మానవత్వం - హేతువాదం
తల్లిదండ్రుల సమాధుల మధ్యలో ఒక చిన్న పిల్లవాడు నిద్రిస్తూ ఉండే ఒక ఫోటో సామాజిక మాధ్యమాలలో ఎప్పటినుండో హల్ చల్ చేస్తుంది. దానిని నమ్మిన వారు తిరిగి షేర్ చెయ్యటం జరుగుతూ ఉంది. అయితే కొంచెం రీసెర్చ్ చేస్తే అది ఒక ఫోటో షూట్ లో భాగంగా తీసింది. అది నిజం కాదు అని తెలుస్తుంది.

విషయం ఏమిటంటే ప్రతీ సందర్భంలోనూ మనస్సు హేతుబద్దంగానే ఆలోచిస్తోందా? అలాగే ఆలోచించాలా? కొన్ని సందర్భాలలో సాటి మనిషికి వచ్చిన కష్టాన్ని బట్టి మనస్సు వెంటనే చలించవచ్చు. అప్పుడు మనం వెంటనే హేతుబద్దంగా ఆలోచించ లేకపోవచ్చు. ఆ ఎమోషన్ నుంచి తేరుకున్నాక హేతుబద్దంగా ఆలోచించవచ్చు. కొందరు ఆ ఎమోషన్ లో మనస్సు నమ్మినదానికి ఫిక్సయ్యాక ఆ తరువాత హేతుబద్ధంగా ఆలోచించగా వచ్చిన ఫలితం వారి నమ్మకాన్ని మార్చుకునే విధంగా ఉంటే వారు దానిని స్వీకరించలేరు. ఫలితంగా ఆ నమ్మకాన్ని కంటిన్యూ చేస్తారు.
అయితే వ్యక్తి హేతుబద్ధంగా రియాక్ట్ అవ్వటం ముఖ్యమా, మానవత్వంతో రియాక్ట్ అవ్వటం ముఖ్యమా అంటే అత్యవసర పరిస్థితులలో నష్టాన్ని నివారించే మానవత్వం/ఎమోషన్ తో వచ్చే రియాక్షన్ కి ప్రాముఖ్యత నిచ్చి తరువాత హేతుబద్దంగా ఆలోచించి తన నమ్మకాన్ని సరిచేసుకోవడం మంచిది అని నా ఉద్ధేశయం. మానవత్వం తో వచ్చే ప్రతీ ఎమోషన్ ని కొందరు హేతువాదులు, నాస్తికులు హేళన చేస్తూ ఉంటారు. అసలు ఎమోషన్స్ కి అవకాశమే లేదు అన్నట్లు ప్రవర్తిస్తారు. ఎమోషన్స్ ని పూర్తి హేతుబద్దంగా అర్థం చేసుకుంటే ప్రాధమిక స్థాయిలో మానవత్వంతో రియాక్ట్ అవటమే సరయిన హేతువాదం.
- హరి రాఘవ్
Keywords : rationalism, humanity
(18.10.2017 04:44:01pm)
No. of visitors : 1820
Suggested Posts
10 results found !
| పేదరికంలో ఆకలి చావులుంటాయి తప్ప ఆత్మహత్యలుండవుమనిషి ప్రాధమిక అవసరాలు తీరనిదే ఇతర విషయాలను పట్టించుకోడు. ప్రాధమిక అవసరాలకోసం తను ఏమయినా చేస్తాడు. సాటి ప్రాణిని చంపుతాడు. సాటి మనిషిని చంపుతాడు, అవసరమైతే బానిసత్వం వహిస్తాడు. ఎవరికయినా తలొంచుతాడు. అది మతమయినా, పెట్టుబడి దారుడయినా, దోపిడీ దారుడయినా.. ప్రాధమిక అవసరాలు తీరనిదే తను హేతుబద్దంగా ఆలోచించలేడు, సైంటిఫిక్ థింకింగ్ అలవర్చుకోలేడు.
సైన్స్ ఎప్పుడూ ఉ |
| అనైతిక హేతువాదం విషంపై వాక్యంలో 3 పదాలు ఉన్నాయి. 1) అనైతికత 2) హేతువాదం 3) విషం. ఈ మూడు పదాలను ఏ ఉద్దేశ్యంతో చెప్పబడినవో వివరించి విశ్లేషితే పూర్తిగా అర్థం అయ్యే అవకాశాలు ఎక్కువ.
విషం :
మొదట విషం అనే పదం గురించి విశ్లేషిస్తే అది ప్రమాదకరం, అపాయకరం అనే అర్థంతో వాడబడింది. అయితే ఇక్కడ ఎవరికి ప్రమాదకరం అనే విషయాన్ని చెప్పాలి. ఇది మానవాళి మొత్తానికి చెప్పబడినది. సాధారణంగా మానవా |
| హేతువాదులు అంటే ఎవరు?1) హేతువాదులు అంటే ఎవరు? విషయాన్నీ హేతుబద్దంగా విశ్లేషించి అర్థం చేసుకునేవారు. అలాగే ఇతరులకు వివరించేటపుడు హేతుబద్దంగా వివరించేవారు. హేతువాదులు అంటే హిందువులను తిట్టేవారు, ముస్లిమ్స్ ని తిట్టేవారు, క్రైస్తవులను తిట్టేవారు కాదు. తిట్టడం, పోట్లాడటం, అవమానించడం హేతువాదులు పని కాదు. ఎవరన్నా హేతువాదులు అలా చేస్తుంటే అది వారి వ్యక్తిగత లక్షణం తప్ప హేతువాదానిక |
| పూర్తి హేతుబద్ధత ఎంత వరకు సాధ్యం?సాధారణంగా వ్యక్తులు తమకు తాము హేతువాదులుగా చెప్పుకుంటారు. నాస్తికులే కాకుండా చాలామంది ఆస్తికులు కూడా తమను హేతువాదులుగా భావిస్తూ ఉంటారు. ప్రతీ ఒక్కరూ కూడా తమ ఆలోచన హేతుబద్దమైనదిగానే భావిస్తూ ఉంటారు. నిజంగా ప్రపంచంలో ఎవరయినా ఒక వ్యక్తి పూర్తి హేతుబద్దంగా ఆలోచించగలడా? అని ప్రశ్నించుకుంటే ʹలేదుʹ అనే సమాధానమే వస్తుంది. మనిషి ఆలోచనలను ప్రభావితం చేసే అంశాల గుర |
| హేతువాద వ్యాప్తికొంత కాలం క్రితం రాజస్థాన్ లోని జైసల్మేర్ అనే చిన్న పట్టణంలో ఒక పది మంది హేతువాదులు ఉండేవారు. వారు వారి ఉద్యోగాలు చేసుకొంటున్న క్రమంలో ఒకరి గురించి ఒకరు తెలుసుకొని స్నేహితులుగా మారారు. వారు పది మంది ప్రతీ ఆదివారం ఒకదగ్గర టీ, బిస్కేట్స్ తీసుకుంటూ హేతువాదం గురించి చర్చించుకునే వారు. అలాగే మూఢనమ్మకాల గురించి చర్చించుకునేవారు. మూఢనమ్మకాలు కలిగిఉన్నవారి మీద |
| వృద్ధాప్యంలో కొందరు నాస్తికులు ఎందుకు ఆస్తికులుగా మారతారు?హేతువాద నాస్తికుడిగా మారటం ఒక రాజకీయ పార్టీ నుండి వేరొక రాజకీయ పార్టీకి మారినట్లు కాదు. నిజమయిన హేతువాది మీద తీవ్రమయిన మానసిక ఒత్తిడి ఉంటుంది. దేనిని హేతుబద్దంగా ఆలోచించాలి, ఎంతవరకు హేతుబద్దంగా ఆలోచించాలి అనే విషయాలు అర్థం కాక ప్రతీ విషయాన్నీ తను హేతుబద్దంగా విశ్లేషించే ప్రయత్నం చేస్తాడు. అపరిమితంగా హేతుబద్ధ విశ్లేషణ వల్ల అతను పడే మానసిక శ్రమ ఈ ఒత్తిడికి |
| నాస్తికత్వం - సైన్స్నాస్తికత్వం వేరు సైన్స్ వేరు. నాస్తికత్వం పరిధి చాల చిన్నది. దేవుడు, మతము మొదలైన ఆధ్యాత్మిక నమ్మకాలకు సంబంధిచినది మాత్రమే. సైన్స్ కి పరిధి లేదు. ఇది విశ్వం మొత్తానికి సంబంధిచినది. దీనికి ఆస్తికుడు, నాస్తికుడు, లేదా ఆ మతం వాడు ఈ మతం వాడు అని సంబంధం ఉండదు. పసిపిల్లవాడు తన తల్లి చనుబాలు త్రాగటం దగ్గరనుండి రాకెట్ ప్రయోగించడం వరకు ప్రతీ దానిలో సైన్స్ ఉంటుంది. |
| హేతువాదం - కమ్యూనికేషన్ఏదయినా ఒక విషయాన్నీ హేతుబద్దంగా కమ్యూనికేట్ చెయ్యాలి అంటే మొదట కమ్యూనికేషన్ గురించి కొంత అవగాహన ఏర్పర్చుకోవలసి ఉంటుంది. కమ్యూనికేషన్ అనగానే చాల మంది భాష అను |
| హేతువాదంఆదిమకాలం నుంచి మనిషి ఎమోషన్స్ ఒకవైపు విషయాన్నీ హేతుబద్దంగా విశ్లేషించకుండా అంగీకరించేలాగా చేస్తుంటే మరోవైపు హేతుబద్దంగా విశ్లేషించడం ద్వారా ప్రగతి సాధిస్తున |
| పరిమిత హేతువాదంకార్ల్ మార్క్స్, మావో, వివేకానంద, రమణానంద, గాంధీ, బుద్ధుడు లేదా మరెవరో చెప్పాడనో మనిషి ఆ సిద్ధాంతాలను పట్టుకొని వేలాడటం వృధా. ఈ స్థితి మానసికమైన జడత్వానికి |
| డాలర్లు వస్తున్నాయి గాని ఎండ రావడం లేదు |
| కెరీర్ మీద ఇంటరెస్ట్ ఎలా వస్తుంది? |
| టీనేజ్ కి వచ్చిన పిల్లలతో ఎలా ప్రవర్తించాలి? |
| మీ పిల్లలను అనుమానంతో దండిస్తున్నారా? |
| మీ పిల్లలకు స్మార్ట్ ఫోన్స్ ఇస్తున్నారా? |
| NRI పేరెంట్స్ పిల్లల విషయంలో శ్రద్ధ వహించాల్సిన అంశాలు |
| టీనేజ్ ఆడపిల్లలకు సోషల్ మీడియాలో ఎదురయ్యే ఇబ్బందులేంటి? |
| బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్ళే ముందు తరువాత ప్రవర్తన |
| పిల్లలను కనాలి అనుకున్నపుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? |
| మీ పిల్లల ముందే మీరు పోట్లాడుకుంటున్నారా? జాగ్రత్త!! |
| పిల్లలకు ఆటలను దూరం చేస్తున్నారా? |
| మనుసులో భావాలే కలలుగా వస్తాయా? |
| Love | మనం నిజంగా ప్రేమిస్తున్నామా..? |
| తల్లిదండ్రుల మానసిక సమస్యలు పిల్లలకు వారసత్వంగా వస్తాయా? |
| టీనేజ్ అమ్మాయిలతో పేరెంట్స్ ఎలా మెలగాలి? |
| మనిషి జీవితం జీవించడానికా? శోధించడానికా? |
more..