లాభాలు లేకుంటే స్కూళ్ళు పెడతరా?

లాభాలు

ప్రైవేట్ స్కూళ్లలో ఇప్పుడు వసులుచేస్తున్న ఫీజులు తక్కువనే ఉన్నా యన్నట్లు ప్రతి సంవత్సరం 10%పెంచుకోవచ్చని తిరుపతిరావు కమిటీ తేల్చిన నివేదిక నిర్వాకం మూలిగే నక్క మీద తాటిపండు పడ్డట్టయ్యింది.ఫీజులు తగ్గించడం కొరకే ఈ కమిటీని ప్రభుత్వం వేసిందని ఫీజులు తగ్గబోతున్నాయని అవి చెల్లించడానికి కష్టపడుతున్న కుటుంబాలు వీరి నివేదిక వచ్చేవరకు ఆశతో ఎదురుచుస్తూ ఉన్నాయి.ఫీజులు ప్రయివేటు స్కూళ్లలో తక్కువ ఉన్న వాటిలో పెంచుకునే అవకాశం కూడా ఈ కమిటీ ఇవ్వబోతున్నదని, సిఫారసుచెయ్యబోతున్నదని ఇప్పటివరకు అంటే ఈ కమిటీ నివేదిక ఇచ్చేవరకు చాలామందికి తెలియదు.

ఈ కమిటీ ఎటువంటి పేరెంట్స్ ను ఇంటర్వ్యూ చేసిందో, ఎవరినుండి ఫీడ్బ్యాక్ తీసుకుందో అర్ధం కావడంలేదు. మొరటు వానికి ఏంతెలుసు మొగలిపూవుల వాసన అన్నట్టు యూనివర్సిటీలు ఏలిన తిరుపతిరావు వంటి విసిలకు స్కూళ్ల ఫీజులతో పోరాడలేకపోతున్న పేరెంట్స్ బాధలు ఎట్ల తెలుస్తయ్? అని తిరుపతిరావు గారి నివేదిక సారాంశంతో అనిపిస్తున్నది. ఈ కమిటీ ఏర్పాటు చేసిన లక్ష్యాలలోనే లోపముందా? లేక అసలు లక్ష్యాలను అర్ధంచేసుకోవడంలో కమిటీ విఫలమయ్యిందా? అనేది అర్ధం కాకుండా ఉన్నది.

ప్రైవేట్ స్కూల్స్ స్థాపించింది లాభార్జన కొరకు కాదు అని ఒక్కపేరెంట్ కూడా అనుకోవట్లేదు. కాకుంటే అడ్డగోలు లాభాలతో స్కూలుళ్ళు నడపాలనుకోకండి అని మాత్రమే పేరెంట్స్ అంటున్నారు. ఇప్పుడున్న ఫీజులే అడ్డగోలు లాభాలు తెచ్చిపెడుతున్నాయని తగ్గించాలని వాటి యాజమాన్యాలమీద వత్తిడితేవాలని ప్రజలు డిమాండ్ చేస్తుంటే తిరుపతిరావు కమిటీ 10%పెంచుకోమనడం దారుణమే.

- రాములు చందా
విశ్రాంత అధ్యాపకులు

Keywords : school, fee, telangana
(02.01.2018 09:41:00am)

No. of visitors : 773

Suggested Posts


1 results found !


పిల్లలను అవమానిస్తున్నారు.. చంపేస్తున్నారు..

మల్కాజ్ గిరి జ్యోతి మోడల్ స్కూల్ లో తొమ్మిదవ తరగతి చదువుతున్న సాయి దీప్తిని ఫీజు కట్టలేదని యాజమాన్యం పరీక్ష రాయనివ్వలేదు. దానితో తీవ్ర మనస్తాపం చెందిన సాయి దీప్తి తల్లిదండ్రులకు ఒక లేఖ రాసి ఆత్మహత్య చేసుకుంది. ఇదొక్కటే కాదు రెండు రాష్ట్రాలలో ప్రయివేట్ స్కూల్స్ లో ఫీజు కట్టలేదని పిల్లలను అవమానించడం నిత్యం సాధారణమైన విషయం.
Search Engine

బయలాజికల్ మదర్
ఫేస్బుక్ ఓసీడీ (FBOCD)
నిజం ఆవస్యకత
నిజాలన్నీ అబద్దాలే
కెరీర్
చీమ మెదడులో చేరిన వైరస్
వ్యక్తి
జీవితం
హ్యూమనిజం
నేనెవరు?
PTSD
డాలర్లు వస్తున్నాయి గాని ఎండ రావడం లేదు
రిజర్వేషన్స్
కెరీర్ మీద ఇంటరెస్ట్ ఎలా వస్తుంది?
టీనేజ్ కి వచ్చిన పిల్లలతో ఎలా ప్రవర్తించాలి?
మీ పిల్లలను అనుమానంతో దండిస్తున్నారా?
Autism Treatment
మీ పిల్లలకు స్మార్ట్ ఫోన్స్ ఇస్తున్నారా?
NRI పేరెంట్స్ పిల్లల విషయంలో శ్రద్ధ వహించాల్సిన అంశాలు
టీనేజ్ ఆడపిల్లలకు సోషల్ మీడియాలో ఎదురయ్యే ఇబ్బందులేంటి?
బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్ళే ముందు తరువాత ప్రవర్తన
పిల్లలను కనాలి అనుకున్నపుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
మీ పిల్లల ముందే మీరు పోట్లాడుకుంటున్నారా? జాగ్రత్త!!
పిల్లలకు ఆటలను దూరం చేస్తున్నారా?
మనుసులో భావాలే కలలుగా వస్తాయా?
కలలు నిజాలు అవుతాయా?
ఎంప్టీ నెస్ట్ సిండ్రోమ్
Love | మనం నిజంగా ప్రేమిస్తున్నామా..?
తల్లిదండ్రుల మానసిక సమస్యలు పిల్లలకు వారసత్వంగా వస్తాయా?
టీనేజ్ అమ్మాయిలతో పేరెంట్స్ ఎలా మెలగాలి?
రెండవ కూతురు
ఏకాగ్రత పెంచుకోవడం ఎలా?
మనిషి జీవితం జీవించడానికా? శోధించడానికా?
ఫ్రీ థింకింగ్
పోరాటమా? బ్రతుకా?
more..
లాభాలు