వ్యత్యాసం – వ్యక్తిత్వం
హైదరాబాద్ లోని జూపార్క్ కు నిత్యం వేలాదిమంది సందర్శకులు వస్తుంటారు. అందులో హైదరాబాద్ మరియూ చుట్టు ప్రక్కల గ్రామాల స్కూల్ విద్యార్థులను స్కూల్ యాజమాన్యం తీసుకు వస్తుంటారు. అక్కడి రకరకాల జంతువులను చూసి మధ్యాహ్నం భోజన సమయానికి కాస్త తిని పిల్లలు కొంచెం సేపు విశ్రాంతి తీసుకుని తదుపరి ఆ గడ్డి మైదానంలో ఆడుకుంటారు. వారిని చూస్తే చిన్న చిన్న కుందేలు పిల్లలను చూసినట్లు ఉంటుంది. రక రకాల ఆటలు ఆడుకుంటారు, కింద పడతారు, లేగుస్తారు, పరిగెడతారు, ఇలా ఒకటేమిటి ఎన్నో రకాలుగా ఆడుకుంటారు.
అయితే వారిని ఇంకా ఎక్కువగా గమనిస్తే మనలను ఒక విషయం ఆకట్టుకుంటుంది. అది ఎక్కువగా మగ పిల్లలు వేరుగా ఆడ పిల్లలు వేరుగా ఆడుకుంటారు. ఎక్కువ మగపిల్లలు శరీర శక్తితో ఆడే ఆటలను ఆడ పిల్లలు తెలివితో ఆడే ఆటలను ఆడతారు. ఆడపిల్లలు ఎక్కువగా మాట్లాడతారు. మగ పిల్లలు తక్కువ మాట్లాడతారు కాని గట్టిగా మాట్లాడతారు. మధ్యలో తగువులాడినపుడు మగపిల్లలు వెంటనే తమ శారీరక బలం చూపడానికి ప్రయత్నిస్తారు. ఆడ పిల్లలు మౌఖికంగా దాడి చెయ్యటం జరుగుతుంది. ఇది సహజం.
సృష్టిలో ఆడ మగ సమానం అయినప్పటికీ శరీర అవయవాల నిర్మాణంలో వ్యత్యాసం ఉన్నట్లే మానసిక స్థితులలో కూడా తేడాలు ఉన్నాయి. ఇవి వ్యత్యాసాలు మాత్రమే. ఎక్కువ తక్కువలు కాదు. ఆలోచన తీరు, భద్రత, ప్రతిచర్యలలో వ్యత్యాసాలు ఉంటాయి. అంతే కాకుండా సమాజంలో ఉన్న ద్వంద్వ విధానాల వలన మరికొంత వ్యత్యాసం ఉంటుంది.
అదే వయసు గల మగ పిల్లలతో పోల్చితే టీనేజ్ లో ఆడ పిల్లలు సాధారణంగా ఎక్కువ ఆలోచన శక్తి కలిగి ఉంటారు. హేతుబద్ధత, ఉపాయలు, స్పష్టత కలిగి ఉంటారు. ఎక్కువ మాట్లాడతారు. మగ పిల్లలు శారీరకంగా బలంగా ఉండి అదే వయస్సుగల ఆడపిల్లలతో పోల్చినపుడు కొంచెం తక్కువ ఆలోచన శక్తి ఉంటుంది. ఎక్కువ తిరగబడే తత్వం మగ పిల్లలలో సాధారణంగా ఎక్కువ ఉంటుంది. ఆడ పిల్లలు మౌఖికంగా, మగ పిల్లలు శారీరకంగా ఎక్కువ దాడి చేస్తారు.
భావోద్వేగాల విషయానికి వస్తే ఆడపిల్లలు సున్నితత్వం కలిగి ఉంటారు. మగ పిల్లలు ఆ సున్నితత్వాన్ని క్రమంగా కోల్పోవటం జరుగుతుంది. వ్యతిరేక పరిస్థితులు ఎదురయైనపుడు, మగ పిల్లలు కోపోద్రేకాలకు గురి అవుతారు. ఆడ పిల్లలు భాద పడతారు. భయం గోల్పెటటువంటి పరిస్థితులను మగపిల్లాలు, భాద కలిగించేటటువంటి ఆడ పిల్లలు బాగా ఎదుర్కోగలరు.
టీనేజ్ తదుపరి తాము తమ జీవిత భాగస్వామితో మెలిగే విషయంలో మగ పిల్లలకు కొంత సులభం అవుతుంది. ఆడ పిల్లలకు కొంత కష్టం అవుతుంది. దీనికి కారణం లేక పోలేదు. సాధారణంగా పిల్లలు తల్లి కేంద్రంగా పెరుగుతారు. ఆర్ధికంగా, భద్రత పరంగా తండ్రి అండ నిచ్చినా, పిల్లలు మానసికంగా తల్లితోనే ఎక్కువ బంధం కలిగి ఉండటం సహజం. ఈ పరిస్థితి నుండి వారు తమ భాగస్వామి వైపు పయనించినపుడు, అప్పటి వరకు మగ పిల్లలు ఒక స్త్రీ నుండి వేరుపడి మరొక స్త్రీని చేరుకుంటారు. ఇక్కడ తను దూర మయినది ఒక స్త్రీనే మరియూ దగ్గరయినది కూడా స్త్రీ కావటం వలన పెద్దగా ఇబ్బంది లేదు.
ఇందుకు విరుద్ధంగా స్త్రీ తల్లి నుండి విడిపోయి భర్త వద్దకు చేరుతుంది. అనగా ఒక స్త్రీ నుండి విడువడి ఒక పురుషుని చేరటం వలన కొంత ఇబ్బందికరమయిన పరిస్థితులు ఎదురు అవుతాయి. అప్పటి వరకు తను జీవితం గడిపిన స్త్రీ తన ఇబ్బందులను చక్కగా అర్థం చేసుకోగలుగుతుంది. కాని మారిన పరిస్థితిలో పురుషుడు ఈమె ఇబ్బందులలు తల్లి అర్థం చేసుకున్నత బాగా అర్థం చేసుకోక పోవటం వలన ఇబ్బంది పడుతుంది.
అందువలన టీనేజ్ ఆడపిల్లల విషయంలో తండ్రి పాత్ర చాల ముఖ్యమైనది. తండ్రి కూతురితో ఎక్కువ సమయం గడపటం, తండ్రి కూతుర్లు బయటకు వెళ్ళటం, ఇతరులతో మాట్లాడటం, విషయాలను చక్క బెట్టడం వలన ఆడపిల్ల టీనేజ్ లో మగ వారిని సరిగా అర్థం చేసుకొని సులభంగా జీవనాన్ని సాగించగలరు.
ఆడపిల్లల విషయాలలో తీసుకోవలసిన జాగ్రతలు
తన యొక్క గుర్తింపు విషయంలో తండ్రి తనకు సహాయం చెయ్యవలసి ఉంటుంది. ఏదయినా విషయంలో తల్లీకూతుర్ల మధ్య వాగ్వివాదం వచ్చినపుడు సాధరణంగా తండ్రి కూతురికి సహాయపడి కూతురిని హేతుబద్ధంగా ఆలోచించే విధంగా చెయ్యాలి. దీని అర్థం కూతురికి గ్రుడ్డిగా సమర్ధించమని కాదు అని గ్రహించాలి.
తల్లి కూతురిని తండ్రితో స్నేహంగా ఉండే విధంగా సహకరించాలి. వారిదరిని తగిన సమయం గడిపే విధంగా చర్యలు తీసుకోవాలి. సాధారణంగా తండ్రి సంపాదనలో పడి కుటుంబానికి సమయాన్ని కాకుండా డబ్బుని సమకూర్చాలని ప్రయతిస్తుంటారు. తల్లి ఆ స్థితి నుండి కుటుంబాన్ని భయటకు తీసుకురావాలి. ఇక్కడ తల్లి పాత్ర చాల ముఖ్యమయినది.
తల్లిదండ్రులు ఆడపిల్లలను ఒక పరిపూర్ణ స్త్రీగా ఎదగటానికి సహకరించాలి. మగ పిల్లలతో పోల్చితే ఆడ పిల్లలు తొందరగా ఎదుగుతారు కావున వారికి కావలసిన వాటిని సమకూచటం, తగిన భద్రతను కల్పించటం ఎంతయినా అవసరం. కాని నేటి సమాజంలో భద్రత బదులు ఆడపిల్లల పైన నిబంధనలు విధిస్తున్నారు.
సమాజంలోని అన్ని కోణాలు అర్థం అయ్యేలాగా ఆడ పిల్లలకు తల్లిదండ్రులు వివరించాలి. ముఖ్యంగా సాంకేతిక పరిజ్ఞానం వెర్రితలలు వేస్తున్న ఈ కాలంలో వాటి భారిన పడకుండా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో వివరించాలి. అవసరమయితే నిపుణుల సలహాలు, శిక్షణ తీసుకోవాలి.టీనేజ్ లోని మగ పిల్లల విషయంలో తీసుకోవలసిన జాగ్రత్తలు
క్రమ శిక్షణ కలిగి ఉండటంలో సహకరించాలి. ఎలా ఉండాలో చెప్పినంత మాత్రాన సరిపోదు. వారికి అలా ఉండటం వలలన వచ్చే ఇబ్బందులను అర్థం చేసుకుని తల్లిదండ్రులు వాటిని తొలగించాలి.
వారిలో కలిగే భావోద్వేగాలు మాటలలో వ్యక్త పరచటానికి సహకరించాలి.
కోపోద్రేకాలను జయించటానికి శారీరక శ్రమ కలిగించే క్రీడలు, స్విమ్మింగ్ వంటి వాటిని ప్రోత్సహించాలి.
సరిగా అర్థం చేసుకోలేని, హేతుబద్ధత లేని సాహసం కొన్ని సార్లు వ్యతిరేక ఫలితాలను ఇస్తుంది అని తెలియచేయాలి. (ఉదాహరణకు నేను టీనేజ్ లో ఉన్నపుడు స్కూల్ పై కప్పు ఎక్కి అక్కడనుండి దూకటం వలన కాళ్ళకు తీవ్రంగా గాయం అయ్యి రెండు నెలలు ఇంటిలోనే విశ్రాంతి తీసుకోవలసి వచ్చింది.) కొన్నిసార్లు మనం జీవితం అంతా భాద పడవలసి ఉంటుంది అని తెలియచెయ్యాలి.స్త్రీ పురుషుల శరీరాలలో తేడాలు ఉండవచ్చు, మనసిక పరిస్థుతులలో తేడాలు ఉండవచ్చు కాని స్త్రీ పురుషులిద్దరూ సమానం. ఇక్కడ స్త్రీనా, పురుషుడా అన్నదాని కంటే కూడా వ్యక్తిత్వం ముఖ్యం అని గ్రహించాలి.
చాలా మంది ఆడపిల్లు ఇలాగే ఉంటారు. మగ పిల్లలు కదా అలాగే చేస్తారు అని సరిపెట్టుకుంటారు. కాని వారు ఎలా ఉండాలి అనేది తల్లిదండ్రులు తీర్చిదిద్దాలి. ద్వంద్వ ప్రమాణాల వలన వారి భవిష్యత్తుని మనమే నాశనం చేసినవారం అవుతామని మరువకూడదు.
- హరి రాఘవ్
Keywords : girls, boys, personality
(20.10.2017 05:14:23am)
No. of visitors : 1307
Suggested Posts
4 results found !
| NRI పేరెంట్స్ పిల్లల విషయంలో శ్రద్ధ వహించాల్సిన అంశాలుNRI పేరెంట్స్ పిల్లల విషయంలో శ్రద్ధ వహించాల్సిన అంశాలు |
| టీనేజ్ ఆడపిల్లలకు సోషల్ మీడియాలో ఎదురయ్యే ఇబ్బందులేంటి?టీనేజ్ ఆడపిల్లలకు సోషల్ మీడియాలో ఎదురయ్యే ఇబ్బందులేంటి? |
| విద్యార్థుల ఆత్మహత్యలకు కారణాలేంటి?ఇటీవల ఒకే రోజు కార్పొరేట్ కాలేజీలకు చెందిన నలుగురు విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడి మరణించడం రెండు రాష్ట్రాల తల్లిదండ్రులను ఒకేసారి ఉలిక్కిపడేట్టు చేసింది. విద్యార్థుల మీద చదువుల పేరుతో పేరెంట్స్, కాలేజీలు, సమాజం పెట్టే ఒత్తిడి వారి జీవితాలను ఎలా ముగింపు జేస్తుంతో తెలియజేస్తూ ʹవనిత టీవీʹ సహకారంతో సికింద్రాబద్ లోని ʹకూస్తూరిబా గాంధీ డిగ్రీ & పీజీ కాలేజీʹ |
| టీనేజ్ లో శరీకంగా వచ్చే మార్పుల గురించి చెందే మానసిక ఆందోళనటీనేజ్ లోకి ప్రవేశించిన వెంటనే వారికి మొదట ఎదురయ్యే ఆందోళన వారి శరీర ఆకృతి గురించి. అప్పటివరకు ముద్దుగా, చిన్న పిల్లల మాదిరి ఉన్న శరీరం క్రమంగా తన ఆకృతిని మ |