Love | మనం నిజంగా ప్రేమిస్తున్నామా..?


మనం నిజంగా ప్రేమిస్తున్నామా..? లేక ప్రేమించబడాలని కోరుకుంటున్నామా..?? సాధారణంగా పురాణాలూ మొదలుకొని చరిత్ర, కథలు, నేటి సినిమాలు, నవలలో యువతీ యువకులు పరస్పరం ప్రేమించుకుంటూ ఉంటారు. కొన్ని సార్లు శారీరక ఆకర్షణకు లోనయి ప్రేమగా భావిస్తే మరికొన్ని సార్లు ఒకే విధమైన దృక్పధం (సిమిలర్ ఆటిట్యూడ్) ఉండటం వల్ల ప్రేమిచడం జరుగుతుంది. ఒకవేళ ఆ ఇద్దరిలో ఏ ఒక్కరు ప్రేమను తిరస్కరించినా ఆ ప్రేమను విఫలం అయిందిగా భావించడం పరిపాటి. నిజంగా ప్రేమ విఫలం అవుతుందా..? లేక ప్రేమించడం లో వ్యక్తులు విఫలం అవుతారా..?? ఒక యువకుడు తానూ ప్రేమిస్తున్నాను అని చెప్పుకునే యువతిని ప్రేమిస్తున్నాడా..? లేక ఆ యువతీ తనను ప్రేమించాలి అనే కోర్కెను ప్రేమిస్తున్నాడా? అలాగే యువతి కూడా ఆ వ్యక్తినా లేక ఆ వ్యక్తి ప్రేమిస్తున్నాడు అనే భావనను ప్రేమిస్తుందా? ఒక వేళ ఆ వ్యక్తిని అయితే ఆ వ్యక్తి ప్రేమను తిరస్కరించగానే ఆ వ్యక్తి పైన ప్రేమ ఎందుకు మాయం అవుతుంది?

నిజానికి చాల మంది తాము ప్రేమించేది వ్యక్తిని కాదు. ఆ వ్యక్తి తనను ప్రేమిస్తుంది లేదా ప్రేమిస్తున్నాడు అనే భావనను. తనకు ఆ భావన చాల తియ్యగా ఉంటుంది. అందులో తనకు మానసికమయిన సెక్యూరిటీ దొరుకుతుంది. ఒక వేళ ఆ యువతీ లేదా యువకుడు తనను ప్రేమించడం లేదు అని తెలిసిన వెంటనే తీవ్రమయిన ఒత్తిడికి లోనవడం జరుగుతుంది. దానికి కారణం తనకు అప్పటి వరకు ఉన్న ఆ తియ్యటి ఆనందం, మానసికమయిన సెక్యూరిటీ ని కోల్పోవటమే. దీనిని ʹప్యాషనేట్ లవ్ʹ లేదా ʹకండీషనల్ లవ్ʹ అంటారు. ఇది ఒక వ్యాపారం వంటిది. ఆ యువతి తనను ప్రేమిస్తే ఇతను ఆ యువతిని ప్రేమిస్తాడు. లేదంటే ఇతను ప్రేమించడం ఆపేస్తాడు. అలాగే ఆ యువకుడు తనను మాత్రమే ప్రేమించినపుడే ఆ యువతి అతనిని ప్రేమిస్తుంది. ఒక వేళ అతను తనను ప్రేమించుకున్న లేదా మరెవరినో ప్రేమిస్తున్నట్లు తెలిసినా ఈమె తాను ప్రేమించడాన్ని ఆపేస్తుంది. ఇది ఒక షాప్ కి వెళ్లి డబ్బులు ఇచ్చి వస్తువు కొనుక్కోవటం వంటిది.

దీనికి విరుద్ధంగా ʹకంపాషనేట్ లవ్ʹ లేదా ʹఅన్-కండీషనల్ లవ్ʹ ఉంటుంది. ఈ లవ్ లో అవతలి వ్యక్తి ప్రేమతో సంబంధం ఉండదు. తానూ ఆ వక్తిని ప్రేమిస్తున్నట్లు చెప్పాల్సిన అవసరం కూడా లేదు. కేవలం తానూ అతనిని ప్రేమిస్తుంది. అతను తిరిగి ప్రేమిస్తున్నాడా లేదా అనే విషయం ఈమె పట్టించుకోదు. లేదా అతను ఎవరిని ప్రేమిస్తున్నాడు అనేది కూడా ఈమె పట్టించుకోదు. కేవలం తానూ ప్రేమిస్తుంది. అయితే ప్రతీ ఒక్కరూ తనను ప్రేమిచేవాళ్ళు అన్ కండీషనల్ గా లవ్ చెయ్యాలని కోరుకుంటూ తాను మాత్రం కండీషనల్ గా లవ్ చెయ్యటం జరుగుతుంది. మనం అన్-కండీషనల్ కోరుకోవటం లవ్ కాదు. కేవలం అన్-కండీషనల్ గా ప్రేమించగలగటమే లవ్.

Keywords : love, psychology, existentialism
(11.08.2018 12:30:36pm)

No. of visitors : 2995

Suggested Posts


2 results found !


మనం నిజంగా ప్రేమిస్తున్నామా..?

మనం నిజంగా ప్రేమిస్తున్నామా..? లేక ప్రేమించబడాలని కోరుకుంటున్నామా..?? సాధారణంగా పురాణాలూ మొదలుకొని చరిత్ర, కథలు, నేటి సినిమాలు, నవలలో యువతీ యువకులు పరస్పరం

మానసిక పరిణితి - ప్రేమ - వివాహం

మానసిక పరిణితి, ప్రేమ, వివాహం, వైవాహిక జీవిహం. వీటిల్లో వివాహానికి వెంటనే సంబంధం ఉన్న విషయం ప్రేమ తప్ప మానసిక పరిణితి కాదు. మానసిక పరిణితీ అయితే ఆ పరిణితి క
Search Engine

బయలాజికల్ మదర్
ఫేస్బుక్ ఓసీడీ (FBOCD)
నిజం ఆవస్యకత
నిజాలన్నీ అబద్దాలే
కెరీర్
చీమ మెదడులో చేరిన వైరస్
వ్యక్తి
జీవితం
హ్యూమనిజం
నేనెవరు?
PTSD
డాలర్లు వస్తున్నాయి గాని ఎండ రావడం లేదు
రిజర్వేషన్స్
కెరీర్ మీద ఇంటరెస్ట్ ఎలా వస్తుంది?
టీనేజ్ కి వచ్చిన పిల్లలతో ఎలా ప్రవర్తించాలి?
మీ పిల్లలను అనుమానంతో దండిస్తున్నారా?
Autism Treatment
మీ పిల్లలకు స్మార్ట్ ఫోన్స్ ఇస్తున్నారా?
NRI పేరెంట్స్ పిల్లల విషయంలో శ్రద్ధ వహించాల్సిన అంశాలు
టీనేజ్ ఆడపిల్లలకు సోషల్ మీడియాలో ఎదురయ్యే ఇబ్బందులేంటి?
బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్ళే ముందు తరువాత ప్రవర్తన
పిల్లలను కనాలి అనుకున్నపుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
మీ పిల్లల ముందే మీరు పోట్లాడుకుంటున్నారా? జాగ్రత్త!!
పిల్లలకు ఆటలను దూరం చేస్తున్నారా?
మనుసులో భావాలే కలలుగా వస్తాయా?
కలలు నిజాలు అవుతాయా?
ఎంప్టీ నెస్ట్ సిండ్రోమ్
తల్లిదండ్రుల మానసిక సమస్యలు పిల్లలకు వారసత్వంగా వస్తాయా?
టీనేజ్ అమ్మాయిలతో పేరెంట్స్ ఎలా మెలగాలి?
రెండవ కూతురు
ఏకాగ్రత పెంచుకోవడం ఎలా?
మనిషి జీవితం జీవించడానికా? శోధించడానికా?
ఫ్రీ థింకింగ్
పోరాటమా? బ్రతుకా?
పిల్లల్లో లెర్నడ్ హెల్ప్‌లెస్‌నెస్ ఎందుకు డెవలప్ అవుతుంది?
more..
Love