పుస్తక పఠనం
#చినిగిన_చొక్కా_అయినా_తొడుక్కో_మంచి_పుస్తకాన్ని_కొనుక్కో.. కొందరు డబ్బులున్నా చినిగిన చొక్కా తొడుక్కొని, ఒక కొత్త పుస్తకం కొని ఫోటో తీసి ఫేస్బుక్ లో పెట్టేస్తారు. వీరికి తానూ ఆధునిక భావాలతో ఉన్నాను అనే గుర్తింపు కావలి. మరి కొందరు పుస్తకాలను సేకరించడమే పరమావధిగా భావించి పుస్తకాలతో తమ సెల్ఫ్ లు నింపి సెల్ఫీలు తీసుకుంటారు. కొన్ని పుస్తకాలూ కొన్నవి అయితే మరికొన్ని ఇతరాలనుండి సేకరించినవి. కొందరు పుస్తకాలు కోసం దొంగతనం కూడా చేస్తారు. వారిని వారు జ్ఞాన సముపార్జన పిపాసులుగా భావిస్తారు. ఇలా రక రకాల వ్యక్తులు రక రకాలుగా సేకరించిన పుస్తకలల్తో సెల్ఫీలు దిగి పోస్ట్ చేసేసి వాటి మధ్యన పడుకొని మొబైల్ లో చాట్ చేసి చేసి చివరకు నిద్ర పోతారు.
#చదువు_వచ్చి_కూడా_చదవని_వాడు_చదువురాని_వాడికంటే_హీనమయినవాడు... కొందరు పుస్తకాలను చదివేస్తూ ఉంటారు. ఎన్ని పుస్తకాలను చదివితే అంత జ్ఞానంగా భావిస్తారు. పగలు రాత్రి తేడాలేకుండా వేరే పని చెయ్యకుండా చదివేస్తారు. వీరిలో కొందరు చదివిన పుస్తకాలేవో చదవనివేవో ఒక లిస్ట్ రాసుకొని ఒక్కొక్కటి టిక్ పెట్టుకుంటూ పోతారు. కొందరు పుస్తకాలలో విషయాలను గుర్తుపెట్టుకుంటారు మరి కొందరు అవి కూడా గుర్తు పెట్టుకోరు.
పుస్తకాలు చదవటం వల్ల వ్యక్తికి తెలిసేది కేవలం సమాచారం మాత్రమే. అది నిజమో కాదో కూడా తెలియదు. అలా ఎన్ని పుస్తకాలు చదివినా తెలిసేది ఇన్ఫర్మేషన్ తప్ప జ్ఞానం కాదు. ఇన్ఫర్మేషన్ కి జ్ఞానికి తేడావుంది. సామాన్యులు ఇన్ఫర్మేషన్ కలిగి ఉండటమే జ్ఞానంగా భావిస్తుంటారు. ఇన్ఫర్మేషన్ ని సరయిన సమయంలో రికలక్ట్ చేసుకొని సరయిన రీతీలో ఇంటర్ప్రెట్ చేయటం వల్ల జ్ఞానంగా మారుతుంది. అలా కాకుండా కేవలం చదివి ఇన్ఫర్మేషన్ ని గుర్తుంచుకోవటం వల్ల ఉపయోగం లేదు. అది #డెడ్_నాలెడ్జి తో సమానం. ఒక పుస్తకాన్ని చదివినపుడు ప్రశ్నించకుండా ఉన్నది ఉన్నట్లుగా అంగీకరించడం వృధా. ఆ రచయిత ఏ సందర్భంలో అది రాసాడు. అతని సామజిక, మానసిక పరిస్థితులను విశ్లేషించి అతను చెప్పాలనుకున్నది ఏంటో అర్థం చేసుకోవాలి. అసలు ఆ రచయిత ఆ పుస్తకం రాయటం వెనుక ఉద్దేశ్యం ఏముందో గమనించాలి. అది వ్యాపార దృక్పధంతో రాసిందా? భావజాల వ్యాప్తి కోసం రాసిందా? లేక తన గుర్తిపు కోసం రాసిందా వంటి విషయాలను అర్థం చేసుకుంటే పుస్తకం వెనుక ఉన్న కాంటెక్స్ట్ అర్థం అవుతుంది.
- హరి రాఘవ్
Keywords : books, reading, study
(22.12.2017 02:10:30pm)
No. of visitors : 1117
Suggested Posts
Sorry, there are no suggested posts
| డాలర్లు వస్తున్నాయి గాని ఎండ రావడం లేదు |
| కెరీర్ మీద ఇంటరెస్ట్ ఎలా వస్తుంది? |
| టీనేజ్ కి వచ్చిన పిల్లలతో ఎలా ప్రవర్తించాలి? |
| మీ పిల్లలను అనుమానంతో దండిస్తున్నారా? |
| మీ పిల్లలకు స్మార్ట్ ఫోన్స్ ఇస్తున్నారా? |
| NRI పేరెంట్స్ పిల్లల విషయంలో శ్రద్ధ వహించాల్సిన అంశాలు |
| టీనేజ్ ఆడపిల్లలకు సోషల్ మీడియాలో ఎదురయ్యే ఇబ్బందులేంటి? |
| బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్ళే ముందు తరువాత ప్రవర్తన |
| పిల్లలను కనాలి అనుకున్నపుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? |
| మీ పిల్లల ముందే మీరు పోట్లాడుకుంటున్నారా? జాగ్రత్త!! |
| పిల్లలకు ఆటలను దూరం చేస్తున్నారా? |
| మనుసులో భావాలే కలలుగా వస్తాయా? |
| Love | మనం నిజంగా ప్రేమిస్తున్నామా..? |
| తల్లిదండ్రుల మానసిక సమస్యలు పిల్లలకు వారసత్వంగా వస్తాయా? |
| టీనేజ్ అమ్మాయిలతో పేరెంట్స్ ఎలా మెలగాలి? |
| మనిషి జీవితం జీవించడానికా? శోధించడానికా? |
more..