ఫ్రీ థింకింగ్

ఫ్రీ

ఆలోచన - ప్రవర్తన - విలువలు - మతం

వీటియొక్క క్రమం కనుక అర్థం చేసుకుంటే మొదటిది ఆలోచన. సమాజాన్ని బట్టి కొన్ని ఆలోచనలు ప్రవర్తన రూపంలోకి మారవచ్చు. కొన్ని మారక పోవచ్చు. ఇలా ప్రవర్తన రూపంలోకి మారినవి ఇతరులకు గాని, మిగిలిన ప్రకృతికి గాని హాని కలిగించ వచ్చు. అలా హాని కలిగించే ప్రవర్తనను నియంత్రించే ఉద్దేశ్యంతో విలువలు నిర్వచించబడతాయి. ఈ విలువలు పరిస్థితులను బట్టి మారుతూ ఉంటాయి. ఈ విలువలు నిర్వచిందడంలో నిర్వచించే వారి స్వార్థం కూడా ఉంటుంది. ఎప్పుడయితే సమాజంలో కొందరి ఆధిపత్యం నడుస్తుందో వారు వారికీ అనువుగా ఉండే ప్రవర్తనను విలువలుగా నిర్వచించడం మొదలవుతుంది. ఆ నిర్వచించిన విలువలకు లాజికల్ రూపం ఇవ్వటానికి ఫిలాసఫీ, ఐడియాలజీ, స్పిరిట్యుయాలిటీ మొదలయిన వాటిని వాడుకుంటారు. ఆ క్రమంలో వచ్చింది మతం.

ఈ మతం, విలువలు, ఫిలాసఫీ, ఐడియాలజీ మొదలయినవి కూడా ఒక వ్యక్తి ఆలోచన మీద ప్రభావం చూపుతుంది. వాటితో పాటు ఎన్నో ఎక్సటర్నల్ ఫాక్టర్స్ కూడా మన ఆలోచనను ప్రభావితం చేస్తుంది. ఆ అథారిటీ ని వ్యక్తిని సైకలాజికల్ గా బానిసని చేస్తుంది. వాటిని తెంచుకొని ఆలోచించడమే ఫ్రీ థింకింగ్. స్వేచ్చాయుతమైన ఆలోచన విధానం.

అయితే ఈ బంధనాలు తెంచుకోవటంలో కొందరు కొంతవరకే ప్రయత్నం చేసి మిగిలిన బానిసత్వాన్ని అంగీకరిస్తారు. ఏదో ఒక బంధనాన్ని తెంచుకోగలిగి ఎవరికీ వారు ఫ్రీ థింకర్ అనుకోవటం సహజం. ఒక మతస్తుడు వేరే మతం యొక్క ప్రభావాన్ని తెంచుకొని తానూ ఫ్రీ థింకర్ గా భావించుకుంటాడు. అలాగే చాలామంది నాస్తికులు కేవలం మత పరమయిన ప్రభావాన్ని తెంచుకొని దానిని ఫ్రీ థింకింగ్ అనుకుంటారు. అలాగే రైట్ ఐడియాలజీకి లోను కానీ లెఫ్టిస్టులు, లెఫ్ట్ ఐడీలోజికి లోను కానీ రైటిస్టులు కూడా ఫ్రీ థింకర్స్ గా భావించుకుంటారు.

ఇలా ఎవరికీ వారు కొన్నిటిని తెంచుకొని మరి కొన్నిటిని అంగీకరించడాన్ని ఫ్రీథింకింగ్ గా భావించడాన్ని హేతుబద్దంగా అంగీకరించలేము. ఫ్రీ థింకింగ్ అన్ని అథారిటీ లను బ్రేక్ చేసుకోవటం. అస్సలు అథారిటీ ఏంటి? అటువంటిది ఏమీ లేదు మేము ఫ్రీ థింకర్స్ అనుకుంటే చెప్పేది ఏమి ఉండదు. అది ఒక రాయిని గాలిలోకి విసిరితే ఆ రాయి తనకు తాను నేను భలే ఎగరగలుగుతున్నాను అని భావించడంవంటిది.

- హరి రాఘవ్

Keywords : free thinking, existentialism,
(04.07.2018 09:01:05pm)

No. of visitors : 2691

Suggested Posts


10 results found !


కెరీర్

ʹహరి రాఘవ్ గారు!! మీరెన్ని చెప్పినా మనిషి కెరీర్ కే ఇంపార్టెన్స్ ఇవ్వాలి అనిపిస్తుంది. మీ మాటలను నమ్మి ఒక్క రోజు రెస్ట్ తీసుకున్నా కెరీర్ లో వెనుకబడి పోవడం ఖాయం. మిగిలిన వాళ్ళు ముందుకు వెళ్లి పోతారు. అంతెందుకు మీరు మాత్రం అన్నేసి కౌన్సెలింగ్స్ ఇవ్వడం లేదా? మీకు కూడా కెరీర్ ముఖ్యం కాదా? నా కెందుకో మీరు చెప్పే దానిని పూర్తిగా నమ్మ బుద్ధి కావడం లేదు.ʹ ʹనమ్

చీమ మెదడులో చేరిన వైరస్

చాల కాలం క్రితం ఒక ప్రత్యేకమైన చీమల జాతి ఉండేదట. ఆ జాతి అంతరించి పోవడానికి ఒక అరుదైన వైరస్ కారణం. ఈ వైరస్ కేవలం ఆ చీమల మెదడు ఆధారం గానే జీవించగలదు. అడవిలో నివసించే ఈ చీమలు చాల శక్తివంతమైనవి మరియూ తెలివయినవి కూడా. ఎలా చేరిందో తెలియదు ఆ అరుదైన వైరస్ ఆ చీమల జాతికి చెందిన ఒక చీమ మెదడులోకి చేరుకుంది. అప్పటి నుండి ఆ వైరస్ ఆ చీమ మెదడును హ్యాండిల్ చెయ్యడం మొదలు

వ్యక్తి

నిజానికి ఈ సమాజంలో మారాల్సింది ఏదయినా ఉంది అంటే అది నేనే (వ్యక్తి). నేను మారితే మొత్తం సమాజం మారుతుంది. నేను మారకుండా సమాజం మారదు. వ్యక్తిగా ఎదగలేని నేను సమాజాన్ని మార్చాలని ప్రయత్నించడం వృధా మరియూ నన్ను నేను చేసుకునే మోసం.

Love | మనం నిజంగా ప్రేమిస్తున్నామా..?

మనం నిజంగా ప్రేమిస్తున్నామా..? లేక ప్రేమించబడాలని కోరుకుంటున్నామా..?? సాధారణంగా పురాణాలూ మొదలుకొని చరిత్ర, కథలు, నేటి సినిమాలు, నవలలో యువతీ యువకులు పరస్పరం ప్రేమించుకుంటూ ఉంటారు. కొన్ని సార్లు శారీరక ఆకర్షణకు లోనయి ప్రేమగా భావిస్తే మరికొన్ని సార్లు ఒకే విధమైన దృక్పధం (సిమిలర్ ఆటిట్యూడ్) ఉండటం వల్ల ప్రేమిచడం జరుగుతుంది. ఒకవేళ ఆ ఇద్దరిలో ఏ ఒక్కరు ప్రేమను త

మనిషి జీవితం జీవించడానికా? శోధించడానికా?

ఇతర జంతువులకు లేని అద్భుతమైన జ్ఞాపక శక్తి, సృజనాత్మక శక్తి మనిషికి లభించింది. అదే సమయంలో మనిషి ఆ జ్ఞాపక శక్తి, సృజనాత్మక శక్తి మనిషిని అనంతమైన దుఃఖంలోకి నెట్టివేస్తుంది. లభించిన సమాచారంలో అవసరమైనదేదో అనవసరమైనదేదో తేల్చుకోలేక ప్రతీ సమాచారాన్ని పరిగణలోకి తీసుకొని అవసరం లేని భయాలను, వేదనను పెంచుకోవడంలో మనిషి సిద్ధహస్తుడు. మనిషి తనకున్న భయాల నుంచి ఒక అభయం క

దేవుడు - అస్తిత్వవాదం

#ఎక్సిస్టెన్షలిజం లో తమ మానసిక స్థితినే కాకుండా ఇతరుల మానసిక స్థితి పట్ల శ్రద్ద వహించడం జరుగుతుంది. వ్యక్తి జీవితం అంటే అతని మానసిక స్థితి మాత్రమే. ప్రతీ విషయాన్నీ తను తీసుకునే విధానాన్ని బట్టి అతనికి అది బాధ కలిగించడం లేదా ఆనందాన్ని కలిగించడం జరుగుతుంది. ఒక విషయం ఒకరిని బాధించనంత మాత్రాన ఇతరులను బాధించదని భావించరాదు. లేదా ఒక విషయం మనల్ని బాధించినంత మాత

ఆనందపు తలుపులు

మనిషి జీవితానికి పరమార్థం వెతికే పనిలో పడతారు కొందరు మేధావులు. హాయిగా జీవించడమే తప్ప మారే పరమార్థం ఉండేది తెలుసుకుంటారు అందులో కొందరు. భార్య పిల్లలను వదిలి జ్ఞానం కోసం వెళ్లిన బుద్ధుడు ప్రపంచాన్ని గురువు, దేవుడు అయ్యాడు. కానీ ఆ భార్య పిల్లల దృష్టిలో బుద్ధుడు వేరు. సమాజంలో ఉన్న స్థితిని మరచి, ఉన్న భాద్యతలు మరచి భవిష్యత్తుకు ఇతరులను వదిలి వెళ్లడం వల్ల సమాజ

మరణం

ఒక మితృడి సోదరి మొన్న సాయంత్రం కాన్సర్ తో మరణించింది. మానసికంగా ఎంతో పరిపక్వత గల మిత్రుడు తన సోదరి పట్ల చాల అట్టాచ్డ్ గా ఉండేవాడు. ఆ బాధ నుంచి ఉపశమనం కోసం నాకు ఫోన్ చేసి కొంచెం సేపు తనతో ఉండవలసిందిగా కోరాడు. ఎన్నో సంవత్సరాల నుండి మేము ఎన్నో విషయాలు కొన్ని వందల గంటలు చర్చించాము. కానీ నిన్న అతని తో గడిపి మేము డిస్కస్ చేసిన విషయాలు మనిషి జీవితం పట్ల చాల స్ప

మరణం - జీవితం

మరణం గురించి తెలుసుకున్నప్పుడే అసలైన జీవితం మొదలవుతుంది. అప్పటి వరకు మనుషులు జీవించడాన్ని వాయిదా వేసుకుంటారు. చిన్నతనం మొత్తం కష్టపడి చదివి ఏదో ఒక ప్రొఫెషన్ లో స్థిరపడతారు. తరువాత ఆ ప్రొఫెషన్ తో సంపాదన మొదలవుతుంది. తరువాత ఆ స్థాయిని నిలబెట్టుకోవటం కోసం కష్టపడతారు. తరువాత పిల్లలో, మరొకటో కారణంతో కష్టపడతారు. ఇలా కష్టపడుతూనే ఉంటారు. అలా కష్టపడుతున్నంత సేపు

జీవితం

కార్ నెమ్మదిగా వెళ్లి పోతుంది. ఏసీ లో ఉన్న కుక్క మోహన్ ని చూస్తూనేఉంది. ఎండలో చెమటలు కక్కుతూ మోహన్ కుక్కను చూస్తున్నాడు. కార్ వెళ్లి పోయింది.
Search Engine

బయలాజికల్ మదర్
ఫేస్బుక్ ఓసీడీ (FBOCD)
నిజం ఆవస్యకత
నిజాలన్నీ అబద్దాలే
కెరీర్
చీమ మెదడులో చేరిన వైరస్
వ్యక్తి
జీవితం
హ్యూమనిజం
నేనెవరు?
PTSD
డాలర్లు వస్తున్నాయి గాని ఎండ రావడం లేదు
రిజర్వేషన్స్
కెరీర్ మీద ఇంటరెస్ట్ ఎలా వస్తుంది?
టీనేజ్ కి వచ్చిన పిల్లలతో ఎలా ప్రవర్తించాలి?
మీ పిల్లలను అనుమానంతో దండిస్తున్నారా?
Autism Treatment
మీ పిల్లలకు స్మార్ట్ ఫోన్స్ ఇస్తున్నారా?
NRI పేరెంట్స్ పిల్లల విషయంలో శ్రద్ధ వహించాల్సిన అంశాలు
టీనేజ్ ఆడపిల్లలకు సోషల్ మీడియాలో ఎదురయ్యే ఇబ్బందులేంటి?
బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్ళే ముందు తరువాత ప్రవర్తన
పిల్లలను కనాలి అనుకున్నపుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
మీ పిల్లల ముందే మీరు పోట్లాడుకుంటున్నారా? జాగ్రత్త!!
పిల్లలకు ఆటలను దూరం చేస్తున్నారా?
మనుసులో భావాలే కలలుగా వస్తాయా?
కలలు నిజాలు అవుతాయా?
ఎంప్టీ నెస్ట్ సిండ్రోమ్
Love | మనం నిజంగా ప్రేమిస్తున్నామా..?
తల్లిదండ్రుల మానసిక సమస్యలు పిల్లలకు వారసత్వంగా వస్తాయా?
టీనేజ్ అమ్మాయిలతో పేరెంట్స్ ఎలా మెలగాలి?
రెండవ కూతురు
ఏకాగ్రత పెంచుకోవడం ఎలా?
మనిషి జీవితం జీవించడానికా? శోధించడానికా?
పోరాటమా? బ్రతుకా?
పిల్లల్లో లెర్నడ్ హెల్ప్‌లెస్‌నెస్ ఎందుకు డెవలప్ అవుతుంది?
more..
ఫ్రీ