డాలర్లు వస్తున్నాయి గాని ఎండ రావడం లేదు

డాలర్లు

అనుపమ చౌదరి గుంటూరుకి చెందిన ఒక ధనవంతుల ఫామిలీకి ఒక్కతే వారసురాలు. ఎంతో అల్లారు ముద్దుగా పెరిగింది. బీటెక్ పూర్తి చేసి MS కోసం అమెరికా వెళ్ళింది. అక్కడ కర్నూల్ కి చెందిన వంశీధర్ రెడ్డి తోని పరిచయం ఏర్పడింది. పరిచయం కాస్త ప్రేమగా మారి పెళ్లికి దారి తీసింది. తల్లిదండ్రులకు తెలియకుండా అమెరికాలో పెళ్లి చేసుకుని వారిరువురూ ఇండియా వచ్చారు.

వారి పెళ్లి విషయం విన్న తల్లిదండ్రులు మొదట్లో వ్యతిరేకించినా తరువాత అంగీకరించారు. ఇండియాలో ఘనంగా సంప్రదాయ బద్దంగా పెళ్లిచేసి తిరిగి అమెరికా పంపారు. ఇద్దరు చక్కని జాబ్స్ చేసుకుంటూ వారాంతంలో చక్కని లైఫ్ గడిపే వారు. చూస్తుండగా ఇద్దరు పిల్లలు, 17 సంవత్సరాల వైవాహిక జీవితం గడిచి పోయింది.

16 సంవత్సరాల తన కూతురు ఇటీవల వీడ్ తీసుకుంటూ దొరికిపోవడంతో పోలీసులు తీసుకువెళ్లారు. ఆ కేసు నుంచి బయటకు తీసుకు రావడానికి వారిరువురు చాల ఇబ్బందులు పడాల్సి వచ్చింది. అది గడిచిన నెల రోజుల లోపే 14 సంవత్సరాల కొడుకు ఒక మాల్ లో చాకోలెట్స్ దొంగతనం చేస్తూ దొరికిపోయాడు. ఏడూ వేల డాలర్లు ఖర్చు పెట్టి బయటపడాల్సి వచ్చింది.

భర్త గత 6 సంవత్సరాల నుండి ఫామిలీ కన్నా తన ఫ్రెండ్స్ మరియూ పార్టీలకు ఎక్కువ ప్రాధాన్యత నిస్తున్నాడు. కుటుంబానికి సంబంధించిన చిన్న చిన్న సమస్యలకు కూడా తీవ్ర అసహనం భార్యమీద చూపిస్తున్నాడు. తరుచుగా F పదాలతో భార్యను దూషిస్తున్నాడు. అనుపమకు మానసిక ఆందోళన తీవ్రంగా పెరిగింది. ప్రతీ చిన్న దానికీ నెగటివ్ గా ఆలోచించడం, అతిగా రియాక్ట్ అవడం చేస్తుంది.

ఇటువంటి పరిస్థితులలో ఆన్లైన్ కౌన్సిలింగ్ కోసం నన్ను సంప్రదించింది. కొన్ని సెషన్స్ ప్రాధమిక విచారణ తరువాత శారీరక ఆరోగ్యానికి సంబంధించిన విషయాల కౌన్సిలింగ్ జరిగింది. అనుపమ టెస్టులలో తన రక్తంలో విటమిన్ డి లెవెల్స్ అతి తక్కువ ఉండడం గ్రహించడం జరిగింది. లోకల్ జనరల్ ఫీజిషియన్ ని సంప్రదించి సప్లిమెంట్స్ తీసుకోవాల్సిందిగా చెప్పి, ప్రతీ రోజూ శారీరక వ్యాయామం పెంచి, సూర్యరశ్మిని శరీరానికి తాకే విధంగా ఎండలో నిలబడమని చెప్పడం జరిగింది.

అందుకు అనుపమ ʹసర్.. ఇక్కడ ఇపుడు వింటర్ స్టార్ట్ అయ్యింది. ఎండ వచ్చే అవకాశాలే లేవు. సమ్మర్ లో ఎక్సట్రీమ్ ఉండడం వల్ల కూడా ఎండకు నిలబడే స్థితి ఉండదు. ఎండ కాకుండా మరేమన్న చెప్పండిʹ అని అడిగింది. కానీ ప్రకృతిలో సూర్యరశ్మిని రీప్లేస్ చేస్తూ మారే ఆప్షన్ లేదు. సూర్యుడికి సమస్త జీవరాశులకు సంబంధం ఉంది. సూర్యుడు లేనిదే జీవం లేదు. మానసిక సమస్యలకు విటమిన్ డి తక్కువగా ఉండడం ప్రధాన కారణం. ఈ విషయం గ్రహించమని చెప్పను.

చివరికి అనుపమ తను జీవితంలో చేసిన పెద్ద పొరబాటును అర్థం చేసుకుంది. ఎక్కడయితే చక్కగా ఎండ, గాలి, వెలుతురూ వంటివి సమపాళ్ళలో లభిస్తాయో ఆ ప్రాంతాన్ని వదిలి డాలర్లు వచ్చే ప్రాంతానికి తను వలసపోవడం ఎంత పొరబాటో అర్థం చేసుకుంది.

#హరి_రాఘవ్

Keywords : sun light, depression
(12.01.2019 05:37:52pm)

No. of visitors : 1964

Suggested Posts


7 results found !


యాంటీ-బయోటిక్స్ వల్ల మానసిక రుగ్మధలు

39 సంవత్సరాల దేవి అనే గృహిణి తీవ్రమైన డిప్రెషన్ తో బాధ పడుతూ 2 సార్లు ఆత్మహత్యకు ప్రయతించింది. ఆమెకు అనేక సెషన్స్ కౌన్సిలింగ్ ఇచ్చిన తరువాత గత 2 సంవత్సరాల నుండి గర్భసంచి సంబంధించిన సమస్యలతో బాధపడుతూ డాక్టర్స్ ని కలసి అనేక బలమైన యాంటీ-బయోటిక్స్ వాడినట్లు తెలిసింది. 67 సంవత్సరాల రిటైర్డ్ టీచర్ రామ్ మోహన్ గారు తన కడుపులో సమస్య ఉంది అని డాక్టర్స్ ని కలసి టెస

కుంగుబాటు.. వద్దు తడబాటు

పిల్లలు తల్లిదండ్రులతో అన్ని విషయాలు చెప్పేలా వాతావరణం ఉండాలి. కొందరు లోపాలను వైద్యుల వద్ద అంగీకరించరు. ఇతరుల సహాయాన్ని కళంకంగా భావిస్తారు. అలాంటి వ్యక్తులను దగ్గరకు తీసుకుని సహాయం చేయాలి. నేను వైద్యుడి వద్దకు వెళ్లినపుడు నాలోని అంతర్గత యుద్దాన్ని సగం గెలిచినట్లు అనిపించింది. విజయమనేది సమాజంలో చాలా మార్పు తీసుకువస్తుంది. పరీక్షల సమయంలో ఎదురయ్యే కుంగుబాటు

వింటర్ బ్లూస్

చలికాలం వల్ల వచ్చే డిప్రెషన్ ని వింటర్ బ్లూస్ అంటారు. సాధారణంగా మన శరీరానికి సంబంధించిన క్రియలకు సూర్య రశ్మికి సంబంధం ఉంటుంది. సూర్యుడి వెలుగుని బట్టి శరీరంలో హార్మోనల్ చర్యలు మారుతూ ఉంటాయి. అయితే ఎండాకాలంలో ఎక్కువ పగలు, చలికాలంలో తక్కువగా పగలుండటం వల్ల శరీరం లో జరిగే చర్యలలో మార్పు వల్ల డిప్రెషన్ పెరిగే అవకాశాలున్నాయి. చాలామందిలో ముఖ్యంగా గృహిణిలలో ఈ డ

యువతను డిప్రెషన్ లోకి నెడుతున్న ఫేస్బుక్

ప్రస్తుత సోషల్ మీడియాలో ఫేస్బుక్ దే అగ్రస్థానం. దాదాపు సోషల్ మీడియా ఉపయోగించే వారందరికీ ఫేస్బుక్ అకౌంట్ ఉంటుంది. ట్విట్టర్ తో సహా అనేక ఇతర సోషల్ మీడియా సైట్ లు ఉన్నప్పటికీ ఫేస్బుక్ ఇచ్చేటటువంటి ఫీచర్స్ వల్ల యూజర్స్ ఫేస్బుక్ కి అతిగా అటాచ్ అవుతున్నారు. కొందరు రోజుకు 6 నుంచి 8 ఫేస్బుక్ లో గడపటం కూడా జరుగుతుంది. సామజిక ఉద్యమాలకు, భావజాల వ్యాప్తికి ఫేస్బుక

ఫ్రస్ట్రేషన్

ప్రతీవ్యక్తి తన జీవితంలో ఎదురయ్యే అనేక సమస్యల వల్ల లేదా జీవితంలో అప్పటి వరకు ఉన్న అభిప్రాయానికి విరుద్ధంగా వాస్తవం ఉన్నపుడు అతను లేదా ఆమె ఫ్రస్ట్రేషన్ కి లోనయ్యే అవకాశం ఉంటుంది. ఆ వ్యక్తి నమ్మకాలకు - వాస్తవానికి ఉన్న వ్యత్యాసమే ఫ్రస్ట్రేషన్ కి ప్రధాన కారణం. అటువంటి సందర్భంలో వ్యక్తి తన అభిప్రాయాలను, నమ్మకాలను వాస్తవాన్ని గ్రహించి మార్చుకోలేక వాస్తవాన్ని

కౌంటర్ డిప్రెషన్

సైకాలజీలో కొన్ని విషయాలను లోతుగా పరిశీలిస్తే కొన్ని విషయాలు వింతగా అనిపిస్తాయి. సాధారణంగా డిప్రెషన్ కి గురయిన వారు సైకాలజిస్ట్ సహాయంతో దానినుండి బయటపడతారు. అయితే వీళ్ళను డీల్ చేసే సైకాలజిస్ట్/కౌన్సెలర్/థెరపిస్ట్ లకు కొన్ని సార్లు వింతయినా పరిస్థితులను ఎదుర్కోవలసి వస్తుంది. డిప్రెషన్ కి గురయిన వ్యక్తులతో గడిపి, గడిపి, వాళ్ళు చెప్పే విషయాలను ఎంపతీ తో వినటం

టీనేజ్ లో శరీకంగా వచ్చే మార్పుల గురించి చెందే మానసిక ఆందోళన

టీనేజ్ లోకి ప్రవేశించిన వెంటనే వారికి మొదట ఎదురయ్యే ఆందోళన వారి శరీర ఆకృతి గురించి. అప్పటివరకు ముద్దుగా, చిన్న పిల్లల మాదిరి ఉన్న శరీరం క్రమంగా తన ఆకృతిని మ
Search Engine

బయలాజికల్ మదర్
ఫేస్బుక్ ఓసీడీ (FBOCD)
నిజం ఆవస్యకత
నిజాలన్నీ అబద్దాలే
కెరీర్
చీమ మెదడులో చేరిన వైరస్
వ్యక్తి
జీవితం
హ్యూమనిజం
నేనెవరు?
PTSD
రిజర్వేషన్స్
కెరీర్ మీద ఇంటరెస్ట్ ఎలా వస్తుంది?
టీనేజ్ కి వచ్చిన పిల్లలతో ఎలా ప్రవర్తించాలి?
మీ పిల్లలను అనుమానంతో దండిస్తున్నారా?
Autism Treatment
మీ పిల్లలకు స్మార్ట్ ఫోన్స్ ఇస్తున్నారా?
NRI పేరెంట్స్ పిల్లల విషయంలో శ్రద్ధ వహించాల్సిన అంశాలు
టీనేజ్ ఆడపిల్లలకు సోషల్ మీడియాలో ఎదురయ్యే ఇబ్బందులేంటి?
బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్ళే ముందు తరువాత ప్రవర్తన
పిల్లలను కనాలి అనుకున్నపుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
మీ పిల్లల ముందే మీరు పోట్లాడుకుంటున్నారా? జాగ్రత్త!!
పిల్లలకు ఆటలను దూరం చేస్తున్నారా?
మనుసులో భావాలే కలలుగా వస్తాయా?
కలలు నిజాలు అవుతాయా?
ఎంప్టీ నెస్ట్ సిండ్రోమ్
Love | మనం నిజంగా ప్రేమిస్తున్నామా..?
తల్లిదండ్రుల మానసిక సమస్యలు పిల్లలకు వారసత్వంగా వస్తాయా?
టీనేజ్ అమ్మాయిలతో పేరెంట్స్ ఎలా మెలగాలి?
రెండవ కూతురు
ఏకాగ్రత పెంచుకోవడం ఎలా?
మనిషి జీవితం జీవించడానికా? శోధించడానికా?
ఫ్రీ థింకింగ్
పోరాటమా? బ్రతుకా?
పిల్లల్లో లెర్నడ్ హెల్ప్‌లెస్‌నెస్ ఎందుకు డెవలప్ అవుతుంది?
more..
డాలర్లు