ఒంటరి బిడ్డ వలన ఇబ్బంది ఏంటి?
ఇందిరా గాంధీ హయాములో దేశంలో జనసాంద్రత ఎక్కువగా ఉంది దాన్ని నియంత్రించాలని కుటుంభం నియంత్రణ పథకాలను తెచ్చారు. ప్రభుత్వం చాల డబ్బు వెచ్చించి చిన్నకుటుంబం వల్ల కలిగే లాభాలను ప్రచారం చేసింది. ʹమేమిద్దరం మాకిద్దరుʹ అనే నినాదం దేశంలో ప్రతీ గ్రామంలో గోడలపైన దర్శనమిచ్చింది. పీవీ నరసింహారావు హయాంలో మొదలయిన గ్లోబలైజేషన్ వల్ల ప్రజలలో ఆర్థికంగా పోటీ పడటం పెరిగి చివరికి ఒక బిడ్డ చాలు అనే నిర్ణయానికి చాల మంది వచ్చారు.
మారిన సామజిక, ఆర్థిక పరిస్థితులలో ఒక్కరే బిడ్డని కనడం సాధారణం అయిపోయింది. అది ఫ్యాషన్ గా మారక పోయినా ప్రజల ఆర్థిక పోటీ తత్వం ఆ స్థితికి నెట్టివేసింది. ఒక్కరే బిడ్డ ఉండటం వల్ల చాల ఆర్థిక పరమైన లాభాలు ఉన్నాయి. అదే సమయంలో ఆ ప్రభావం ఆ బిడ్డ మానసిక స్థితిపైన కూడా ఉంటుంది. Child is the father of the man. ఒక వ్యక్తి మానసిక స్థితి అతను పెరిగిన వాతావరణాన్ని బట్టి ఉంటుంది. బాల్యంలో ఎదురయినా పరిస్థితులను బట్టి అతనిలో ఎమోషన్స్ ఉంటాయి. వ్యక్తి మానసిక స్థితి బర్త్ ఆర్డర్ ని బట్టి కూడా ఉంటుంది.
ఒక్కరే బిడ్డ ఉన్న ఇంట్లో పేరెంట్స్ బిడ్డ పట్ల ఓవర్ whelming రియాక్షన్ చూపిస్తూ ఉంటారు. వారి పిల్లలు పెద్దయ్యాక ఎలా ఉండాలి అనే ఊహను కేవలం ఆ బిడ్డ మీద మాత్రమే ఊహించుకోవటం వల్ల ఎక్కువగా బిడ్డ ప్రవర్తనను టీచింగ్ ద్వారా కంట్రోల్ చెయ్యాలి అని చూస్తారు. ఫలితం గా బిడ్డ సహజ స్థితిలో నేర్చుకోవలసినవి కూడా వేరొకరు టీచ్ చేస్తే నేర్చుకోవలసి వస్తుంది. తాను సహజంగా ఎదుర్కొన్న పరిస్థితులనుండి నేర్చుకున్న దానికి పేరెంట్స్ కండిషనల్ గా నేర్పించిన వాటికి తేడా ఉంటుంది. సహజ స్థితిలో మానసిక స్వేచ్ఛ ఉంటుంది. పేరెంట్స్ టీచ్ చేసిన దానిలో ప్రీ-కంక్లూషన్ ఉంది.
తల్లిదండ్రుల అతి శ్రద్ధ వల్ల బిడ్డ ఎమోషనల్ బ్లాక్ మెయిలింగ్ చెయ్యటం ప్రారంభిస్తాడు. ఉన్న ఒక్కగానొక్క బిడ్డ వ్యక్తిత్వం ఎలా మారుతుందో అన్న భయంతో పేరెంట్స్ డెసిషన్ మేకింగ్ లో తేడా వస్తుంది. ఫలితంగా ఆ బిడ్డ తనకు కావలసిన వాటిని ఎమోషనల్ బ్లాక్ మెయిలింగ్ ద్వారా ఎలా పొందాలో నేర్చుకుంటాడు. జీవితంలో అతను పెరిగిన తరువాత కూడా ఈ ఎమోషనల్ బ్లాక్ మెయిలింగ్ అతని వ్యక్తిత్వంలో ప్రతిఫలిస్తుంది.
ఒంటరి బిడ్డ బాల్యంలో ఎక్కువ సమయం తనకన్నా వయస్సులో చాల పెద్దవారయినా పేరెంట్స్ తోనే గడపడం వల్ల మాములు స్థితిలో పెరిగిన వారికంటే ఎక్కువ మెచ్యూర్డ్ గా ఉన్నట్లు ప్రవర్తిస్తారు. కానీ విషయం వచ్చేసరికి ఎమోషనల్ గా ఒక్కసారిగా బయట పడిపోవటం గమనించవచ్చు. చాల సార్లు మేధావిలా ప్రవర్తిస్తూ కొన్ని సార్లు దానికి పూర్తి భిన్నమయిన ప్రవర్తన కలిగి ఉంటారు. వీరిలో ఇతరులతో పోల్చితే ఎక్కువ arrogance ఉంటుంది. ఇతరుల మీద వెర్బల్ గా, ఫిసికల్ గా ఎక్కువగా దాడులు చెయ్యటాన్ని మనం గమనించవచ్చు. ఒంటరిగా పెరిగిన జీవిత భాగస్వామిని చేసుకున్నట్లయితే వీరి మధ్య ఇగో తో కూడిన conflicts ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. ఇతరులను, సమాజాన్ని జడ్జ్ చెయ్యటం, ఎలాగయినా విజయం సాధించాలి అనే విపరీతమయిన కోర్కె వీరిలో ఎక్కువ ఉంటుంది. వీరు చిన్న చిన్న ఓటమిని కూడా భరించలేరు.
- హరి రాఘవ్
Keywords : only child, single child, kids, parents, parenting
(03.07.2018 01:32:33pm)
No. of visitors : 836
Suggested Posts
10 results found !
| మానసిక ఆందోళనకు బాల్యానికి సంబంధం ఏంటి?ఒక వ్యక్తి జీవితంలో తను పెర్ఫర్మ్ చేసే అనేక అంశాల మీద తీవ్రమయిన వ్యతిరేక ప్రభావం చూపించేది అతనిలోని మానసిక ఆందోళన (#ANXIETY). అతను చేసే ఉద్యోగంలో, వ్యాపారంలో, స్నేహితులతో మెలిగే సమయాలలో, కుటుంబ సంబంధాల విషయాలలోనే కాకుండా అతని లేదా ఆమె లైంగిక జీవనాన్ని కూడా ANXIETY ప్రభావితం చేస్తుంది. ఈ ANXIETY ని అధిగమించ లేక అనేక మంది రకరకాల ఉత్ప్రేరకాలు అలవాటు పడుతున్ |
| వివాహేతర సంబంధాలు ఎందుకు ఏర్పడతాయి?వివాహేతర సంబంధాలు ఎందుకు ఏర్పడతాయి? |
| సోషల్ మీడియాలో పోకిరీల భారిన పడకుండా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి?సోషల్ మీడియాలో పోకిరీల భారిన పడకుండా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? |
| సైకోథెరపీ అంటే ఏంటి?#సైకోథెరపీ అంటే ఏంటి? అది ఎలా పనిచేస్తుంది. ఎటువంటి మానసిక సమస్యలకు సైకోథెరపీ అవసరం. సైకోథెరపీకి, కౌన్సిలింగ్ మధ్య తేడా ఏంటి? సైకోథెరపీతో పరిష్కరించాల్సిన మానసిక సమస్యలకు మందులు వాడటం వల్ల వచ్చే దుష్ఫలితాలేంటి? |
| భార్యభర్తల మధ్య విభేదాలకు కల్చర్ ఎలా కారణమవుతుంది? వైవాహిక జీవితంలో కులాంతర, మతాంతర, ప్రాంతాంతర అంశాలు ప్రభావితం చేస్తాయా? ఒకవేళ అటువంటి అంశాలుంటే వాటిని ఎలా ఎదుర్కోవాలి? క్రాస్ కల్చర్ మ్యారేజ్ లలో చిన్నచిన్న ఇబ్బందులను సరయిన రీతిలో అర్థం చేసుకోకపోతే ఎలా జీవితాల మీద ప్రభావితం చేసే అవకాశం ఉంది? |
| కనుపాపను బ్రతికిద్దాం - Part 2ఇటీవల కాలంలో తెలుగు రాష్ట్రాలలో చిన్నారులపై పెరుగుతున్న అత్యాచారాలపైన వనిత టీవీ లో ప్రత్యేక చర్చ. |
| కనుపాపను బ్రతికిద్దాం - Part 1ఇటీవల కాలంలో తెలుగు రాష్ట్రాలలో చిన్నారులపై పెరుగుతున్న అత్యాచారాలపైన వనిత టీవీ లో ప్రత్యేక చర్చ. |
| దాచేపల్లిలో 9 ఏండ్ల బాలిక పైన 53 ఏండ్ల వృద్ధుడు అత్యాచార ఘటనఅసలు రేప్ లు ఎందుకు జరుగుతుంటాయి? రేప్ కి లైంగిక వాంఛకు సంబంధం ఉందా? లేదా? ఇది మానసిక రుగ్మధనా? శారీరక రుగ్మధనా? లేక సామాజిక రుగ్మధనా? రేపిస్ట్ మానసిక పరిస్థితి ఏమిటి? అతను ఏమి పొందాలనుకుంటాడు? అది అతను పొందుతున్నడా? స్త్రీ వస్త్రధారణకు రేప్ కు సంభంధం ఉందా? సమాజంలో అట్టడుగు వర్గాల వారే రేప్ చేస్తారా? లేక వారి పైన మాత్రమే చట్టం పనిచేస్తుందా? |
| హైపోకాండ్రియా | Illness Anxiety Disorderకొందరు అంతు చిక్కని రోగంతో బాధ పడుతూ ఉంటారు. మెడికల్ టెస్ట్ లలో ఏ విధమైన జబ్బు బయట పడక పోయినా వారు ఏదో ఒక నొప్పితో బాధ పడుతుంటారు. తరుచుగా డాక్టర్స్ ని, హాస్పిటల్స్ ని మార్చినా వారి జబ్బు నయం కాకపోడానికి కారణం ఏంటి? |
| Insomnia | నిద్రలేమిని ఎదుర్కోవడం ఎలా?అందరూ తేలికగా తీసుకున్నప్పటికీ నిద్రలేమి ఒక భయంకరమైన సమస్య. ఎన్నో మానసిక శారీరక సమస్యలకు మూలం ఈ నిద్రలేమి. మారిన వర్క్ కల్చర్ నిద్రలేమికి ఒక కారణం అయితే ఫేస్బుక్, ట్విట్టర్ వంటి సోషల్ మీడియా కు అడిక్ట్ అవ్వడం మరొక కారణం. ఇవే కాకుండా నిద్రలేమికి అనేక కారణాలుంటాయి. |
| డాలర్లు వస్తున్నాయి గాని ఎండ రావడం లేదు |
| కెరీర్ మీద ఇంటరెస్ట్ ఎలా వస్తుంది? |
| టీనేజ్ కి వచ్చిన పిల్లలతో ఎలా ప్రవర్తించాలి? |
| మీ పిల్లలను అనుమానంతో దండిస్తున్నారా? |
| మీ పిల్లలకు స్మార్ట్ ఫోన్స్ ఇస్తున్నారా? |
| NRI పేరెంట్స్ పిల్లల విషయంలో శ్రద్ధ వహించాల్సిన అంశాలు |
| టీనేజ్ ఆడపిల్లలకు సోషల్ మీడియాలో ఎదురయ్యే ఇబ్బందులేంటి? |
| బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్ళే ముందు తరువాత ప్రవర్తన |
| పిల్లలను కనాలి అనుకున్నపుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? |
| మీ పిల్లల ముందే మీరు పోట్లాడుకుంటున్నారా? జాగ్రత్త!! |
| పిల్లలకు ఆటలను దూరం చేస్తున్నారా? |
| మనుసులో భావాలే కలలుగా వస్తాయా? |
| Love | మనం నిజంగా ప్రేమిస్తున్నామా..? |
| తల్లిదండ్రుల మానసిక సమస్యలు పిల్లలకు వారసత్వంగా వస్తాయా? |
| టీనేజ్ అమ్మాయిలతో పేరెంట్స్ ఎలా మెలగాలి? |
| మనిషి జీవితం జీవించడానికా? శోధించడానికా? |
more..