రిజర్వేషన్స్

రిజర్వేషన్స్

#రిజర్వేషన్స్ విషయంలో మోడీ వేసిన పాచిక పారినట్లే కనిపిస్తుంది. అగ్రకుల పేదలకు రిజర్వేషన్స్ అంటూ వార్షిక ఆదాయం ఎనిమిది లక్షల లోపు ఉన్నవారిని పేదలుగా పేర్కొనడంలో ఒక భయంకరమైన కుట్ర దాగి ఉంది. ఈ పది శాతం రిజర్వేషన్స్ వల్ల ఇప్పటికిప్పుడు దళిత, గిరిజన, బిసిలకు కొత్తగా వచ్చే నష్టం లేదు. కానీ ఇది వాస్తవ రూపం దాల్చక పోగా ప్రజలను అయోమయ పరచి రిజర్వేషన్స్ పట్ల వ్యతిరేకత తీసుకు వచ్చే అవకాశం ఉంది. భవిష్యత్తులో రిజర్వేషన్స్ సిస్టంను రూపు మార్చి పూర్తిగా దళిత, గిరిజనులను ఈ దేశంలో కనీస అవసరాలకు నోచుకోనివ్వకుండా దోచుకునే ప్రయత్నం స్పష్టంగా కనిపిస్తుంది.

ఇప్పటికే రాజ్యాంగం పైన గాని, వ్యవస్థ పైన గాని అవగాహన లేని టెక్నోక్రాట్స్ దేశం అభివృద్ధి అంటే కొన్ని సామాజిక వర్గాల అభివృద్ధి, కొన్ని బహుళ జాతి సంస్థల అభివృద్ధి అని బలంగా నమ్ముతూ రిజర్వేషన్స్ పైన విషం చిమ్మడం చూస్తున్నాము. ప్రభుత్వ విద్య, ఆరోగ్య, రవాణా వ్యవస్థలను పూర్తిగా దెబ్బ తీసి అన్నీ ప్రైవేట్ పరం చెయ్యడం ద్వారా దళిత, గిరిజన, బహుజనులకు ఈ దేశంలో తీవ్ర అన్యాయం జరుగుతుంది. దానికి తోడు రిజర్వేషన్స్ పైన సూడో మేధావుల వాదనలు చూస్తుంటే వారు ఈ దేశంలో కనీసం వసతులు కూడా పొందలేని పేదలు చంపేయడం ద్వారా ఈ దేశం ఆర్థికంగా అభివృద్ధి చెందుతుంది అన్నట్లు ఉంది.

టాలెంట్ అనేది వ్యక్తి సామర్థ్యం కాదు అది సామూహిక ఫలితం మాత్రమే అని అర్థం చేసుకోవాలంటే కనీసం ఒక్క సారయినా రాజ్యాంగాన్ని గాని, అంబేద్కర్ ని కానీ చదవాలి. అలా కాకుండా ప్రైవేట్ కాలేజెస్ లో టెక్నాలజీ చదివిన వారికి ఈ విషయాల పట్ల అవగాహన ఉండే అవకాశం చాల తక్కువ.

డబ్బున్న వారు మేనేజ్మెంట్ కోట క్రింద కోట్లు కుమ్మరించి కాలేజెస్ లో సీట్స్ కొనుక్కుని చదువుకోడాన్ని వ్యతిరేకించరు. డబ్బు ఎక్కువ చెల్లించి పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ రైల్వే లో సీట్స్ రిజర్వు చేసుకోడాన్ని వ్యతిరేకించరు. సినిమా హాళ్లలో సైతం ఎక్కువ చెల్లించి చేసుకునే రిజర్వేషన్స్ ను హక్కు కింద భావిస్తారు. వేల సంవత్సరాలు దోపిడీకి గురయి, వేల సంవత్సరాలు అంటరాని వారిగా పరిగణించబడి. తమ ఆస్తులను అగ్రకులాలకు వదిలేసిన వారికి ఇచ్చే రిజర్వేషన్స్ పైన మాత్రం వీలు దొరికితే విషం చిమ్మడం గమనించవచ్చు.

పది శాతం లోపు ఉన్న అగ్రకులాల వారు ఇప్పటికే యాభై శాతం ప్రభుత్వ విద్యా, ఉపాధులను తొంబై శాతం పైన ప్రైవేట్ ఉపాధులను పొందతూ కూడా దళిత, గిరిజన, బహుజనులు పొందే రిజర్వేషన్స్ పైన తమ అక్కసును వెళ్ళగ్రక్కడం చూస్తున్నాము. నిన్నటి నుండి ఫేస్ బుక్ లో వారి అగ్ర కుల దురహంకార పోస్టులు చూస్తుంటే చాలా బాధ అనిపిస్తుంది. కనీస సామాజిక పరిజ్ఞానం లేకుండా సాంకేతిక పరిజ్ఞానం, డబ్బు సంపాదన సామర్త్యాన్నే చదువు అని పొరబడుతున్న సమాజంలో మనం బ్రతుకుతున్నందుకు ఒకింత అసహనంగా కూడా ఉంది.

- హరి రాఘవ్

Keywords : reservations, modi, nda, bjp
(12.01.2019 05:31:26pm)

No. of visitors : 2034

Suggested Posts


4 results found !


ఆదివాసి.. లంబాడా వివాదం ‍-ఎం.రత్నమాల

ఆదిలాబాద్‌ (పాత) జిల్లాలో ఆదివాసీలు, లంబాడాల మధ్య గత రెండు నెలలుగా సాగుతున్న ఘర్షణ తెలంగాణలోని ఖమ్మం మొదలైన ఏజెన్సీ ప్రాంతాలకే కాదు, ఆదిలాబాద్‌ జిల్లా (పాత) పొరుగున రెండు రాష్ట్రాల సరిహద్దు మహారాష్ట్రలోని ఏజెన్సీ ప్రాంతాలకు ఇప్పుడిప్పుడే విస్తరిస్తున్నది. 2017 అక్టోబర్‌ 6న జోడెన్‌ఘాట్‌లోని ఆదివాసి మ్యూజియంలో ఉన్న లంబాడా స్త్రీ విగ్రహాన్ని ఆదివాసీలు తగులబ

కుల ఆధారిత రేజర్వేషన్స్

రిజర్వేషన్స్ వల్ల కుల క్యాస్ట్ ఐడెంటిటీ పెరుగుతుంది తప్ప తగ్గదు అని కొందరు అగ్ర కులాలకు చెందిన వారి వాదన. ఏ కులాలకయితే అన్యాయం జరిగిందో వారిని కులంతోనే గుర్తించాలి తప్ప మరో విధంగా కుదరదు. రిజర్వేషన్స్ వల్లే కుల తత్వం పెరుగుతుంది అనే వాదన హేతుబద్దమయినది కాదు. జనవరి 26 1950 కి ముందు, బ్రిటిష్ వారి పరిపాలనలో, అంతకు ముందు కూడా రిజర్వేషన్స్ లేవు. అప్పుడు ఈ కు

దేశం - ప్రతిభ

ఈ మధ్య ప్రతిభ ఉన్నవారికి అవకాశాలు లేకపోవటం వల్ల దేశం అభివృద్ధి కావటం లేదు అని కొందరు సోకాల్డ్ మేధావులు బాధ పడిపోవటం మీడియాలో చూస్తూ ఉన్నాము. వీరికి మతోన్మా

ఎంత కాలం ఈ రిజర్వేషన్స్..??

కొందరు ఆదివాసులకు, దళితులకు, బిసిలకు వేల సంవత్సరాలుగా అన్యాయం జరిగన మాట వాస్తవమే. అందుకు బదులుగా ఇచ్చిన రిజర్వేషన్స్ ఒప్పుకుంటాము కానీ ఎన్ని సంవత్సరాలని ఇస్
Search Engine

బయలాజికల్ మదర్
ఫేస్బుక్ ఓసీడీ (FBOCD)
నిజం ఆవస్యకత
నిజాలన్నీ అబద్దాలే
కెరీర్
చీమ మెదడులో చేరిన వైరస్
వ్యక్తి
జీవితం
హ్యూమనిజం
నేనెవరు?
PTSD
డాలర్లు వస్తున్నాయి గాని ఎండ రావడం లేదు
కెరీర్ మీద ఇంటరెస్ట్ ఎలా వస్తుంది?
టీనేజ్ కి వచ్చిన పిల్లలతో ఎలా ప్రవర్తించాలి?
మీ పిల్లలను అనుమానంతో దండిస్తున్నారా?
Autism Treatment
మీ పిల్లలకు స్మార్ట్ ఫోన్స్ ఇస్తున్నారా?
NRI పేరెంట్స్ పిల్లల విషయంలో శ్రద్ధ వహించాల్సిన అంశాలు
టీనేజ్ ఆడపిల్లలకు సోషల్ మీడియాలో ఎదురయ్యే ఇబ్బందులేంటి?
బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్ళే ముందు తరువాత ప్రవర్తన
పిల్లలను కనాలి అనుకున్నపుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
మీ పిల్లల ముందే మీరు పోట్లాడుకుంటున్నారా? జాగ్రత్త!!
పిల్లలకు ఆటలను దూరం చేస్తున్నారా?
మనుసులో భావాలే కలలుగా వస్తాయా?
కలలు నిజాలు అవుతాయా?
ఎంప్టీ నెస్ట్ సిండ్రోమ్
Love | మనం నిజంగా ప్రేమిస్తున్నామా..?
తల్లిదండ్రుల మానసిక సమస్యలు పిల్లలకు వారసత్వంగా వస్తాయా?
టీనేజ్ అమ్మాయిలతో పేరెంట్స్ ఎలా మెలగాలి?
రెండవ కూతురు
ఏకాగ్రత పెంచుకోవడం ఎలా?
మనిషి జీవితం జీవించడానికా? శోధించడానికా?
ఫ్రీ థింకింగ్
పోరాటమా? బ్రతుకా?
పిల్లల్లో లెర్నడ్ హెల్ప్‌లెస్‌నెస్ ఎందుకు డెవలప్ అవుతుంది?
more..
రిజర్వేషన్స్