6 సం. లోపు పిల్లలను ఇష్టం వచ్చినట్లు ఆడుకోనివ్వండి
వ్యక్తి జీవితంలో మానసిక స్థితి చాలావరకు బాల్యంలో ఎదురయినా సంఘటనల ఆధారంగా ఏర్పడతుంది. బాల్యము అత్యంత విలువయినది. బాల్యంలో ఏర్పడ్డ నెగటివ్ ఎమోషన్స్ దాదాపు జీవితం మొత్తం డామినేట్ చేస్తూ ఉంటాయి. పెరిగిన తరువాత ఎంత జ్ఞానం పొందినప్పటికీ చిన్నప్పటి ఎమోషన్స్ వ్యక్తి ప్రవర్తన పైన తీవ్రమైన ప్రభావం చూపుతాయి.
పూర్వకాలంలో ఉమ్మడి కుటుంబాలుండేవి. అలాగే చాలావరకు మాతృభాషలో విద్యాబోధన జరిగేది. 6 సంవత్సరాలు వచ్చాక 1 వ తరగతిలో జాయిన్ చేసేవారు. కానీ నేడు పరిస్థితి మారింది. సంవత్సరం నిండా గానే డే-కేర్ లో వెయ్యటం, రెండున్నర నిండక ముందే నర్సరీలో వెయ్యటం, మంచి స్కూల్ అని హాస్టల్ లోవెయ్యటం వంటివి చేస్తున్నారు. అక్కడినుండి 6 లు వచ్చేసరికి దాదాపు మూడున్న నుండి నాలుగున్నర సంవత్సరాల స్కూల్ అనుభవం వస్తుంది.
స్కూల్ అంటేనే నిర్బంధ విద్య. స్కూల్ అంటేనే నియమాలు, నిబంధనలు. పిల్లవాడు సహజమయిన వాతావరణంలో నేర్చుకోవాల్సిన స్కిల్స్, ఎమోషన్స్ అన్నీ కూడా కృత్రిమమయిన వాతావరణంలో నియమ నిబంధనల మధ్య నేర్చుకోవలసి వస్తుంది. ఫలితంగా పిల్లలు ఇన్-సెక్యూర్ కి గురయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.
సాధారణంగా నేర్చుకోవటం రెండు రకాలుగా ఉంటుంది. ఒకటి ఇంటెన్షనల్ లెర్నింగ్. తాను నేర్చుకోవాలి అనే ఇంటెన్షన్ తో నేర్చుకోవటం. రెండవది ఇన్సిడెంటల్ లెర్నింగ్. ఇది తనకు ఏవిధమైన నేర్చుకోవాలనే ఇంటెన్షన్ లేనప్పటికీ నేర్చుకోవటం. మొదటి స్థితి అసహజమయినది అయితే రెండవ స్థితి సహజమైనది.
పిల్లలు అసహజమైన స్థితిలో నేర్చుకోవటం వల్ల కొంత అకాడమిక్ స్కిల్స్ పెరిగినప్పటికీ ఎమోషనల్ గా వారు బలహీనం అవుతారు. ఎప్పుడయితే వారు సహజ స్థితిలో ఏ విధమైన ఒత్తిడి లేకుండా పెరుగుతారో వారు మానసికంగా బలంగా ఉంటారు. ప్రస్తుతం రెండున్నర సంవత్సరాలకే స్కూల్ కి వెళ్లిన పిల్లల పరిస్థితి చూస్తే వారిలో చాల మంది ఐఐటీ లేదా ఐఐఎం వంటి కోర్సులు చేసి కూడా జీవితాన్ని సరిగా అర్థం చేసుకోలేక ఇబ్బందులు పడటం చూస్తున్నాము. అలా కాకుండా సహజమైన పరిస్థితులలో పెరిగిన పిల్లలు జీవితంలో ఎన్ని సమస్యలు వచ్చిన చాల సులభంగా ఎదుర్కోవటాన్ని గమనించవచ్చు.
నేర్చుకోవటం అనగానే తల్లిదండ్రులు కేవలం స్కూల్ లో నేర్చుకునే విద్యనే అనుకుంటారు. కానీ వారు సహజ స్థితిలో ఆదుకునే ఆటలలో ఎన్నో విషయాలను నేర్చుకుంటారు. జీవితంలో ఓటమికి గురయినపుడు దానిని స్పోర్టివ్ గా తీసుకొని ముందుకు సాగటం కేవలం ఆటలలో నేర్చుకోగలుగుతారు తప్ప స్కూల్స్ లో కాదు అని గ్రహించాలి.
కాబట్టి తల్లిదండ్రులు గమనించాల్సింది. పిల్లలను 6 సంవత్సరాలు వచ్చేవరకు వీలయినంత సహజ వాతావరణంలో పెరగనివ్వండి. అకాడెమిక్స్ గురించి మీరు తీవ్రంగా బాధపడిపోయి పిల్లల మీద ఒత్తిడి పెంచవద్దు. సహజంగా అందరితో కలసి ఆడుకోవటం. గెంతటం, అరవటం, ఆడుకోవటం వంటివి చెయ్యండి. ఎప్పుడయినా వారికి కష్టం కలిగినపుడు దగ్గరకు తీసుకొని ఓదార్చండి. అడిగిన వస్తువునల్లా కొనివ్వటం, ఏడ్చినప్పుడల్లా స్మార్ట్ ఫోన్ చేతిలో పెట్టడం కాకుండా ఓర్పుతో వారిని డీల్ చెయ్యండి. డే కేర్ వంటి వాటిలో వెయ్యకండి. వారికీ సమయం కేటాయించండి. 6 సంవత్సరాలలోపు మీరు వారితో గడిపే ప్రతీ నిమిషం వారి భవిష్యత్తుని బంగారుమయం చేస్తుంది.
- హరి రాఘవ్
Keywords : kids, play, education, personlity
(12.10.2017 07:16:56pm)
No. of visitors : 1705
Suggested Posts
10 results found !
| బయలాజికల్ మదర్19 సంవత్సరాల స్నేహ కడప జిల్లా జమ్మలమడుగు నుండి హైదరాబాద్ వచ్చి హాస్టల్లో ఉంటూ బి.ఫార్మసీ చదువుతుంది. గత కొన్ని నెలలుగా తీవ్రమైన డిప్రెషన్‌తో బాధ పడుతున్న స్నేహ కౌన్సిలింగ్ తీసుకుంటుంది. ఆమె బాల్యం గురించి లోతయిన విశ్లేషణ చేస్తున్నపుడు కొన్ని సున్నితమైన అంశాల పైన మరింత స్పష్టత వచ్చింది.
స్నేహకు ఊహ తెలిసీ తెలియని వయస్సులో తల్లి చనిపోయింది. బయటి వాళ్ళయితే |
| టీనేజ్ కి వచ్చిన పిల్లలతో ఎలా ప్రవర్తించాలి?టీనేజ్ పిల్లలో వచ్చే మానసిక శారీరక మార్పులేంటి? వాటిని ఎలా అర్థం చేసుకోవాలి? వారితో తల్లిదండ్రులు ఎలా ప్రవర్తించాలి? |
| పిల్లలను కనాలి అనుకున్నపుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి?పిల్లలను కనాలి అనుకున్నపుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? |
| మీ పిల్లల ముందే మీరు పోట్లాడుకుంటున్నారా? జాగ్రత్త!!మీ పిల్లల ముందే మీరు పోట్లాడుకుంటున్నారా? జాగ్రత్త!! |
| పిల్లలకు ఆటలను దూరం చేస్తున్నారా?పిల్లలకు ఆటలను దూరం చేస్తున్నారా? |
| తల్లిదండ్రుల మానసిక సమస్యలు పిల్లలకు వారసత్వంగా వస్తాయా?తల్లిదండ్రుల మానసిక సమస్యలు పిల్లలకు వారసత్వంగా వస్తాయా? |
| ఒంటరి బిడ్డ వలన ఇబ్బంది ఏంటి?ఇందిరా గాంధీ హయాములో దేశంలో జనసాంద్రత ఎక్కువగా ఉంది దాన్ని నియంత్రించాలని కుటుంభం నియంత్రణ పథకాలను తెచ్చారు. ప్రభుత్వం చాల డబ్బు వెచ్చించి చిన్నకుటుంబం వల్ల కలిగే లాభాలను ప్రచారం చేసింది. ʹమేమిద్దరం మాకిద్దరుʹ అనే నినాదం దేశంలో ప్రతీ గ్రామంలో గోడలపైన దర్శనమిచ్చింది. పీవీ నరసింహారావు హయాంలో మొదలయిన గ్లోబలైజేషన్ వల్ల ప్రజలలో ఆర్థికంగా పోటీ పడటం పెరిగి చివర |
| పిల్లలు చదవడం లేదని కొడుతున్నారా?పిల్లలు చదవడం లేదని కొడుతున్నారా? |
| ఆనందపు తలుపులుమనిషి జీవితానికి పరమార్థం వెతికే పనిలో పడతారు కొందరు మేధావులు. హాయిగా జీవించడమే తప్ప మారే పరమార్థం ఉండేది తెలుసుకుంటారు అందులో కొందరు. భార్య పిల్లలను వదిలి జ్ఞానం కోసం వెళ్లిన బుద్ధుడు ప్రపంచాన్ని గురువు, దేవుడు అయ్యాడు. కానీ ఆ భార్య పిల్లల దృష్టిలో బుద్ధుడు వేరు. సమాజంలో ఉన్న స్థితిని మరచి, ఉన్న భాద్యతలు మరచి భవిష్యత్తుకు ఇతరులను వదిలి వెళ్లడం వల్ల సమాజ |
| పిల్లల జ్ఞాపకశక్తి - తల్లిదండ్రుల పాత్ర - 2
చదువు అనగానే జ్ఞాపక శక్తి గుర్తు వస్తుంది. చాలామంది తల్లిదండ్రులు నా కొడుకుకి జ్ఞాపక శక్తి తక్కువ, లేదా నాకూతురికి తెలివి తక్కువ వంటి పదాలు వాడటం చూస్తాము. జ్ఞాపకశక్తి, తెలివి ఇవి వేటికి అవి వేరువేరు కాదు. వీటితో పాటు అనేక అంశాలు మిళితమై ఉంటాయి. ఒక విద్యార్థి తను ఒకసారి చూసిన సినిమా డైలాగ్స్ గుర్తుపెట్టుకున్నంత బాగా తన సబ్జక్ట్స్ విషయాలను గుర్తు పెట్టు |
| డాలర్లు వస్తున్నాయి గాని ఎండ రావడం లేదు |
| కెరీర్ మీద ఇంటరెస్ట్ ఎలా వస్తుంది? |
| టీనేజ్ కి వచ్చిన పిల్లలతో ఎలా ప్రవర్తించాలి? |
| మీ పిల్లలను అనుమానంతో దండిస్తున్నారా? |
| మీ పిల్లలకు స్మార్ట్ ఫోన్స్ ఇస్తున్నారా? |
| NRI పేరెంట్స్ పిల్లల విషయంలో శ్రద్ధ వహించాల్సిన అంశాలు |
| టీనేజ్ ఆడపిల్లలకు సోషల్ మీడియాలో ఎదురయ్యే ఇబ్బందులేంటి? |
| బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్ళే ముందు తరువాత ప్రవర్తన |
| పిల్లలను కనాలి అనుకున్నపుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? |
| మీ పిల్లల ముందే మీరు పోట్లాడుకుంటున్నారా? జాగ్రత్త!! |
| పిల్లలకు ఆటలను దూరం చేస్తున్నారా? |
| మనుసులో భావాలే కలలుగా వస్తాయా? |
| Love | మనం నిజంగా ప్రేమిస్తున్నామా..? |
| తల్లిదండ్రుల మానసిక సమస్యలు పిల్లలకు వారసత్వంగా వస్తాయా? |
| టీనేజ్ అమ్మాయిలతో పేరెంట్స్ ఎలా మెలగాలి? |
| మనిషి జీవితం జీవించడానికా? శోధించడానికా? |
more..