రెండవ కూతురు

రెండవ

సాంకేతికత ఎంత అభివృద్ధి చెందినా మనిషి సైకాలజీ మాత్రం అభివృద్ధి చెందలేదు. మనిషి జీవితానికి కావలసిన సదుపాయాలను మాత్రమే సాంకేతిక పరిజ్ఞానం ఇవ్వగలుగుతుంది తప్ప జీవితాన్ని హాయిగా గడిపే అవకాశం కేవలం సైకలాజికల్ గా బలంగా ఉన్నవారికే సాధ్యపడుతుంది. మనిషి సైకాలజీని సాంకేతిక పరిజ్ఞానంతో పాటు అనేక విషయాలు ప్రభావితం చేస్తాయి. అందులో బాల్యంలో ఎదుర్కున్న పరిస్థితులను బట్టి ఆ వ్యక్తి పెరిసిప్షన్ ఏర్పడుతుంది. బాల్యంలో తల్లిదండ్రులు ఆ బిడ్డతో గడిపిన తీరు, తోబుట్టువుల ప్రవర్తన, కుటుంబ పరిస్థితులు, సామజిక పరిస్థితులు, ప్రకృతి విపత్తులు, యుద్దాలు వంటి అనేక అంశాలతో పాటు ముఖ్యంగా బర్త్ ఆర్డర్ ప్రభావం కూడా ఆ వ్యక్తి సైకాలజీ మీద ఉంటుంది.

ప్రపంచ వ్యాప్తంగా పురుషాధిక్య భావజాలం బలంగా ఉన్నా.. అది భారత్ లో మరింత బలంగా ఉంది అనడానికి సందేహించాల్సిన అవసరం లేదు. సామాజికంగా ఎంత మార్పు వచ్చినా నేటికీ వ్యక్తుల ఆలోచనలో మార్పు రాలేదు. ఎంత విధ్యనభ్యసించినా తెలియకుండా వారిలో భావజాలం ఉంటుంది. ముఖ్యంగా పిల్లలను కనే సమయంలో ఆడపిల్లను మగ పిల్లవాడా అనే అంశంలో తెలియకుండ తల్లిదండ్రుల ప్రవర్తన పిల్లల మీద పడుతుంది.

సాధారణంగా ప్రతీ దంపతులు తమ మొదటి బిడ్డను కనేటపుడు చాల స్వేచ్ఛగా అభ్యుదల భావాలతో ఉంటారు. మొదటి బిడ్డ మగ పిల్లవాడు పుట్టినపుడు రెండవ బిడ్డ విషయంలో కూడా అంతే ఓపెన్ గా ఉంటారు. కానీ మొదటి బిడ్డ ఆడపిల్ల అయినపుడు రెండబిడ్డ మగ పిల్లవాడయితే బాగుండు అని చాల మంది మనస్సులో కోరిక ఉంటుంది. వారి కోర్కెకు విరుద్ధంగా మళ్ళీ ఆడపిల్ల పుట్టినపుడు తీవ్రంగా నిరుత్సాహ పడినా ఎవరికీ వారు పైకి సర్ది చెప్పుకుంటారు.

మొదటి ఆడపిల్ల పుట్టినపుడు రెండవ బిడ్డ ఎవరు పుడతారా తెలియదు కాబట్టి ఒక విధమైన ఆశతో ఆ పిల్లను పెంచుతారు. తెలుగు కుటుంబాలలోనయితే లక్ష్మీ దేవి పుట్టింది అని పట్టు లంగాలు, నగలు వేసి మరీ పెంచే సంస్కృతి ఉంది. రెండవ కాన్పులో మగ పిల్లవాడు పుడితే మరొక్క సారి ఆ కుటుంభంలో ఆనందం వెళ్లి విరుస్తుంది. వారసుడు పుట్టాడు అని సంబరాలు చేసుకుంటారు. అదే రెండవ కాన్పులో ఆడపిల్ల పుడితే ఆ కుటుంభం, బంధువులు చెప్పుకుంటానికి ఏమీ ఉండదు. ఇంకో లక్ష్మి దేవి పుట్టింది అని సంభరాపడిపోయే అవకాశం లేదు. అప్పటి నుండి ఆ రెండవ ఆడపిల్లను కేవలం ఒక బాధ్యతగా తీసుకోవడమే తప్ప మొదటి బిడ్డ పుట్టినపుడు ఉన్నంత సంబరం ఉండే అవకాశాలు లేవు.

కొందరు తల్లిదండ్రులు అభ్యుదయ భావాలతో కొంత మేర ఆడపిల్లను కూడా అంగీకరించే స్థితిలో ఉన్నప్పటికీ బంధువులందరిలో ఆ భావం ఉండక పోవడం వల్ల ఆ ప్రభావం రెండవ ఆడపిల్ల పైన పడుతుంది. ఆ పిల్లను కేవలం మొక్కుబడిగా పెంచుతుండడంతో రెండవ కూతురు వ్యక్తిత్వం మీద ఆ ప్రభావం ఉంటుంది. మొదటి కూతురు పుట్టినాక రెండవ కూతురు పుట్టేలోపు మొదటి బిడ్డ ఒక్కటే ఉండడం వల్ల ఆమె వ్యక్తిత్వం బలంగా పెరిగే అవకాశం ఉన్నా, రెండవ కూతురు విషయంలో పుట్టినప్పటినుంచి ఆ ఇంటికి ఇద్దరు కూతుర్లు కావడంతో సహజంగానే తల్లిదండ్రులు రెండవ బిడ్డపైనా సంబరపడిపోతూ చూపించే ప్రేమ లభించదు.

ఈ విధమైన పరిస్థితులలో పెరిగిన రెండవ కూతురి జీవితంలో ఎమోషన్స్ ని సరిగా హేండిల్ చెయ్యలేని స్థితి ఏర్పడే అవకాహసముంటుంది. ప్రతీ విషయాన్నీ తన అక్కతో పోల్చుకుని తీవ్రమైన ఆత్మన్యూనతకు లోనయ్యే అవకాశాలుంటాయి. చిన్న విషయానికే ఎమోషన్ అవ్వడం, విపరీతమైన రియాక్షన్ చూపడం, ఎక్కువగా బాధలో గడపడం, విపరీతమైన కోపాన్ని ప్రదర్శించడం, విపరీతమైన ఆందోళనకు గురికావడం వంటి ప్రవర్తన వీరిలో గమనించ వచ్చు. పెరిగి పెద్దయ్యాక ఈమె ఏర్పర్చుకుని రేలషన్ షిప్స్ మీద కూడా ప్రభావం ఉండే అవకాశాలుంటాయి.

- హరి రాఘవ్

Keywords : psychology, second daughter
(13.07.2018 11:01:59am)

No. of visitors : 1764

Suggested Posts


10 results found !


బయలాజికల్ మదర్

19 సంవత్సరాల స్నేహ కడప జిల్లా జమ్మలమడుగు నుండి హైదరాబాద్ వచ్చి హాస్టల్లో ఉంటూ బి.ఫార్మసీ చదువుతుంది. గత కొన్ని నెలలుగా తీవ్రమైన డిప్రెషన్‌తో బాధ పడుతున్న స్నేహ కౌన్సిలింగ్ తీసుకుంటుంది. ఆమె బాల్యం గురించి లోతయిన విశ్లేషణ చేస్తున్నపుడు కొన్ని సున్నితమైన అంశాల పైన మరింత స్పష్టత వచ్చింది. స్నేహకు ఊహ తెలిసీ తెలియని వయస్సులో తల్లి చనిపోయింది. బయటి వాళ్ళయితే

NRI పేరెంట్స్ పిల్లల విషయంలో శ్రద్ధ వహించాల్సిన అంశాలు

NRI పేరెంట్స్ పిల్లల విషయంలో శ్రద్ధ వహించాల్సిన అంశాలు

టీనేజ్ ఆడపిల్లలకు సోషల్ మీడియాలో ఎదురయ్యే ఇబ్బందులేంటి?

టీనేజ్ ఆడపిల్లలకు సోషల్ మీడియాలో ఎదురయ్యే ఇబ్బందులేంటి?

పిల్లలను కనాలి అనుకున్నపుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి?

పిల్లలను కనాలి అనుకున్నపుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి?

మీ పిల్లల ముందే మీరు పోట్లాడుకుంటున్నారా? జాగ్రత్త!!

మీ పిల్లల ముందే మీరు పోట్లాడుకుంటున్నారా? జాగ్రత్త!!

పిల్లలకు ఆటలను దూరం చేస్తున్నారా?

పిల్లలకు ఆటలను దూరం చేస్తున్నారా?

తల్లిదండ్రుల మానసిక సమస్యలు పిల్లలకు వారసత్వంగా వస్తాయా?

తల్లిదండ్రుల మానసిక సమస్యలు పిల్లలకు వారసత్వంగా వస్తాయా?

ఒంటరి బిడ్డ వలన ఇబ్బంది ఏంటి?

ఇందిరా గాంధీ హయాములో దేశంలో జనసాంద్రత ఎక్కువగా ఉంది దాన్ని నియంత్రించాలని కుటుంభం నియంత్రణ పథకాలను తెచ్చారు. ప్రభుత్వం చాల డబ్బు వెచ్చించి చిన్నకుటుంబం వల్ల కలిగే లాభాలను ప్రచారం చేసింది. ʹమేమిద్దరం మాకిద్దరుʹ అనే నినాదం దేశంలో ప్రతీ గ్రామంలో గోడలపైన దర్శనమిచ్చింది. పీవీ నరసింహారావు హయాంలో మొదలయిన గ్లోబలైజేషన్ వల్ల ప్రజలలో ఆర్థికంగా పోటీ పడటం పెరిగి చివర

పిల్లలు ఏవిధంగా మన నుంచి నేర్చుకుంటారు?

పిల్లలు మన ద్వారా వచ్చారు గాని మనకోసం రాలేదు. వారు మనం ఏం చెబుతున్నామో అది కాకుండా మనం ఏం చేస్తూంటామో అది చూసి నేర్చుకుంటారు. పిల్లలకు బలవంతంగా రుద్దటం వల్ల నేర్చుకోక పోగా దానికి విరుద్ధంగా ప్రవర్తించే అవకాశముంటుంది.

కూతురి పెంపకంలో తండ్రి పాత్ర ఎందుకు ముఖ్యమైనది?

ఆడపిల్లల మనస్తత్వం మగవాళ్ల మనస్తత్వానికి భిన్నంగా ఎందుకు ఉంటుంది? ఇరువురి ప్రవర్తనలో తేడాలు కారణాలేంటి? ఆడపిల్లల పెంపకంలో తండ్రి పాత్ర ఏంటి? తండ్రికి దూరంగా పెరిగిన ఆడపిల్లల్లో వచ్చే మానసిక సమస్యలేంటి? అటువంటి వారి పట్ల భర్త ఎటువంటి జాగ్రత్తలు వహించాలి? పెళ్లయ్యాక మగపిల్లలకు రాని మానసిక సమస్యలు ఆడపిల్లలకు రావడానికి కారణమేంటి?
Search Engine

బయలాజికల్ మదర్
ఫేస్బుక్ ఓసీడీ (FBOCD)
నిజం ఆవస్యకత
నిజాలన్నీ అబద్దాలే
కెరీర్
చీమ మెదడులో చేరిన వైరస్
వ్యక్తి
జీవితం
హ్యూమనిజం
నేనెవరు?
PTSD
డాలర్లు వస్తున్నాయి గాని ఎండ రావడం లేదు
రిజర్వేషన్స్
కెరీర్ మీద ఇంటరెస్ట్ ఎలా వస్తుంది?
టీనేజ్ కి వచ్చిన పిల్లలతో ఎలా ప్రవర్తించాలి?
మీ పిల్లలను అనుమానంతో దండిస్తున్నారా?
Autism Treatment
మీ పిల్లలకు స్మార్ట్ ఫోన్స్ ఇస్తున్నారా?
NRI పేరెంట్స్ పిల్లల విషయంలో శ్రద్ధ వహించాల్సిన అంశాలు
టీనేజ్ ఆడపిల్లలకు సోషల్ మీడియాలో ఎదురయ్యే ఇబ్బందులేంటి?
బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్ళే ముందు తరువాత ప్రవర్తన
పిల్లలను కనాలి అనుకున్నపుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
మీ పిల్లల ముందే మీరు పోట్లాడుకుంటున్నారా? జాగ్రత్త!!
పిల్లలకు ఆటలను దూరం చేస్తున్నారా?
మనుసులో భావాలే కలలుగా వస్తాయా?
కలలు నిజాలు అవుతాయా?
ఎంప్టీ నెస్ట్ సిండ్రోమ్
Love | మనం నిజంగా ప్రేమిస్తున్నామా..?
తల్లిదండ్రుల మానసిక సమస్యలు పిల్లలకు వారసత్వంగా వస్తాయా?
టీనేజ్ అమ్మాయిలతో పేరెంట్స్ ఎలా మెలగాలి?
ఏకాగ్రత పెంచుకోవడం ఎలా?
మనిషి జీవితం జీవించడానికా? శోధించడానికా?
ఫ్రీ థింకింగ్
పోరాటమా? బ్రతుకా?
పిల్లల్లో లెర్నడ్ హెల్ప్‌లెస్‌నెస్ ఎందుకు డెవలప్ అవుతుంది?
more..
రెండవ