మడావి తుకారాం
పాత ʹఆదిలాబాద్ జిల్లాʹ ప్రస్తుత ʹకొమరం భీం ఆశీఫాబాద్ జిల్లాʹ లోని ఉట్నూర్ ప్రాంతంలో ఆదివాసులు ప్రముఖంగా నివసిస్తున్నారు. దట్టమయిన అడవిలో అభివృద్ధికి ఆమడ దూరంలో ఉన్న స్వచ్ఛమైన మనస్సులతో ప్రకృతి ఒడిలో బ్రతుకున్నారు. ఆదివాసులలో మొదటి సారిగా ఐఏఎస్ సాధించి కలెక్టర్ అయినా వ్యక్తి ʹమడావి తుకారాంʹ. బాపూరావ్ మహారాజ్, మాన్కుబాయిలకు మడావి తుకారాం మే 4 1951 లో జన్మించారు. పూర్తిగా గ్రామాలలో తన ప్రాధమిక విద్యనభ్యసించిన తుకారాం బిఎ ఆదిలాబాద్ లోను, ఎంఏ హైదరాబాద్ ఉస్మానియాలోను అభ్యసించారు. తరువాత తాను ఐఏఎస్ సాధించి రకరకాల భాద్యతలను తుకారాం నిర్వహించారు.
అయితే కొంత కాలానికి తుకారాం కిడ్నీ సమస్యతో బాధ పడుతూ హైదరాబాద్ నిమ్స్ లో జేరటం జరిగింది. నిమ్స్ లో తుకారాంకు చికిత్స జరుగుతున్నా క్రమంలో ఆయనను చూడటానికి వచ్చిన కొందరు గ్రామస్తులు ʹచేతబడిʹ జరిగినట్లు చెప్పారు. ఇలా హాస్పిటల్ లో ఉండటం కాదు దానికి విరుగుడు చేయించక పోతే ప్రాణానికే ప్రమాదం అని చెప్పారు. ఆ విషయం నమ్మిన తుకారాం హాస్పిటల్ విడిచి తన గ్రామం వెళ్లి చేతబడికి విరుగుడు పూజలు చూపిస్తూ ఉండి పోయాడు. అలా ఉండటంతో అతని కిడ్నీల సమస్య రోజు రోజుకూ పెరిగి అతని ఆరోగ్యం క్షీణించసాగింది. అయినా తానూ ఆ మూఢ నమ్మకంతో వైద్యం చేయించుకోడానికి నిరాకరించాడు. చివరికి కొందరు ప్రభుత్వ అధికారుల ఒత్తిడితో తుకారాం మళ్ళీ నిమ్స్ లో జాయిన్ చేసినా లాభం లేకపోయింది. కొద్ది రోజులకే ఆయన మరణించారు.
మనం చదివే చదువు కేవలం ఉద్యోగాలు చెయ్యటానికి ఉపయోగపడుతుంది తప్ప హేతుబద్దమయిన ఆలోచన పెంచడానికి ఉపయోగపడటం లేదు. మన చదువు అంతా ఎవరో చెప్పిన దానిని గుడ్డిగా అంగీకరించి నేర్చుకోవడం లేదా గుడ్డిగా ఖండించడంతో సరిపోతుంది. అందుకే మన దేశంలో ఆస్తికులయినా నాస్తికులయినా వ్యక్తులను గుడ్డిగా అనుసరించడం చూస్తుంటాము. ఇక ఇస్రో శాస్త్రవేత్తలు కూడా తమ ప్రయోగం సఫలం కావాలని తిరుపతి వెళ్లి రావటం చూస్తూనే ఉంటాము. హేతుబద్దమయిన ఆలోచన లేకపోతే నమ్మకం అతి నమ్మకంగా తరువాత మూఢ నమ్మకంగా రూపాంతరం చెందుతుంది. దీనిని నివారించడానికి హేతువాదం ప్రజలలోకి తీసుకు వెళ్లాల్సిన అవసరం ఎంతయినా ఉంది.
- హరి రాఘవ్
Keywords : madavi, tukaram, ias, adivasi
(21.02.2017 02:24:24pm)
No. of visitors : 626
Suggested Posts
3 results found !
| ఆదివాసి.. లంబాడా వివాదం -ఎం.రత్నమాలఆదిలాబాద్ (పాత) జిల్లాలో ఆదివాసీలు, లంబాడాల మధ్య గత రెండు నెలలుగా సాగుతున్న ఘర్షణ తెలంగాణలోని ఖమ్మం మొదలైన ఏజెన్సీ ప్రాంతాలకే కాదు, ఆదిలాబాద్ జిల్లా (పాత) పొరుగున రెండు రాష్ట్రాల సరిహద్దు మహారాష్ట్రలోని ఏజెన్సీ ప్రాంతాలకు ఇప్పుడిప్పుడే విస్తరిస్తున్నది. 2017 అక్టోబర్ 6న జోడెన్‌ఘాట్‌లోని ఆదివాసి మ్యూజియంలో ఉన్న లంబాడా స్త్రీ విగ్రహాన్ని ఆదివాసీలు తగులబ |
| గొత్తికోయలను మానవ దృక్పధంలో ఆదుకోవాలిప్రకృతిలో సరిహద్దు నాగరిక మానవులు గీసుకున్న ఊహాజనిత రేఖలే తప్ప అవి నిజమయినవి కావు. రాష్ట్ర సరిహద్దులు, దేశ సరిహద్దులు కేవలం నాగరిక మానవులకు మాత్రమే ఉంటాయి. పక్షులు, జంతువులు, సెలయేర్లు, నదులకు ఎటువంటి సరిహద్దులు ఉండవు. అలాగే ప్రకృతితో సహజీవనం చేస్తున్న ఆదివాసులకు సరిహద్దుల పేరిట విడదీయటం సరికాదు. సెప్టెంబర్ నెలలో భూపాలపల్లి జిల్లాలో గొత్తికోయల మీద పోలీస |
| అమాయక గిరిజనులపై నగరపు వికృతదాడివారంతా అమాయకపు గిరిపుత్రులు. వారంతా ప్రకృతి ఒడిలో స్వచ్ఛమైన నవ్వులు చిందిస్తూ బ్రతికే మానవులు. వారంతా చెట్లు చేమలతో, అడవి జంతువులతో ప్రేమతో కలసి జీవనం సాగిస |
| డాలర్లు వస్తున్నాయి గాని ఎండ రావడం లేదు |
| కెరీర్ మీద ఇంటరెస్ట్ ఎలా వస్తుంది? |
| టీనేజ్ కి వచ్చిన పిల్లలతో ఎలా ప్రవర్తించాలి? |
| మీ పిల్లలను అనుమానంతో దండిస్తున్నారా? |
| మీ పిల్లలకు స్మార్ట్ ఫోన్స్ ఇస్తున్నారా? |
| NRI పేరెంట్స్ పిల్లల విషయంలో శ్రద్ధ వహించాల్సిన అంశాలు |
| టీనేజ్ ఆడపిల్లలకు సోషల్ మీడియాలో ఎదురయ్యే ఇబ్బందులేంటి? |
| బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్ళే ముందు తరువాత ప్రవర్తన |
| పిల్లలను కనాలి అనుకున్నపుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? |
| మీ పిల్లల ముందే మీరు పోట్లాడుకుంటున్నారా? జాగ్రత్త!! |
| పిల్లలకు ఆటలను దూరం చేస్తున్నారా? |
| మనుసులో భావాలే కలలుగా వస్తాయా? |
| Love | మనం నిజంగా ప్రేమిస్తున్నామా..? |
| తల్లిదండ్రుల మానసిక సమస్యలు పిల్లలకు వారసత్వంగా వస్తాయా? |
| టీనేజ్ అమ్మాయిలతో పేరెంట్స్ ఎలా మెలగాలి? |
| మనిషి జీవితం జీవించడానికా? శోధించడానికా? |
more..