పోరాటమా? బ్రతుకా?

పోరాటమా?

మెయిన్ స్ర్టీమ్ మీడియా లాగా కాకుండా ఫేస్‌బుక్ గ్రూప్స్ లోను, ఇతర సామాజిక మాధ్యమాలలోను ప్రతీఒక్కరు స్పందించే అవకాశం ఉంటుంది. ఇది ఒక మంచి పరిణామం. ఏ సమస్యకయినా పరిష్కారం కనుగొనడంలో చర్చించడం ఒక ఉన్నతమయిన మార్గం. అయితే ఇందులో ఉన్న ఇబ్బంది ఏంటంటే చాలామంది చర్చల వరకే పరిమితం అవుతారు.

అయితే ఈ చర్చలో ప్రధానంగా చివరకు రెండు పరిష్కారాలు వస్తూ ఉంటాయి. అవి 1. #పోరాడటం 2. #సర్దుకొని బ్రతికెయ్యటం. ప్రతీ ఒక్కరూ ఈ రెండిటిలో ఏదో ఒక దానిని సమర్థిస్తూ రెండవ దానిని వ్యతిరేకిస్తుంటారు. సందర్భాన్ని బట్టి వారు ఈ రెండిటిలో ఒక సారి ఒక పరిష్కారం తీసుకుంటే మరో సారి రెండవ పరిష్కారం వైపు మొగ్గు చూపుతారు.

ఉదాహరణకు దళితుల విషయంలో పోరాటం కూడు పెడుతుందా? ప్రస్తుతం ఆకలి తీర్చుకోవటం ముఖ్యం అని చెప్పే వారు మరో మతం విషయంలో పోరాడాలి అని పిలుపునిస్తారు. అలాగే అణగారినిన వర్గాలు పోరాడి సాధించాలి అని వాదించే వారు తమ పిల్లల కెరీర్ విషయంలోనే లేదా వైవాహిక జీవితం విషయంలోనే సర్దుకొని బ్రతకాలి అని చెబుతారు. కొన్ని సార్లు స్త్రీ వాదం వినిపించే వాళ్ళు దళితులను సర్దుకొని బ్రతకాలి అని సలహాలు పడేస్తుంటారు.

ఎప్పుడు పోరాడాలి? ఎప్పుడు సర్దుకొని బ్రతకాలి? ఎందుకు పోరాడాలి? ఎందుకు సర్దుకొని బ్రతకాలి అనేది ఎవరికీ తోచిన విధంగా వారు చెబుతుంటారు. కానీ నిజానికి ఆ సందర్భాల్లో ఉన్న వారికీ మాత్రమే తెలుస్తుంది పోరాడాలో సర్దుకోవాలో. మనం పోరాడమంటే చెప్పటం ద్వారా వారు పోరాడటం. లేదా మనం సర్దుకో మనటం ద్వారా సర్దుకొని బ్రతికెయ్యటం సాధ్యపడదు.

కాబట్టి మన సలహాలకు ఒక పరిమితి ఉంటుంది అనే విషయం గ్రహించి అంతిమ నిర్ణయం వారికే వదిలెయ్యాలి. వారు మన సలహాకు వ్యతిరేకంగా నిర్ణయం తీసుకున్నంత మాత్రాన వారిని ద్వేషించడం లేదా మన సలహాకు అనుగుణంగా నిర్ణయం తీసుకున్నంత మాత్రాన విపరీతంగా అభిమానించడం సరికాదు.

- హరి రాఘవ్

Keywords : fight, life, dalit
(04.07.2018 11:34:37am)

No. of visitors : 1731

Suggested Posts


1 results found !


ఎంత కాలం ఈ రిజర్వేషన్స్..??

కొందరు ఆదివాసులకు, దళితులకు, బిసిలకు వేల సంవత్సరాలుగా అన్యాయం జరిగన మాట వాస్తవమే. అందుకు బదులుగా ఇచ్చిన రిజర్వేషన్స్ ఒప్పుకుంటాము కానీ ఎన్ని సంవత్సరాలని ఇస్
Search Engine

బయలాజికల్ మదర్
ఫేస్బుక్ ఓసీడీ (FBOCD)
నిజం ఆవస్యకత
నిజాలన్నీ అబద్దాలే
కెరీర్
చీమ మెదడులో చేరిన వైరస్
వ్యక్తి
జీవితం
హ్యూమనిజం
నేనెవరు?
PTSD
డాలర్లు వస్తున్నాయి గాని ఎండ రావడం లేదు
రిజర్వేషన్స్
కెరీర్ మీద ఇంటరెస్ట్ ఎలా వస్తుంది?
టీనేజ్ కి వచ్చిన పిల్లలతో ఎలా ప్రవర్తించాలి?
మీ పిల్లలను అనుమానంతో దండిస్తున్నారా?
Autism Treatment
మీ పిల్లలకు స్మార్ట్ ఫోన్స్ ఇస్తున్నారా?
NRI పేరెంట్స్ పిల్లల విషయంలో శ్రద్ధ వహించాల్సిన అంశాలు
టీనేజ్ ఆడపిల్లలకు సోషల్ మీడియాలో ఎదురయ్యే ఇబ్బందులేంటి?
బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్ళే ముందు తరువాత ప్రవర్తన
పిల్లలను కనాలి అనుకున్నపుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
మీ పిల్లల ముందే మీరు పోట్లాడుకుంటున్నారా? జాగ్రత్త!!
పిల్లలకు ఆటలను దూరం చేస్తున్నారా?
మనుసులో భావాలే కలలుగా వస్తాయా?
కలలు నిజాలు అవుతాయా?
ఎంప్టీ నెస్ట్ సిండ్రోమ్
Love | మనం నిజంగా ప్రేమిస్తున్నామా..?
తల్లిదండ్రుల మానసిక సమస్యలు పిల్లలకు వారసత్వంగా వస్తాయా?
టీనేజ్ అమ్మాయిలతో పేరెంట్స్ ఎలా మెలగాలి?
రెండవ కూతురు
ఏకాగ్రత పెంచుకోవడం ఎలా?
మనిషి జీవితం జీవించడానికా? శోధించడానికా?
ఫ్రీ థింకింగ్
పిల్లల్లో లెర్నడ్ హెల్ప్‌లెస్‌నెస్ ఎందుకు డెవలప్ అవుతుంది?
more..
పోరాటమా?