ఫ్రస్ట్రేషన్

ఫ్రస్ట్రేషన్

ప్రతీవ్యక్తి తన జీవితంలో ఎదురయ్యే అనేక సమస్యల వల్ల లేదా జీవితంలో అప్పటి వరకు ఉన్న అభిప్రాయానికి విరుద్ధంగా వాస్తవం ఉన్నపుడు అతను లేదా ఆమె ఫ్రస్ట్రేషన్ కి లోనయ్యే అవకాశం ఉంటుంది. ఆ వ్యక్తి నమ్మకాలకు - వాస్తవానికి ఉన్న వ్యత్యాసమే ఫ్రస్ట్రేషన్ కి ప్రధాన కారణం. అటువంటి సందర్భంలో వ్యక్తి తన అభిప్రాయాలను, నమ్మకాలను వాస్తవాన్ని గ్రహించి మార్చుకోలేక వాస్తవాన్ని తిరస్కరించడంతో ఫ్రస్ట్రేషన్ ఎక్కువవుతూ ఉంటుంది.

ఫ్రస్ట్రేషన్ తెలివిగా డీల్ చెయ్యలేని కారణంగా వ్యక్తి విపరీతమయిన ఒత్తిడికి లోనయి అనేక నెగటివ్ ఎమోషన్స్ కి గురవుతాడు. కోపం, ఈర్ష్య, ద్వేషాలను పెంచుకుంటాడు. అతని ప్రవర్తన మారుతుంది. మనస్సు మాట వినదు. ఏదో ఒకటి చేసెయ్యాలన్న తపన పెరిగిపోతుంది. తన ముందు ఉన్న వస్తువులను పగల గొట్టడం, వ్యక్తులను శారీరకంగా మానసికంగా హింసించడం, కొన్ని సార్లు తనను తానూ హింసించుకోవడం జరుగుతుంది. మానసికంగా బలహీనంగా ఉన్నవారు కొన్ని సందర్భాలలో ఆత్మహత్యలకు కూడా పాల్పడే అవకాశం ఉంది. నిజానికి ఫ్రస్ట్రేషన్ బాహ్య ప్రపంచం వల్ల రాదు. బాహ్య ప్రపంచంను, ఇతరుల ప్రవర్తనను అర్థం చేసుకోవటంలో విఫలం అవ్వటం, లేదా అంగీకరించ లేకపోవటం వల్ల ఫ్రస్ట్రేషన్ వచ్చే అవకాశం ఉంది.

ఫ్రస్ట్రేషన్ ని ఎదుర్కోవటానికి అనేక మార్గాలు ఉన్నాయి. మొదటిది హేతుబద్దమయిన ఆలోచన అలవర్చుకోవటం వల్ల ఫ్రస్ట్రేషన్ ని తగ్గించుకోవవచ్చు. కానీ ఇది అందరికి సాధ్యపడే అవకాశం లేదు. ముఖ్యంగా టీనేజర్స్, యువకులలో హార్మోన్ల ప్రభావం వల్ల వారిని వారు కంట్రోల్ చేసుకోవటం కష్టం అవుతుంది. వారికి ఆలోచన తక్కువ గాను ఊహలు ఎక్కువగాను ఉంటాయి. రెందవది శారీరక శ్రమ ద్వారా కూడా ఫ్రస్ట్రేషన్ ని తగ్గించుకో వచ్చు. వ్యాయామం, క్రీడలు, లేదా తోట పనులు చెయ్యటం లాంటివి అలవాటు చేసుకుంటే ఫ్రస్ట్రేషన్ తగ్గే అవకాశాలు ఎక్కువ. కానీ నేటి కాలంలో సోషల్ మీడియా వల్ల వ్యక్తులు ఇటువంటివి చెయ్యలేక పోగా ఫ్రస్ట్రేషన్ మొత్తం సోషల్ మీడియాలో పోస్టుల రూపంలో డంప్ చేసేస్తున్నారు.

ʹకేథరిసిస్ʹ అనే ప్రక్రియ ద్వారా కూడా ఫ్రస్ట్రేషన్ ని తగ్గించుకునే అవకాశం ఉంది. ఈ ప్రక్రియలో వ్యక్తి తనకు నచ్చిన కళలు ప్రదర్శించడం ద్వారా ఫ్రస్ట్రేషన్ ని ఎదుర్కోగలడు. మరికొన్ని దురలవాట్లు కూడా ఫ్రస్ట్రేషన్ నుండి తాత్కాలికంగా ఉపశమనం కలిగిస్తాయి. కొందరు స్మోక్ చెయ్యడం ద్వారా, మరికొందరు ఆల్కహాల్ తీసుకోవడం ద్వారా ఫ్రస్ట్రేషన్ ను ఎదుర్కుంటారు. అయితే ఇవి ఆరోగ్యాన్ని పాడు చెయ్యటమే కాకుండా భవిష్యత్తులో ఫ్రస్ట్రేషన్ ని ఇంకా ఎక్కువ చెయ్యడానికి కారణాలు అవుతాయి.

ఇలా ఎవరికీ వారు ఫ్రస్ట్రేషన్ ని ఎదుర్కో లేనపుడు వారి ప్రవర్తన విపరీతాలకు దారి తీసే అవకాశం ఉంది. అనైతికంగా ప్రవర్తించడం. విలువలు మర్చిపోయి ఎవరయితే తమను ప్రేమిస్తున్నారో వారిని అవమానించడం లేదా భాధ పెట్టడం తెలియకుండా చేస్తారు. ఇటువంటి పరిస్థితులకు చేరిన వ్యక్తి మానసిక నిపుణుల సలహా తీసుకోవటం ఉత్తమం.

- హరి రాఘవ్

Keywords : frustration, stress, social media, catharsis
(16.02.2017 09:32:28am)

No. of visitors : 329

Suggested Posts


1 results found !


ఫ్రస్ట్రేషన్

ప్రతీవ్యక్తి తన జీవితంలో ఎదురయ్యే అనేక సమస్యల వల్ల లేదా జీవితంలో అప్పటి వరకు ఉన్న అభిప్రాయానికి విరుద్ధంగా వాస్తవం ఉన్నపుడు అతను లేదా ఆమె ఫ్రస్ట్రేషన్ కి లోనయ్యే అవకాశం ఉంటుంది. ఆ వ్యక్తి నమ్మకాలకు - వాస్తవానికి ఉన్న వ్యత్యాసమే ఫ్రస్ట్రేషన్ కి ప్రధాన కారణం. అటువంటి సందర్భంలో వ్యక్తి తన అభిప్రాయాలను, నమ్మకాలను వాస్తవాన్ని గ్రహించి మార్చుకోలేక వాస్తవాన్ని
Search Engine

బయలాజికల్ మదర్
ఫేస్బుక్ ఓసీడీ (FBOCD)
నిజం ఆవస్యకత
నిజాలన్నీ అబద్దాలే
కెరీర్
చీమ మెదడులో చేరిన వైరస్
వ్యక్తి
జీవితం
హ్యూమనిజం
నేనెవరు?
PTSD
డాలర్లు వస్తున్నాయి గాని ఎండ రావడం లేదు
రిజర్వేషన్స్
కెరీర్ మీద ఇంటరెస్ట్ ఎలా వస్తుంది?
టీనేజ్ కి వచ్చిన పిల్లలతో ఎలా ప్రవర్తించాలి?
మీ పిల్లలను అనుమానంతో దండిస్తున్నారా?
Autism Treatment
మీ పిల్లలకు స్మార్ట్ ఫోన్స్ ఇస్తున్నారా?
NRI పేరెంట్స్ పిల్లల విషయంలో శ్రద్ధ వహించాల్సిన అంశాలు
టీనేజ్ ఆడపిల్లలకు సోషల్ మీడియాలో ఎదురయ్యే ఇబ్బందులేంటి?
బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్ళే ముందు తరువాత ప్రవర్తన
పిల్లలను కనాలి అనుకున్నపుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
మీ పిల్లల ముందే మీరు పోట్లాడుకుంటున్నారా? జాగ్రత్త!!
పిల్లలకు ఆటలను దూరం చేస్తున్నారా?
మనుసులో భావాలే కలలుగా వస్తాయా?
కలలు నిజాలు అవుతాయా?
ఎంప్టీ నెస్ట్ సిండ్రోమ్
Love | మనం నిజంగా ప్రేమిస్తున్నామా..?
తల్లిదండ్రుల మానసిక సమస్యలు పిల్లలకు వారసత్వంగా వస్తాయా?
టీనేజ్ అమ్మాయిలతో పేరెంట్స్ ఎలా మెలగాలి?
రెండవ కూతురు
ఏకాగ్రత పెంచుకోవడం ఎలా?
మనిషి జీవితం జీవించడానికా? శోధించడానికా?
ఫ్రీ థింకింగ్
పోరాటమా? బ్రతుకా?
more..
ఫ్రస్ట్రేషన్