ఎంప్టీ నెస్ట్ సిండ్రోమ్


ఇరవైలలో ప్రేమించి పెళ్లి చేసుకుని, ముప్పై, నలభైలలో ఆనందకరమైన జీవితాతం అనుభవించిన మహిళలకు కూడా హఠాత్తుగా యాభైలలో ఒంటరితనం వెంటాడే అవకాశం ఉంది. తన జీవితంలో ఏదో కోల్పోయినట్లు, అసలు ఈ జీవితానికే అర్థం లేనట్లు, తనకు ఎవరూ లేరు అన్నట్లుగా భావన రావటం సహజం. ఇందుకు కొన్ని వయస్సుతో పాటు వచ్చే మార్పులు కారణమయితే కొన్ని కుటుంబపరమైన, సామజికపరమైన అంశాలు కూడా కారణం అవుతాయి.

భారత సమాజంలోనే కాకుండా ప్రపంచం మొత్తంలో కుటుంబానికి పురుషుడితో పోల్చితే స్త్రీ ఎక్కువగా భావోద్వేగ పరంగా సంబంధాలు కలిగి ఉంటాయి. అందుకు ప్రధాన కారణం పునరుత్పత్తిలో స్త్రీ ప్రత్యక్షంగా పాల్గొంటామయితే, రెండవది పుట్టిన బిడ్డకు స్త్రీ మొదట కేర్ గివర్ కూడా కావటం. దాని వల్ల పిల్లలు మానసికంగా ఎక్కువగా తల్లితో అటాచ్ అవుతారు. పురుషుడు కేవలం ఆర్థిక, సామజిక పరమయిన అంశాలకు పరిమితమయితే, స్త్రీ తన బిడ్డల మానసిక, శారీరక అంశాల పట్ల కూడా శ్రద్ద తీసుకుంటుంది.

అప్పటి వరకూ ప్రతీ విషయానికి పేరెంట్స్ మీద ఆధారపడే పిల్లలు ఎప్పుడయితే పెరిగి తమ సొంత కాళ్ళమీద నిలబడి తమ జీవితం కోసం బయటకు వెళతారో అప్పుడు తల్లి వారిని కోల్పోయిన అనుభవానికి లోనవుతుంది. విపరీతమైన ఒత్తిడి, డిప్రెషన్, నిరాశక్తి వంటి ఫీలింగ్స్ కి లోనవుతుంది. దీనినే ఎంప్టీ నెస్ట్ సిండ్రోమ్ అంటారు. పురుషుడు కూడా ఇటువంటి అనుభవానికి లోనయ్యే అవకాశాలున్నప్పటికీ సామజిక పరిస్థితుల రీత్యా ఇది స్త్రీలలో ఎక్కువగా ఉంటుంది.

లక్షణాలు :

ఎంప్టీ నెస్ట్ సిండ్రోమ్ కి లోనయిన వారికి తరుచుగా దుఃఖం తన్నుకొని వస్తుంటుంది. తీవ్రమైన ఒత్తిడి, జీవితం పట్ల అనాసక్తి, ఏదో కోల్పోయిన భావన, ఈ జీవితానికి అర్థం లేనట్లు అనిపించడం, దేని పైన ఇంటరెస్ట్ లేక పోవటం, డిప్రెషన్ వంటివి సహజంగా కనిపించే లక్షణాలు.

ఇతర కారణాలు :

సాధారణంగా ఎక్కువమంది స్త్రీలు యాభైలలో మెనోపాస్ కి లోనవడం వల్ల వారిలో హార్మోన్ల సమతుల్యత లోపించడం వల్ల అనేక శారీరక మానసిక సమస్యలు వస్తాయి. అంతే కాకుండా ఈ వయస్సులోని వారి తల్లిదడ్రులు కూడా జీవితం చరమాంకంలో ఉండటం, విపరీతమైన ముసలితనంతో బాధ పడటం వీరికి అదనపు సమస్యలుగా తయారవుతాయి. కొందరు పేరెంట్స్ ని లైఫ్ లో మిస్సవటం (చనిపోవటం) కూడా ఈ వయస్సులోనే జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.

బయటపడే మార్గాలు :

ఎంప్టీ నెస్ట్ సిండ్రోమ్ పూర్తిగా మానసికమయినది. ఎప్పుడయితే వ్యక్తి ఈ లక్షణాలు లోనవుతున్నాడో సైకాలజిస్ట్ ని కలిసి కాన్సెలింగ్ ద్వారా బయటపడవచ్చు, జీవితంలో సహజంగా వచ్చే పరిణామాలను అంగీకరించడం. పిల్లల విషయంలో సరికొత్త పాత్రని పోషించడం, తన జీవితానికి నూతనమైన అర్థాన్నిచ్చే గోల్స్ ని సెట్ చేసుకోవటం వంటి వాటిలో నిమగ్నమయ్యి ఎంప్టీ నెస్ట్ సిండ్రోమ్ నుంచి బయటపడవచ్చు.

ఇంకా కొత్తగా మ్యూజిక్, పెయింటింగ్ లేదా మరేదైనా కళలను నేర్చుకోవటం ద్వారా మనస్సుని డైవర్ట్ చెయ్యవచ్చు. టూర్స్ వెళ్ళటం, లేదా సామజిక పరమైన అంశాల పట్ల అవగాహన పెంచుకోవటం, సమాజ సేవ చెయ్యటం వంటివి కూడా చెయ్యవచ్చు. అంతే కాకుండా ఆ వయస్సులో వచ్చే శారీరక పరమైన ఇబ్బందులను అధిగమించడం ద్వారా డిప్రెషన్ తగ్గించుకునే అవకాశం ఉంది.

ముగింపు :

పిల్లలు మననుంచి వచ్చారు గాని మనకోసం రాలేదు. వారు వారి జీవితంలో ముందుకు వెళ్ళటం అవసరం. వారు తల్లిని వదిలి మరో జీవిత భాగస్వామి వైపు ప్రయాణం చెయ్యటం సహజమైనది. ఈ విషయాలను అర్థం చేసుకుని పిల్లలతో ఉన్న అటాచ్మెంట్ ని క్రమంగా తగ్గించుకొని సొంత జీవితానికి ప్రాధాన్యత క్రమంగా పెంచుకోవాలి.

- హరి రాఘవ్

Keywords : empty nest syndrome, psychology, suman tv
(18.08.2018 09:34:01am)

No. of visitors : 1476

Suggested Posts


10 results found !


టీనేజ్ కి వచ్చిన పిల్లలతో ఎలా ప్రవర్తించాలి?

టీనేజ్ పిల్లలో వచ్చే మానసిక శారీరక మార్పులేంటి? వాటిని ఎలా అర్థం చేసుకోవాలి? వారితో తల్లిదండ్రులు ఎలా ప్రవర్తించాలి?

మీ పిల్లలకు స్మార్ట్ ఫోన్స్ ఇస్తున్నారా?

మీ పిల్లలు స్మార్ట్ ఫోన్స్ ఉపయోగిస్తున్నారా? వారు ఎటువంటి యాప్స్ ఉపయోగిస్తున్నారా గమనిస్తున్నారా? మిమ్మల్ని మించి మీ పిల్లలకు స్మార్ట్ ఫోన్ మీద అవహగాహన ఉన్నట్లు భావిస్తున్నారా?

టీనేజ్ ఆడపిల్లలకు సోషల్ మీడియాలో ఎదురయ్యే ఇబ్బందులేంటి?

టీనేజ్ ఆడపిల్లలకు సోషల్ మీడియాలో ఎదురయ్యే ఇబ్బందులేంటి?

పిల్లలను కనాలి అనుకున్నపుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి?

పిల్లలను కనాలి అనుకున్నపుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి?

మీ పిల్లల ముందే మీరు పోట్లాడుకుంటున్నారా? జాగ్రత్త!!

మీ పిల్లల ముందే మీరు పోట్లాడుకుంటున్నారా? జాగ్రత్త!!

పిల్లలకు ఆటలను దూరం చేస్తున్నారా?

పిల్లలకు ఆటలను దూరం చేస్తున్నారా?

తల్లిదండ్రుల మానసిక సమస్యలు పిల్లలకు వారసత్వంగా వస్తాయా?

తల్లిదండ్రుల మానసిక సమస్యలు పిల్లలకు వారసత్వంగా వస్తాయా?

టీనేజ్ అమ్మాయిలతో పేరెంట్స్ ఎలా మెలగాలి?

టీనేజ్ లో వచ్చిన ఆడపిల్లలలో వచ్చే మార్పుల పట్ల వారికి అవగాహన కల్పించడానికి తల్లిదండ్రులు ఏ విధమైన చర్యలు చేపట్టాలి?

పిల్లలు చదవడం లేదని కొడుతున్నారా?

పిల్లలు చదవడం లేదని కొడుతున్నారా?

మీ పిల్లలకి మార్కులు తక్కువచాయని భాదపడుతున్నారా

విద్యార్థికి మార్క్స్ ఎంతవరకు అవసరం. మార్క్స్ తప్ప ఏమీ అవసరం లేదా? మార్క్స్ రానివాడు ఎందుకూ పనికి రాడా? అసలు మార్క్స్ ఉన్న విలువెంత? అసలు మార్క్స్ అవసరం లేదా? తల్లిదండ్రులు, టీచర్స్ మార్క్స్ కోసం ఒత్తిడి చెయ్యటం ఎంత వరకు సబబు??
Search Engine

బయలాజికల్ మదర్
ఫేస్బుక్ ఓసీడీ (FBOCD)
నిజం ఆవస్యకత
నిజాలన్నీ అబద్దాలే
కెరీర్
చీమ మెదడులో చేరిన వైరస్
వ్యక్తి
జీవితం
హ్యూమనిజం
నేనెవరు?
PTSD
డాలర్లు వస్తున్నాయి గాని ఎండ రావడం లేదు
రిజర్వేషన్స్
కెరీర్ మీద ఇంటరెస్ట్ ఎలా వస్తుంది?
టీనేజ్ కి వచ్చిన పిల్లలతో ఎలా ప్రవర్తించాలి?
మీ పిల్లలను అనుమానంతో దండిస్తున్నారా?
Autism Treatment
మీ పిల్లలకు స్మార్ట్ ఫోన్స్ ఇస్తున్నారా?
NRI పేరెంట్స్ పిల్లల విషయంలో శ్రద్ధ వహించాల్సిన అంశాలు
టీనేజ్ ఆడపిల్లలకు సోషల్ మీడియాలో ఎదురయ్యే ఇబ్బందులేంటి?
బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్ళే ముందు తరువాత ప్రవర్తన
పిల్లలను కనాలి అనుకున్నపుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
మీ పిల్లల ముందే మీరు పోట్లాడుకుంటున్నారా? జాగ్రత్త!!
పిల్లలకు ఆటలను దూరం చేస్తున్నారా?
మనుసులో భావాలే కలలుగా వస్తాయా?
కలలు నిజాలు అవుతాయా?
Love | మనం నిజంగా ప్రేమిస్తున్నామా..?
తల్లిదండ్రుల మానసిక సమస్యలు పిల్లలకు వారసత్వంగా వస్తాయా?
టీనేజ్ అమ్మాయిలతో పేరెంట్స్ ఎలా మెలగాలి?
రెండవ కూతురు
ఏకాగ్రత పెంచుకోవడం ఎలా?
మనిషి జీవితం జీవించడానికా? శోధించడానికా?
ఫ్రీ థింకింగ్
పోరాటమా? బ్రతుకా?
పిల్లల్లో లెర్నడ్ హెల్ప్‌లెస్‌నెస్ ఎందుకు డెవలప్ అవుతుంది?
more..
ఎంప్టీ