డాక్టర్లుగా మారనున్న నర్సులు
ఇక నుంచి నర్సులు డాక్టర్లు కానున్నారు. నర్సులు కూడా వైద్యం చేసేందుకు వీలు కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. వైద్యులపై పెరుగుతున్న పనిభారం, ఒత్తిడిని తగ్గించేందుకు ఈ చర్యలకు శ్రీకారం చుట్టనుంది. ఇందుకోసం కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా ఒక కోర్సును ప్రవేశపెట్టేందుకు చర్యలు తీసుకుంటోంది. జాతీయ స్థాయిలో నర్సుల వృత్తి నైపుణ్యాలను పెంపొందించేందుకు వీలుగా శిక్షణ నివ్వాలని యోచిస్తోంది. దీనికి సంబంధించి ఇప్పటికే జాతీయ నర్సింగ్ మండలికి ఆదేశాలను సైతం జారీ చేసింది. కోర్సు నిర్వహణకు సంబంధించి విధి విధానాలపై మండలి విసృత్తంగా చర్చలు జరపుతోంది. త్వరలోనే కోర్సును అమలు చేసేందుకు నర్సింగ్ మండలి సమాయత్తమవుతోంది. ఈ కోర్సు నిర్వహణపై అభిప్రాయాల కోసం అన్ని రాష్ట్రాలకు లేఖలు సైతం పంపించింది. రాష్ట్రాలన్నీ ఇందుకు సుముఖతను కూడా వ్యక్తం చేశాయి.
ప్రత్యేక కోర్సు నిర్వహణ ఇలా….
నర్సులు డాక్టర్లుగా సేవలను అందించేందుకు వీలుగా నర్సింగ్ విద్యలో మౌలికమైన మార్పులను చేసేందుకు సిద్ధమైంది. ఈ నేపథ్యంలోనే జిఎన్‌ఎం(జనరల్ నర్స్, మిడ్ వైఫరీ) కోర్సును రద్దు చేసి బిఎస్‌సి నర్సింగ్ విద్యను మూడేళ్ళ నుండి ఐదేళ్లకు పెంచాలని భావిస్తోంది. దీనికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే ఒక నిర్ణయం తీసుకుంది. కోర్సును అమలు చేయాలని భావించిన కేంద్రం అన్ని రాష్ట్రాల్లోని నర్సుల స్థితిగతులతో పాటు వారి పనివిధానంపై సమగ్రంగా సర్వే నిర్వహించింది. ఇందులో పలు ఆసక్తికర విషయాలు కేంద్రం దృష్టికి రావడంతో వీటిపై ప్రత్యేకంగా ఆరా తీసింది. సీనియర్ నర్సులకు ప్రతి అపరేషన్‌పై పూర్తి అవగాహన ఉండడంతో పాటు వైద్యుడిని ఉన్న తీవ్రమైన పని ఒత్తిడిని తగ్గించేందుకు కూడా కృషి చేస్తున్నట్లు గుర్తించింది. ఈ నేపథ్యంలో నర్సులు వైద్యులుగా కొనసాగించాలని కేంద్రం భావిస్తోంది. ఇందుకోసం నర్సు ప్రాక్టీషినరీ కోర్సును ఏర్పాటు చేసి ఇప్పటికే నర్సింగ్ వృత్తిలో ఉన్నవారికి ప్రత్యేకంగా శిక్షణ కూడా ఇవ్వాలని నిర్ణయించింది. దీంతో కేంద్ర ఆరోగ్య, కుటుంబ మంత్రిత్వశాఖ భారతీయ నర్సింగ్ మండలికి ఆదేశాలు సైతం జారీ చేసింది. దీనికి సంబంధించి విధి విధానాలను కూడా రూపొందిస్తోంది. నర్సు ప్రాక్టిషినరీ కోర్సు ఇన్ క్రిటికర్ కేర్‌ను ప్రారంభించేందుకు 50 కళాశాలలు ముందుకు రావడం విశేషం.
సాధ్యాసాధ్యాలపై ఆరా….
నర్సుల వైద్యులుగా గుర్తింపునిస్తే డాక్టర్ల నుండి ఎలాంటి స్పందన వస్తుంది, ప్రజలు ఎలా స్వీకరిస్తారనే అంశాలపై కేంద్రం కూలంకుషంగా చర్చిస్తోంది. నర్సులకు ప్రత్యేక నర్సింగ్ కోర్సు కోసం అర్హత పరీక్షను కూడా నిర్వహించాలని భావిస్తోంది. ఈ నేపథ్యంలో అన్ని రాష్ట్రాల్లో నర్సింగ్ విద్యార్థులు ఇక నుంచి నర్సింగ్ మండలిలో ఏకీకృత విధానంలో నమోదు చేసుకునేలా జాతీయఆరోగ్య విధానాన్ని అమలు చేసేందుకు శ్రీకారం చుట్టనుంది. అన్ని అంశాలు అనుకూలిస్తే వచ్చే మూడు, నాలుగేళ్ళల్లో ఈ కోర్సును అమలు చేయాలని భావిస్తోంది.
మా సేవలకు గుర్తింపు: జి.నిర్మల, నిమ్స్ హెడ్ నర్సు
తమ సేవలకు గుర్తింపుగా కేంద్రం కొత్త కోర్సును ప్రవేశపెడుతుందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఆసుపత్రుల్లో నర్సులే కీలకమైన పాత్రను నిర్వహిస్తున్నారని చెప్పారు. దీనివల్ల రాష్ట్రంలోని యువతులు సైతం నర్సింగ్ విద్య పట్ల మరింత ఆసక్తిని ప్రదర్శించే అవకాశముంటుంది.
Keywords : nurses, doctors,
(14.02.2018 07:37:23pm)
No. of visitors : 361
Suggested Posts
Sorry, there are no suggested posts
| డాలర్లు వస్తున్నాయి గాని ఎండ రావడం లేదు |
| కెరీర్ మీద ఇంటరెస్ట్ ఎలా వస్తుంది? |
| టీనేజ్ కి వచ్చిన పిల్లలతో ఎలా ప్రవర్తించాలి? |
| మీ పిల్లలను అనుమానంతో దండిస్తున్నారా? |
| మీ పిల్లలకు స్మార్ట్ ఫోన్స్ ఇస్తున్నారా? |
| NRI పేరెంట్స్ పిల్లల విషయంలో శ్రద్ధ వహించాల్సిన అంశాలు |
| టీనేజ్ ఆడపిల్లలకు సోషల్ మీడియాలో ఎదురయ్యే ఇబ్బందులేంటి? |
| బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్ళే ముందు తరువాత ప్రవర్తన |
| పిల్లలను కనాలి అనుకున్నపుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? |
| మీ పిల్లల ముందే మీరు పోట్లాడుకుంటున్నారా? జాగ్రత్త!! |
| పిల్లలకు ఆటలను దూరం చేస్తున్నారా? |
| మనుసులో భావాలే కలలుగా వస్తాయా? |
| Love | మనం నిజంగా ప్రేమిస్తున్నామా..? |
| తల్లిదండ్రుల మానసిక సమస్యలు పిల్లలకు వారసత్వంగా వస్తాయా? |
| టీనేజ్ అమ్మాయిలతో పేరెంట్స్ ఎలా మెలగాలి? |
| మనిషి జీవితం జీవించడానికా? శోధించడానికా? |
more..