నిద్రలేమిని జయించడానికి ప్రోగ్రాం
ప్రస్తుత పోటీ యుగంలో నిద్రలేమితో బాధ పడేవారి శాతం రోజు రోజుకూ పెరుగుతుంది. ఇందులో అతి కొద్ది శాతం మాత్రమే శారీరక పరమైన సమస్యలతో నిద్రలేమికి గురవుతుంటే చాలావరకు మానసిక సమస్యల వల్ల నిద్రలేమికి గురవుతున్నారు.
అహంకారం వల్ల వాస్తవాలను అంగీకరించలేక పోవడం, గతానికి సంబంధించిన ఆలోచనలు తీవ్రంగా వెంటాడటం, భవిష్యత్తు గురించిన విపరీతమైన ఆందోళన, సోషల్ మీడియా కు బానిస కావడం, శారీరక శ్రమ లేక పోవడం, ప్రేమ, పెళ్లి, రిలేషన్స్ విఫలం కావడం వంటి కారణాలు ప్రముఖంగా కనిపిస్తున్నాయి.
ఈ సమస్యలు రాత్రికి రాత్రి తీరిపోవు. కాబట్టి నిద్రలేమితో బాధ పడే వారు మెడిసిన్ మీదో, డ్రగ్స్ మీదనో ఆధారపడుతున్నారు. ఇవి తాత్కాలికంగా వారికి నిద్రను కలిగించ వచ్చు గాని, వీటిని వాడిన వారి శారీరక మానసిక స్థితి మీద వీటి ప్రభావం తీవ్రంగా ఉంటుంది. అవి లేకుండా నిద్రపోలేని స్థితిలోకి ఆ వ్యక్తి చేరుకోవడమే కాకుండా, ఊబకాయం, హార్మోనల్ సమతుల్యత దెబ్బతినడం వంటి అనేక దుష్ఫలితాలుంటాయి. దీర్ఘ కాలంలో అవి వాడిన వారు తీవ్ర ఒత్తిడికి, ఆందోళనకు గురికావడం, డిప్రెషన్ కి లోనవడం జరుగుతాయి.
నా క్లయింట్స్ కోసం మెడిసిన్, డ్రగ్ కాకుండా వెంటనే ఫలితాలు ఇచ్చే ప్రక్రియ కోసం కొన్ని నెలలుగా స్టడీ చేశాను. నిద్రలేమికి ఆలోచననే కారణం. ఆ ఆలోచనలు కొన్ని దొంతరలుగా మన మనస్సు నుండి వెళుతూ ఉంటాయి. కొన్ని వెంటాడుతూ ఉంటాయి. అలా వెంటాడటానికి కారణం మన ఎమోషనల్ స్టేట్. ఇది మనకు గతంలో ఎదురయినా అనుభవాలను బట్టి ఉంటాయి. వాటిని మార్చడం మాములుగా సాధ్యపడదు.
అయితే ఏదయితే ఆలోచన మనలను వెంటాడుతుందో దాని మూలాల్లోకి వెళ్లి గుర్తించి దానిని మరుగున పరుస్తూ మన మనస్సుకు ప్రోగ్రాం చేసే అవకాశం ఉంది. ఎలాగయితే ఒక తెల్లని గోడ మీద మరక పడితే దాని మీద మళ్ళీ, మళ్ళీ కోటింగ్ వెయ్యడం ద్వారా ఆ మరకను పైకి కనిపించకుండా చెయ్యొచ్చో అలాగే మనస్సులో ఇబ్బందిగా మారిన ఎమోషనల్ పార్ట్ ని ప్రోగ్రాం చెయ్యడం ద్వారా మరుగున పడేసి కొత్త ప్రోగ్రాం మనస్సులో మెదిలి నిద్రలేమి నుంచి బయటపడే అవకాశాలున్నాయి.
ఈ ప్రోగ్రాం CBT, NLP, హైప్నో థెరపీ ల నుండి తీసుకోబడినది. ప్రతీ క్లయింట్ కి ప్రత్యేక స్క్రిప్ట్ రాయాల్సి ఉంటుంది. ప్రస్తుతం ముగ్గురు కోసం స్క్రిప్ట్ డెవలప్ చేస్తున్నాము. దాని ఫలితాలను త్వరలో వెల్లడిస్తాము.
- హరి రాఘవ్
Keywords : insomnia, sleeplessness, psychology
(22.05.2018 09:06:50pm)
No. of visitors : 697
Suggested Posts
Sorry, there are no suggested posts
| డాలర్లు వస్తున్నాయి గాని ఎండ రావడం లేదు |
| కెరీర్ మీద ఇంటరెస్ట్ ఎలా వస్తుంది? |
| టీనేజ్ కి వచ్చిన పిల్లలతో ఎలా ప్రవర్తించాలి? |
| మీ పిల్లలను అనుమానంతో దండిస్తున్నారా? |
| మీ పిల్లలకు స్మార్ట్ ఫోన్స్ ఇస్తున్నారా? |
| NRI పేరెంట్స్ పిల్లల విషయంలో శ్రద్ధ వహించాల్సిన అంశాలు |
| టీనేజ్ ఆడపిల్లలకు సోషల్ మీడియాలో ఎదురయ్యే ఇబ్బందులేంటి? |
| బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్ళే ముందు తరువాత ప్రవర్తన |
| పిల్లలను కనాలి అనుకున్నపుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? |
| మీ పిల్లల ముందే మీరు పోట్లాడుకుంటున్నారా? జాగ్రత్త!! |
| పిల్లలకు ఆటలను దూరం చేస్తున్నారా? |
| మనుసులో భావాలే కలలుగా వస్తాయా? |
| Love | మనం నిజంగా ప్రేమిస్తున్నామా..? |
| తల్లిదండ్రుల మానసిక సమస్యలు పిల్లలకు వారసత్వంగా వస్తాయా? |
| టీనేజ్ అమ్మాయిలతో పేరెంట్స్ ఎలా మెలగాలి? |
| మనిషి జీవితం జీవించడానికా? శోధించడానికా? |
more..