పరిమిత హేతువాదం

పరిమిత

కార్ల్ మార్క్స్, మావో, వివేకానంద, రమణానంద, గాంధీ, బుద్ధుడు లేదా మరెవరో చెప్పాడనో మనిషి ఆ సిద్ధాంతాలను పట్టుకొని వేలాడటం వృధా. ఈ స్థితి మానసికమైన జడత్వానికి దారితీస్తుంది. వారు ఆ సిద్ధాంతాలను పట్టుకొని వారిలో ఉండాల్సిన కనీస మానవీయ కోణాన్ని కోల్పోతారు. మనిషి ఎవరు కూడా అనంతమయిన జ్ఞానంను తన జీవిత కాలంలో పొందలేదు. అలా పొందాలంటే అతీంద్ర శక్తులు కావలి. కానీ అది సాధ్యపడదు. పై వారు ఎవరు చెప్పిన వారి కాలానికి అందుబాటులో ఉన్న జ్ఞానంతో వారి సొంత లాజిక్ జోడించి విశ్లేషించి చెప్పాల్సిందే తప్ప దైవం చెప్పినట్లు చెప్పటం సాధ్య పడదు. కాబట్టి ఆయా సిద్ధాంతాలను అంగీకరించినా సరే వాటిని ధాటి మనిషి ఆలోచన ముందుకు సాగాలి.

హేతువాద ఆలోచన ఉన్న చాలామంది సిద్ధాంతాల ఊబిలో కూరుకు పోవటం ఆశ్చర్యం కల్పిస్తుంది. కొన్ని సార్లు వారి ప్రవర్తన తీరు చూసినపుడు వీరు నిజంగా హేతువాదేనా అనిపించే అవకాశాలు ఉంటాయి. హేతువాదం కొన్ని విషయాలకు మాత్రమే పరిమితం చెయ్యటం ద్వారా మనిషి స్వల్పకాలిక లాభం గాని, తృప్తి గాని కలగవచ్చు. దీర్ఘ కాలంలో ఈ లిమిటెడ్ హేతువాదం వారిని అమానవీయంగా మార్చుతుంది. ప్రతీ విషయంలోనూ ʹవీలయినంతʹ హేతుబద్దంగా మనిషి ఆలోచించాలి. చివరికి హేతుబద్దత యొక్క అవసరం గురించి కూడా హేతు బద్దంగా ఆలోచించాలి. నాకు నచ్చింది కాబట్టి హేతువాదం కాదు. హేతువాదం నా అవసరం అని గుర్తించాలి.

- హరి రాఘవ్

Keywords : philosophy, rationalism, atheism, communism
(06.03.2017 11:17:36am)

No. of visitors : 821

Suggested Posts


Sorry, there are no suggested posts
Search Engine

బయలాజికల్ మదర్
ఫేస్బుక్ ఓసీడీ (FBOCD)
నిజం ఆవస్యకత
నిజాలన్నీ అబద్దాలే
కెరీర్
చీమ మెదడులో చేరిన వైరస్
వ్యక్తి
జీవితం
హ్యూమనిజం
నేనెవరు?
PTSD
డాలర్లు వస్తున్నాయి గాని ఎండ రావడం లేదు
రిజర్వేషన్స్
కెరీర్ మీద ఇంటరెస్ట్ ఎలా వస్తుంది?
టీనేజ్ కి వచ్చిన పిల్లలతో ఎలా ప్రవర్తించాలి?
మీ పిల్లలను అనుమానంతో దండిస్తున్నారా?
Autism Treatment
మీ పిల్లలకు స్మార్ట్ ఫోన్స్ ఇస్తున్నారా?
NRI పేరెంట్స్ పిల్లల విషయంలో శ్రద్ధ వహించాల్సిన అంశాలు
టీనేజ్ ఆడపిల్లలకు సోషల్ మీడియాలో ఎదురయ్యే ఇబ్బందులేంటి?
బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్ళే ముందు తరువాత ప్రవర్తన
పిల్లలను కనాలి అనుకున్నపుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
మీ పిల్లల ముందే మీరు పోట్లాడుకుంటున్నారా? జాగ్రత్త!!
పిల్లలకు ఆటలను దూరం చేస్తున్నారా?
మనుసులో భావాలే కలలుగా వస్తాయా?
కలలు నిజాలు అవుతాయా?
ఎంప్టీ నెస్ట్ సిండ్రోమ్
Love | మనం నిజంగా ప్రేమిస్తున్నామా..?
తల్లిదండ్రుల మానసిక సమస్యలు పిల్లలకు వారసత్వంగా వస్తాయా?
టీనేజ్ అమ్మాయిలతో పేరెంట్స్ ఎలా మెలగాలి?
రెండవ కూతురు
ఏకాగ్రత పెంచుకోవడం ఎలా?
మనిషి జీవితం జీవించడానికా? శోధించడానికా?
ఫ్రీ థింకింగ్
పోరాటమా? బ్రతుకా?
more..
పరిమిత