నిద్రలేమిని జయించడానికి టిప్స్ - 3

నిద్రలేమిని

నిద్రలేమికి సమయ పాలన, శారీరక శ్రమ తరువాత ముఖ్యమైనది ఆహార నియమాలు. ప్రతీ రోజు మనం తీసుకునే ఆహారంలో ఘన, ద్రవ పదార్ధాల ప్రభావం, అవి తీసుకునే సమయం ప్రభావం నిద్ర మీద ఉంటుంది. ముఖ్యంగా ఆకలితో పడుకున్న నిద్ర లభించడం ఎలాగయితే కష్టమో అలాగే ఎక్కువగా ఆహారం తీసుకున్నా నిద్ర లభించడం కష్టం.

వ్యక్తి ఉదయం పూట తీసుకునే ఆహారం పరిమాణంతో పోల్చితే రాత్రి తీసుకునే ఆహారం పరిమాణం తక్కువగా ఉండాలి. ఆల్కహాల్ వంటి వాటిని వీలయినంత దూరం పెట్టాల్సిన అవసరముంది. ఆల్కహాల్ మనిషి శరీరంలో తెచ్చే మార్పుతోని ఆలోచన విధానం మారడం వల్ల, మత్తువల్ల కూడా నిద్ర మీద ప్రభావముంటుంది.

కాఫీ, టీలవంటి పానీయాలు సాయంత్రం 4 తరువాత తీసుకోవడం నిద్ర పట్టక ఇబ్బంది పడే అవకాశాలు ఎక్కువ. అలాగే నిద్ర పోవడానికి రాత్రి పూట భోజనానికి కనీసం ఒక గంటయినా సమయం ఉండేలాగా జాగ్రత్త పడాలి. అతిగా మసాలాలు, కారం ఉన్న ఆహారం భుజించడాన్ని మానివేయడం మంచిది.

రాత్రి పూట చన్నీళ్ళ స్నానం కన్నా వేడి నీళ్ల స్నానం చెయ్యడం ఉతికిన కాటన్ వస్త్రాలు ధరించడం వల్ల మంచి నిద్ర లభించే అవకాశాలున్నాయి. రాత్రి పూట అతి శీతలంగా ఉన్న పదార్థాలు తీసుకోవడం మానివేయాలి. గోరువెచ్చని పాలు త్రాగడం వల్ల మంచి నిద్ర పట్టే అవకాశాలున్నాయి.

- హరి రాఘవ్

Keywords : insomnia, psychology
(26.05.2018 12:18:42pm)

No. of visitors : 825

Suggested Posts


8 results found !


కాగ్నిటివ్ హైప్నోథెరపీ ద్వారా నిద్రలేమిని అధిగమించవచ్చా?

నిద్రలేమికి సమయ పాలన, శారీరక శ్రమ, శుభ్రత, ఆహరం, నిశ్శబ్దం, చీకటి వంటి అనేక భౌతిక కారణాలే కాకుండా మానిసిక కారణాలు కూడా ఉంటాయి. చాల మంది మానసిక కారణాల వలన నిద్ర పోలేక బాధపడుతూ ఉంటారు. వీటిలో ముఖ్యమయినవి ఒంటరితనం, ప్రేమ రాహిత్యం, ఆందోళన, భయం, ఆత్మన్యూనత, గతం గురించిన బాధ మొదలయిన అనేక కారణాలుంటాయి. వీటినుండి బయటపడలేక చాలామంది మందులను ఆశ్రయిస్తారు. నిద్రలే

నిద్రలేమిని జయించడానికి టిప్స్ - 4

మంచి నిద్ర లభించడానికి నిద్రించే సమయం, శారీరక శ్రమ, ఆహారానియమాల తరువాత నిద్రించే ప్రదేశం ప్రభావం కూడా ఉంటుంది. శారీరక శ్రమ ఎక్కువగా ఉన్నవారు ఎక్కడ నిద్ర పోయారో కూడా గమనించకుండా నిద్ర పడుతుంది. కానీ నిద్రలేమితో బాధ పడేవారు తాము నిద్రించే బెడ్ రూమ్ పట్ల కొంత శ్రద్ధ వహించాలి. ముఖ్యంగా బెడ్ రూమ్ నిద్రించే సమయంలో చీకటిగా ఉండటం అవసరం. గది గోడలు డార్క్ కలర్స్

నిద్రలేమిని జయించడానికి టిప్స్ - 2

మనిషి శరీరానికి మనస్సుకు సంబంధం ఉంటుంది. శరీరపరమైన ఇబ్బందులు మనస్సు మీద, మానసిక మయిన ఇబ్బందులు శరీరం మీద ప్రభావితం చేస్తాయి. ఆత్మన్యూనతతో బాధ పడుతున్నప్పుడు శరీరం బలహీనంగా అనిపించడం అలాగే శారీరకంగా బలహీనంగా ఉన్నప్పుడు మానసికమైన ఇబ్బందులు పడటం సహజం. అయితే మానసిక సమస్యలతో డాక్టర్ ని సంప్రదించినపుడు ఇచ్చే మందుల వలన మెదడు, శరీరం ఆక్టివ్ నెస్ తగ్గి క్రమంగా క

నిద్రలేమిని జయించడానికి టిప్స్ - 1

డార్విన్ జీవ పరిణామ సిద్ధాంతం ప్రకారం మనిషి జంతువుల నుండి పరిణామం చెందాడు. నిశితంగా గమనిస్తే మనిషికి ఆలోచన, జ్ఞాపక శక్తి తప్ప మిగిలినవి అన్నీ జంతువులకు ఉన్న లక్షణాలే కనిపిస్తాయి. జీవుల నిద్రకు రాత్రికి విడదీయరాని సంబంధం ఉంది. మనిషి శరీరంలో విడుదలయ్యే మెలటోనిన్ అనే హార్మోన్ మనిషిని నిద్రపోడానికి సహకరిస్తుంది. ఈ మెలటోనిన్ విడుదల చీకటి వేళలో ఎక్కువగాను, పగట

నిద్రలేమిని జయించడానికి ప్రోగ్రాం

ప్రస్తుత పోటీ యుగంలో నిద్రలేమితో బాధ పడేవారి శాతం రోజు రోజుకూ పెరుగుతుంది. ఇందులో అతి కొద్ది శాతం మాత్రమే శారీరక పరమైన సమస్యలతో నిద్రలేమికి గురవుతుంటే చాలావరకు మానసిక సమస్యల వల్ల నిద్రలేమికి గురవుతున్నారు. అహంకారం వల్ల వాస్తవాలను అంగీకరించలేక పోవడం, గతానికి సంబంధించిన ఆలోచనలు తీవ్రంగా వెంటాడటం, భవిష్యత్తు గురించిన విపరీతమైన ఆందోళన, సోషల్ మీడియా కు బానిస

నిద్రలేమి సమస్యతో వచ్చిన వారిని డాక్టర్స్ ఏం చేస్తున్నారు?

ప్రస్తుత పోటీ ప్రపంచంలో మనుషులను తీవ్రంగా బాధిస్తున్న సమస్య నిద్రలేమి. ప్రతీ విషయంలో ఇతరులతో పోటీ పడడం, గెలిస్తే తప్ప జీవనం సాగించ లేకపోవడం, అతి చిన్న విషయాలను కూడా మనిషి తన అహంకారం వల్ల చాల పెద్దదిగా భావించడం వల్ల ఆందోళనకు గురవుతున్నాడు. ఎప్పుడయితే తీవ్రమైన ఆందోళన మనిషిని వెంటాడుతుందో అతనికి నిద్రపట్టే అవకాశాలు తక్కువ. ఆందోళన వల్ల నిద్రపట్టని వారు తరచు

Insomnia | నిద్రలేమిని ఎదుర్కోవడం ఎలా?

అందరూ తేలికగా తీసుకున్నప్పటికీ నిద్రలేమి ఒక భయంకరమైన సమస్య. ఎన్నో మానసిక శారీరక సమస్యలకు మూలం ఈ నిద్రలేమి. మారిన వర్క్ కల్చర్ నిద్రలేమికి ఒక కారణం అయితే ఫేస్బుక్, ట్విట్టర్ వంటి సోషల్ మీడియా కు అడిక్ట్ అవ్వడం మరొక కారణం. ఇవే కాకుండా నిద్రలేమికి అనేక కారణాలుంటాయి.

నిద్రలేమిని జయించడానికి మార్గాలు

మనిషికి ఆహారము, నీరు ఎంత అవసరమో నిద్ర కూడా అంతే అవసరం. ప్రతీరోజు సరయిన నిద్ర పోక పోయినట్లయితే ఆవ్యక్తి ప్రవర్తనలో తేడాలు వచ్చే అవకాశాలుంటాయి. వారు రోజూ చేసే పనులను సరిగా చెయ్యలేక పోవడం, హేతుబద్దంగా ఆలోచించి సరయిన నిర్ణయాలు తీసుకోలేక పోవడం, విసుగు, చిరాకు వంటివి గమనించవచ్చు. చాల మంది దీర్ఘకాల నిద్రలేమితో బాధ పడుతుంటారు. వీరు సరిగా నిద్ర పోలేక పోవడం, ఒకవే
Search Engine

బయలాజికల్ మదర్
ఫేస్బుక్ ఓసీడీ (FBOCD)
నిజం ఆవస్యకత
నిజాలన్నీ అబద్దాలే
కెరీర్
చీమ మెదడులో చేరిన వైరస్
వ్యక్తి
జీవితం
హ్యూమనిజం
నేనెవరు?
PTSD
డాలర్లు వస్తున్నాయి గాని ఎండ రావడం లేదు
రిజర్వేషన్స్
కెరీర్ మీద ఇంటరెస్ట్ ఎలా వస్తుంది?
టీనేజ్ కి వచ్చిన పిల్లలతో ఎలా ప్రవర్తించాలి?
మీ పిల్లలను అనుమానంతో దండిస్తున్నారా?
Autism Treatment
మీ పిల్లలకు స్మార్ట్ ఫోన్స్ ఇస్తున్నారా?
NRI పేరెంట్స్ పిల్లల విషయంలో శ్రద్ధ వహించాల్సిన అంశాలు
టీనేజ్ ఆడపిల్లలకు సోషల్ మీడియాలో ఎదురయ్యే ఇబ్బందులేంటి?
బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్ళే ముందు తరువాత ప్రవర్తన
పిల్లలను కనాలి అనుకున్నపుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
మీ పిల్లల ముందే మీరు పోట్లాడుకుంటున్నారా? జాగ్రత్త!!
పిల్లలకు ఆటలను దూరం చేస్తున్నారా?
మనుసులో భావాలే కలలుగా వస్తాయా?
కలలు నిజాలు అవుతాయా?
ఎంప్టీ నెస్ట్ సిండ్రోమ్
Love | మనం నిజంగా ప్రేమిస్తున్నామా..?
తల్లిదండ్రుల మానసిక సమస్యలు పిల్లలకు వారసత్వంగా వస్తాయా?
టీనేజ్ అమ్మాయిలతో పేరెంట్స్ ఎలా మెలగాలి?
రెండవ కూతురు
ఏకాగ్రత పెంచుకోవడం ఎలా?
మనిషి జీవితం జీవించడానికా? శోధించడానికా?
ఫ్రీ థింకింగ్
పోరాటమా? బ్రతుకా?
more..
నిద్రలేమిని