిమిషాల పాటు ఒంటరిగా తను పడిన వేధన ఆమెను ట్రోమాకు గురిచేసింది. అప్పటి నుండి పోస్ట్ ట్రోమాటిక్ స్టెస్ డిసార్డర్ (PTSD) తో బాధ పడుతుంది.

నిన్న సాయంత్రం ఆమె కౌన్సిలింగ్ పూర్తయినప్పటి నుండి నా శరీరంలో అనేక మార్పులు వచ్చాయి. తరువాతి సెషన్ మొదలైనా పది నిమిషాలు కూడా ఇవ్వలేక పోయాను. క్లయింట్‌కి కాఫీ తాగిపించి పంపించేసాను. నా కడుపంతా విపరీతమైన గ్యాస్‌తో నిండి పోయింది. దానికి తోడు విపరీతమైన చలితో ఆఫీస్ నుండి ఇంటికి వచ్చేసాను. డిన్నర్ సరిగా చెయ్యలేక పోయాను. ఇంట్లో ఉన్న యాంటాసిడ్స్ వేసుకున్నా పెద్దగా ఫలితం లేదు. రాత్రంతా సరిగా నిద్రపోలేకపోయాను. తెల్లవారు ఝాము కల్లా ఒళ్లు వెచ్చబడి లైట్ ఫీవర్ కూడా వచ్చింది.

ఉదయం ఆ అమ్మాయి తల్లి నుండి వాట్సాప్ మెసేజ్ వచ్చింది. ʹమీతో మాట్లాడాక పాప చాలా బాగుంది. చాలా ధైర్యంగా ఉంది. తన మాటలలో ఒక విధమైన హోప్ కనిపించింది. ప్రతీ రోజూ అవుతున్నట్లు నిన్న రాత్రి పానిక్ అవలేదు. గ్యాస్ కూడా రాలేదు. హాయిగా నిద్ర పోయింది. థాంక్యూ సర్.ʹ అప్పుడు గుర్తొచ్చింది. ఆ అమ్మాయి పానిక్ అయినప్పుడల్లా విపరీతమైన గ్యాస్‌తో ఇబ్బంది పడేది. మానసిక స్థితికి జీర్ణ వ్యవస్థకు ఉన్న సంబంధాన్ని నిన్న వివరించి చెప్పాను కూడా. ఆమె బాధను పంచుకునే టపుడు పూర్తిగా ఇన్వాల్వయ్యి ఆమెలో ధైర్యాన్ని నింపే క్రమంలో ఆమె బాధ నాకు ట్రాన్సఫర్ అయ్యింది. ఇలా కౌంటర్ ట్రాన్సఫర్ కావడం మొదటి సారి కాక పోయినా ఇలా శరీరకంగా ఇబ్బంది పడటం మొదటిసారి.

#HariRaghav

Keywords : ptsd, stress
(18.02.2019 03:50:39pm)

No. of visitors : 2555

Suggested Posts


4 results found !


వృద్ధాప్యంలో కొందరు నాస్తికులు ఎందుకు ఆస్తికులుగా మారతారు?

హేతువాద నాస్తికుడిగా మారటం ఒక రాజకీయ పార్టీ నుండి వేరొక రాజకీయ పార్టీకి మారినట్లు కాదు. నిజమయిన హేతువాది మీద తీవ్రమయిన మానసిక ఒత్తిడి ఉంటుంది. దేనిని హేతుబద్దంగా ఆలోచించాలి, ఎంతవరకు హేతుబద్దంగా ఆలోచించాలి అనే విషయాలు అర్థం కాక ప్రతీ విషయాన్నీ తను హేతుబద్దంగా విశ్లేషించే ప్రయత్నం చేస్తాడు. అపరిమితంగా హేతుబద్ధ విశ్లేషణ వల్ల అతను పడే మానసిక శ్రమ ఈ ఒత్తిడికి

కౌంటర్ డిప్రెషన్

సైకాలజీలో కొన్ని విషయాలను లోతుగా పరిశీలిస్తే కొన్ని విషయాలు వింతగా అనిపిస్తాయి. సాధారణంగా డిప్రెషన్ కి గురయిన వారు సైకాలజిస్ట్ సహాయంతో దానినుండి బయటపడతారు. అయితే వీళ్ళను డీల్ చేసే సైకాలజిస్ట్/కౌన్సెలర్/థెరపిస్ట్ లకు కొన్ని సార్లు వింతయినా పరిస్థితులను ఎదుర్కోవలసి వస్తుంది. డిప్రెషన్ కి గురయిన వ్యక్తులతో గడిపి, గడిపి, వాళ్ళు చెప్పే విషయాలను ఎంపతీ తో వినటం

టీనేజ్ లో శరీకంగా వచ్చే మార్పుల గురించి చెందే మానసిక ఆందోళన

టీనేజ్ లోకి ప్రవేశించిన వెంటనే వారికి మొదట ఎదురయ్యే ఆందోళన వారి శరీర ఆకృతి గురించి. అప్పటివరకు ముద్దుగా, చిన్న పిల్లల మాదిరి ఉన్న శరీరం క్రమంగా తన ఆకృతిని మ

ఫ్రస్ట్రేషన్

ప్రతీవ్యక్తి తన జీవితంలో ఎదురయ్యే అనేక సమస్యల వల్ల లేదా జీవితంలో అప్పటి వరకు ఉన్న అభిప్రాయానికి విరుద్ధంగా వాస్తవం ఉన్నపుడు అతను లేదా ఆమె ఫ్రస్ట్రేషన్ కి లో
Search Engine

బయలాజికల్ మదర్
ఫేస్బుక్ ఓసీడీ (FBOCD)
నిజం ఆవస్యకత
నిజాలన్నీ అబద్దాలే
కెరీర్
చీమ మెదడులో చేరిన వైరస్
వ్యక్తి
జీవితం
హ్యూమనిజం
నేనెవరు?
డాలర్లు వస్తున్నాయి గాని ఎండ రావడం లేదు
రిజర్వేషన్స్
కెరీర్ మీద ఇంటరెస్ట్ ఎలా వస్తుంది?
టీనేజ్ కి వచ్చిన పిల్లలతో ఎలా ప్రవర్తించాలి?
మీ పిల్లలను అనుమానంతో దండిస్తున్నారా?
Autism Treatment
మీ పిల్లలకు స్మార్ట్ ఫోన్స్ ఇస్తున్నారా?
NRI పేరెంట్స్ పిల్లల విషయంలో శ్రద్ధ వహించాల్సిన అంశాలు
టీనేజ్ ఆడపిల్లలకు సోషల్ మీడియాలో ఎదురయ్యే ఇబ్బందులేంటి?
బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్ళే ముందు తరువాత ప్రవర్తన
పిల్లలను కనాలి అనుకున్నపుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
మీ పిల్లల ముందే మీరు పోట్లాడుకుంటున్నారా? జాగ్రత్త!!
పిల్లలకు ఆటలను దూరం చేస్తున్నారా?
మనుసులో భావాలే కలలుగా వస్తాయా?
కలలు నిజాలు అవుతాయా?
ఎంప్టీ నెస్ట్ సిండ్రోమ్
Love | మనం నిజంగా ప్రేమిస్తున్నామా..?
తల్లిదండ్రుల మానసిక సమస్యలు పిల్లలకు వారసత్వంగా వస్తాయా?
టీనేజ్ అమ్మాయిలతో పేరెంట్స్ ఎలా మెలగాలి?
రెండవ కూతురు
ఏకాగ్రత పెంచుకోవడం ఎలా?
మనిషి జీవితం జీవించడానికా? శోధించడానికా?
ఫ్రీ థింకింగ్
పోరాటమా? బ్రతుకా?
పిల్లల్లో లెర్నడ్ హెల్ప్‌లెస్‌నెస్ ఎందుకు డెవలప్ అవుతుంది?
more..
PTSD