భారత్ లో కుల వ్యవస్థ
ప్రపంచ వ్యాప్తంగా ఏదో రకమయిన వివక్షత కొనసాగుతుంది. జాతి, తెగ, వర్గం, శరీర రంగు, లింగ పరమయిన వివక్షతలు చూస్తాము. కానీ భారత్ లో మాత్రం వాటికి తోడుగా కుల పరమయిన వివక్ష కూడా కొనసాగుతుంది. చాలామంది పట్టణ ప్రాంతానికి చెందిన వారు ఇంకా ఎక్కడ ఉంది కులం అని ఆశ్చర్యాన్ని వెలిబుచ్చినా నగరాలలో ఇల్లు అద్దెకు ఇవ్వటం దగ్గరనుండి, పెళ్లిళ్లు, చివరికి రక్తం తీసుకోవటంలో కూడా కులం వివక్ష ఉంది. దానిని గుర్తించే సున్నితత్వం కోల్పోవటం వలన మాత్రమే అది లేదు అని భావిస్తున్నాం.
అన్నిటిలోను భగవంతఁడు ఉన్నాడు అని భావించే ఆస్తికులకు ఒక వృత్తి ఎక్కువగాను మరో వృత్తి తక్కువ గాను అనిపించడం వెనుక వారి హిపోక్రసి కనిపిస్తుంది. దానికి కులాలను సమర్థించే వారు రక రకాల సూడో సైన్స్ బోధిస్తారు. ఈ కులాలు పుట్టింది హిందూ మతంలో నయినా భారత్ లో వేరే మతంలోకి మారిన వాళ్ళు కూడా కులాలను వదల లేక పోతున్నారు అనేది జగమెరిగిన సత్యం. చివరికి ఇతర దేశాలలో కూడా కుల సంఘాలు పెట్టుకుంటున్నారు.
అభ్యుదయ వాదులం అనుకునే కమ్యూనిస్ట్ లు, నాస్తికులు, హేతువాదులు కూడా కులాన్ని వదల లేక పోవటం మరింత ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. కొందరు వారి కులాలను వదిలేసినా ఆ కులపు పెట్టుబడి దారుల, ప్రసార మాధ్యమాల అండతో ఎదిగి అణచి వేయబడ్డ కులాల పట్ల తమ వికృత స్వభావాన్ని ప్రతీ రోజు చూపిస్తూనే ఉన్నారు. మరో వైపు రిజర్వేషన్స్ వల్లనే కులాలు పోవటం లేదు అని మరి కొందరు వాదిస్తారు. కానీ ఈ దేశంలో రిజర్వేషన్స్ గత 70 సంవత్సరాల నుండి మాత్రమే ఉన్నాయి. కానీ కులాలు వందల సంవత్సరాల నుండి కొనసాగుతున్నాయి.
కులాల పుట్టుకకు కారణం ఏమయినా అవి సమాజం లో మానవ విలువలకు హాని కలిగిస్తున్నాయి అన్నది నిజం. అయితే ఈ కులాలు అంతరించడానికి ఉన్న మార్గాలను మనం హేతుబద్దంగా విశ్లేషించాలి.
- హరి రాఘవ్

Keywords : caste, discrimination, india
(22.10.2017 08:00:41am)
No. of visitors : 1612
Suggested Posts
5 results found !
| క్యాస్ట్ ఫీలింగ్ vs క్యాస్ట్ ఆటిట్యూడ్ఇటీవల ఒక హేతువాది, మానవవాది మిత్రుడు మా ఆఫీస్ కి వచ్చి కౌన్సిలింగ్ విధానాల గురించి చర్చించాడు. నేను చెప్పే విషయాలను చాల ఉత్సుకతతో విన్నాడు. కౌన్సిలింగ్ సమయంలో అడిగే ప్రశ్నల విషయంలో అతను ఒకదానిని తీవ్రంగా అభ్యంతరం చెప్పాడు. నేను కౌన్సిలింగ్ కి వచ్చిన ప్రతీ క్లయింట్ ని తన కులం ఏంటో అడిగి తెలుసుకుంటాను. ఈ విషయం అతనిని తీవ్ర ఆగ్రహానికి గురిచేసింది. వాళ్ళు ఏ |
| పెట్టుబడిదారి వ్యవస్థ కులవ్యవస్థకు అందమైన ముసుగుఒక వ్యక్తికి వారసత్వంగా పెట్టుబడి అనేక రూపాలలో వస్తుంది. ఒకరికి తల్లిదండ్రుల ఆస్తులు వస్తే, మరొకరికి పరపతి రూపంలో, ఇంకొకరికి కులం రూపంలో వస్తుంది. దానిని ఆ వ్యక్తి ఎలా ఉపయోగించుకుంటాడనేది ఆ వ్యక్తి, ఆ సమాజం మీద ఆధారపడి ఉంటుంది.
అగ్ర కులంలో పుట్టిన వ్యక్తికి కులం ఒక పెట్టుబడి. ఉదాహరణకు బ్రాహ్మణ కులంలో పుట్టినవ్యక్తి ఆర్థికంగా పేదరికంలో ఉన్నా తన బంధువర్గ |
| కుల ఆధారిత రేజర్వేషన్స్రిజర్వేషన్స్ వల్ల కుల క్యాస్ట్ ఐడెంటిటీ పెరుగుతుంది తప్ప తగ్గదు అని కొందరు అగ్ర కులాలకు చెందిన వారి వాదన. ఏ కులాలకయితే అన్యాయం జరిగిందో వారిని కులంతోనే గుర్తించాలి తప్ప మరో విధంగా కుదరదు. రిజర్వేషన్స్ వల్లే కుల తత్వం పెరుగుతుంది అనే వాదన హేతుబద్దమయినది కాదు. జనవరి 26 1950 కి ముందు, బ్రిటిష్ వారి పరిపాలనలో, అంతకు ముందు కూడా రిజర్వేషన్స్ లేవు. అప్పుడు ఈ కు |
| వృత్తిని బట్టి కులము vs కులాన్ని బట్టి వృత్తిభారత దేశంలో ఉన్న అత్యంత దుర్మార్గమైనది కుల వ్యవస్థ. ప్రపంచంలో ఇంత కంటే హీనమైన ప్రాక్టీస్ మరొకటి ఉండదు. ఇది మతం కన్నా వంద రేట్లు విషపూరితమైనది. ఆర్థిక అసమానతలు కన్నా సామజిక అసమానతలు దారుణమైనవి. ఒక పేదవాడు కష్టపడి డబ్బు సంపాదించి ధనవంతుడు కాగలడు. ఒక మతం వాడు మరొక మతం స్వీకరించవచ్చు. ఒక డాక్టర్ కొడుకు ఇంజినీర్ అవ్వొచ్చు. ఒక కూలీవాడి కొడుకు సాఫ్ట్వేర్ ఉద్యోక |
| భారత్ లో పరిశోధనల పై కుల ప్రభావంనేటి చదువుకున్న యువతకు సైన్స్ అనగానే నాసా లేదా ఇస్రో గుర్తొస్తుంటాయి. ఏది చెప్పినా నాసా చెప్పాలి. లేదా ఇస్రో చెయ్యాలి. చివరికి పురాణాలలో చెప్పబడిన వాటిని కూడా నాసా పరిశోధించి చెప్పింది అని ప్రచారం చెయ్యటం వాటిని ప్రజలు నమ్మటం జరుగుతుంది. ఇవి కేవలం స్పేస్ కి సంబంధించిన పరిశోధనలు చేసే సంస్థలు. గేమ్స్ లో క్రికెట్ కి విపరీతమైన గ్లామర్ రుద్దినట్లు సైన్స్ లో క |
| డాలర్లు వస్తున్నాయి గాని ఎండ రావడం లేదు |
| కెరీర్ మీద ఇంటరెస్ట్ ఎలా వస్తుంది? |
| టీనేజ్ కి వచ్చిన పిల్లలతో ఎలా ప్రవర్తించాలి? |
| మీ పిల్లలను అనుమానంతో దండిస్తున్నారా? |
| మీ పిల్లలకు స్మార్ట్ ఫోన్స్ ఇస్తున్నారా? |
| NRI పేరెంట్స్ పిల్లల విషయంలో శ్రద్ధ వహించాల్సిన అంశాలు |
| టీనేజ్ ఆడపిల్లలకు సోషల్ మీడియాలో ఎదురయ్యే ఇబ్బందులేంటి? |
| బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్ళే ముందు తరువాత ప్రవర్తన |
| పిల్లలను కనాలి అనుకున్నపుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? |
| మీ పిల్లల ముందే మీరు పోట్లాడుకుంటున్నారా? జాగ్రత్త!! |
| పిల్లలకు ఆటలను దూరం చేస్తున్నారా? |
| మనుసులో భావాలే కలలుగా వస్తాయా? |
| Love | మనం నిజంగా ప్రేమిస్తున్నామా..? |
| తల్లిదండ్రుల మానసిక సమస్యలు పిల్లలకు వారసత్వంగా వస్తాయా? |
| టీనేజ్ అమ్మాయిలతో పేరెంట్స్ ఎలా మెలగాలి? |
| మనిషి జీవితం జీవించడానికా? శోధించడానికా? |
more..