ఆడపిల్ల జీవితం

ఆడపిల్ల

అక్టోబర్ 11 ని అంతర్జాతీయ బాలికల దినోత్సవంగా ప్రకటించారు. ముఖ్యంగా మన దేశంలో బాలికల పరిస్థితి చాల అద్వానంగా ఉంటుంది. చాల మంది తల్లి కడుపునుండి బయటపడటమే కష్టం అయితే బయట పడిన బాలికలకు ప్రతీ రోజు ఒక గండం లాగ గడుస్తుంది. బంధువులనుండి, చుట్టుప్రక్కల వారినుండి, స్కూల్ లో టీచర్స్ వరకు ఎవరు ఎప్పుడు ఏ అఘాయిత్యం చేస్తారో తెలియని స్థితి ఎక్కువమంది బాలికలకు ఉంది.

ఆడ పిల్ల అనగానే ఆమె ఆడ పిల్ల తప్ప ఈడ పిల్ల కాదు అనే అభిప్రాయం. ఎంత చదివించినా ఆమె వేరే వాళ్ల సొత్తు అయిపోతది అనే భావంతో చదివించడానికి వెనుకాడటం. ఒక వేళ చదివించినా కొన్ని కోర్సులకు మాత్రమే పరిమితం చెయ్యటం. స్పోర్ట్స్ వంటి వాటికి ఏమాత్రం ప్రోత్సహించక పోవటం మన దేశంలో సాధారణ పరిస్థితి.

ఇక పెళ్లి విషయంలో ఆడపిల్ల పరిస్థితి మరీ దారుణం. కనీసం ఒక మనిషిని చూసినట్లు కూడా చూడరు. తల్లిదండ్రులకు బేరం కుదిరి నచ్చితే చాలు అమ్మాయి ఆ అబ్బాయిని పెళ్లి చేసుకోవలసిందే. తిరస్కరించే అవకాశాలు దాదాపు ఉండవు. పెళ్లయిన తరువాత తన భర్త ఎలా ఉన్న ఆమె సర్దుకు పోవాలి. లేకపోతే ఆమె శీలాన్ని అనుమానిస్తోంది ఈ సమాజం. ఒక వేళ పెళ్లయి అత్తారింటికి వచ్చాక అక్కడ ఏ నష్టం జరిగినా ఈ అమ్మాయి రావటం వల్లే జరిగింది అని దారుణమయిన టార్చర్ పెడతారు.

ఇక ఏ ఆడపిల్లయినా ధైర్యం చేసి ఎవరినన్నా ప్రేమిస్తే చాలు ఆ ఆడపిల్ల కు కనీస విలువలు లేవు అన్నట్లు ప్రవర్తిస్తుంది ఈ సమాజం. ఒక వేళ భర్త చనిపోయిగాని, విడాకులు తీసుకొని గాని ఎవరన్నా ఉంటే మగవాళ్లందరి సొత్తులాగా భావిస్తుంటారు. పుట్టినప్పటినుండి వరసయిన వాళ్ళు సరసం ఆడటం ఈ సమాజంలో హక్కు. ఒక వేళ భర్త చనిపోయి వస్తే వరుసలతో సంబంధం లేకుండా ప్రతీ మగడు సరసాలు ఆడుతూ ఉంటాడు.

పట్టణ ప్రాంతంలో ఆడపిల్లల పరిస్థితి కొంత మెరుగ్గాఉన్న పైకి కనిపించినంత సెక్యూర్ లైఫ్ మాత్రం ఆడపిల్లలకు లేదు. ఆడపిల్లలకు గౌరవం ఇస్తూ మగవాళ్ళతో సమానంగా చూస్తూ చదివిస్తున్న తల్లిదండ్రులు ఉన్నారు. వారందరికీ నా అభినందనలు తెలుపుకుంటున్నాను. ప్రతీ ఆడపిల్ల చదువుకోవాలి. తన జీవిత భాగస్వామిని తాను ఎన్నుకోవాలి. ధైర్యంగా తన ఇష్టాలను వ్యక్తపరిచే రోజులు రావాలని ఆకాంక్షిస్తూ...

- హరి రాఘవ్

Keywords : girl child, international,
(11.10.2017 10:03:02pm)

No. of visitors : 1257

Suggested Posts


6 results found !


NRI పేరెంట్స్ పిల్లల విషయంలో శ్రద్ధ వహించాల్సిన అంశాలు

NRI పేరెంట్స్ పిల్లల విషయంలో శ్రద్ధ వహించాల్సిన అంశాలు

టీనేజ్ ఆడపిల్లలకు సోషల్ మీడియాలో ఎదురయ్యే ఇబ్బందులేంటి?

టీనేజ్ ఆడపిల్లలకు సోషల్ మీడియాలో ఎదురయ్యే ఇబ్బందులేంటి?

వ్యత్యాసం – వ్యక్తిత్వం

హైదరాబాద్ లోని జూపార్క్ కు నిత్యం వేలాదిమంది సందర్శకులు వస్తుంటారు. అందులో హైదరాబాద్ మరియూ చుట్టు ప్రక్కల గ్రామాల స్కూల్ విద్యార్థులను స్కూల్ యాజమాన్యం తీసుకు వస్తుంటారు. అక్కడి రకరకాల జంతువులను చూసి మధ్యాహ్నం భోజన సమయానికి కాస్త తిని పిల్లలు కొంచెం సేపు విశ్రాంతి తీసుకుని తదుపరి ఆ గడ్డి మైదానంలో ఆడుకుంటారు. వారిని చూస్తే చిన్న చిన్న కుందేలు పిల్లలను చూస

విద్యార్థుల ఆత్మహత్యలకు కారణాలేంటి?

ఇటీవల ఒకే రోజు కార్పొరేట్ కాలేజీలకు చెందిన నలుగురు విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడి మరణించడం రెండు రాష్ట్రాల తల్లిదండ్రులను ఒకేసారి ఉలిక్కిపడేట్టు చేసింది. విద్యార్థుల మీద చదువుల పేరుతో పేరెంట్స్, కాలేజీలు, సమాజం పెట్టే ఒత్తిడి వారి జీవితాలను ఎలా ముగింపు జేస్తుంతో తెలియజేస్తూ ʹవనిత టీవీʹ సహకారంతో సికింద్రాబద్ లోని ʹకూస్తూరిబా గాంధీ డిగ్రీ & పీజీ కాలేజీʹ

నలుపే అందం

నట్టింట్లో టీవీ తిష్ట వేసి కూర్చున్న తరువాత అందం నిర్వచనమే మారిపోయింది. తెలుపే అందం... సన్నగా స్లిమ్‌గా ఉంటేనే అందం. అడ్వర్టైజింగ్‌ స్టాండర్డ్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా ఎన్ని మార్గదర్శకాల ప్రకారం... సౌందర్య సాధనాల ప్రచారంలో ఎక్కడా శరీరం రంగు గురించి ప్రస్తావించకూడదు. ప్రత్యక్షంగాగానీ, పరోక్షంగాగానీ నలుపుదనంతో ఉన్నవారి మనోభావాలని దెబ్బతీయకూడదు. నల్లగా ఉంటే అ

టీనేజ్ లో శరీకంగా వచ్చే మార్పుల గురించి చెందే మానసిక ఆందోళన

టీనేజ్ లోకి ప్రవేశించిన వెంటనే వారికి మొదట ఎదురయ్యే ఆందోళన వారి శరీర ఆకృతి గురించి. అప్పటివరకు ముద్దుగా, చిన్న పిల్లల మాదిరి ఉన్న శరీరం క్రమంగా తన ఆకృతిని మ
Search Engine

బయలాజికల్ మదర్
ఫేస్బుక్ ఓసీడీ (FBOCD)
నిజం ఆవస్యకత
నిజాలన్నీ అబద్దాలే
కెరీర్
చీమ మెదడులో చేరిన వైరస్
వ్యక్తి
జీవితం
హ్యూమనిజం
నేనెవరు?
PTSD
డాలర్లు వస్తున్నాయి గాని ఎండ రావడం లేదు
రిజర్వేషన్స్
కెరీర్ మీద ఇంటరెస్ట్ ఎలా వస్తుంది?
టీనేజ్ కి వచ్చిన పిల్లలతో ఎలా ప్రవర్తించాలి?
మీ పిల్లలను అనుమానంతో దండిస్తున్నారా?
Autism Treatment
మీ పిల్లలకు స్మార్ట్ ఫోన్స్ ఇస్తున్నారా?
NRI పేరెంట్స్ పిల్లల విషయంలో శ్రద్ధ వహించాల్సిన అంశాలు
టీనేజ్ ఆడపిల్లలకు సోషల్ మీడియాలో ఎదురయ్యే ఇబ్బందులేంటి?
బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్ళే ముందు తరువాత ప్రవర్తన
పిల్లలను కనాలి అనుకున్నపుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
మీ పిల్లల ముందే మీరు పోట్లాడుకుంటున్నారా? జాగ్రత్త!!
పిల్లలకు ఆటలను దూరం చేస్తున్నారా?
మనుసులో భావాలే కలలుగా వస్తాయా?
కలలు నిజాలు అవుతాయా?
ఎంప్టీ నెస్ట్ సిండ్రోమ్
Love | మనం నిజంగా ప్రేమిస్తున్నామా..?
తల్లిదండ్రుల మానసిక సమస్యలు పిల్లలకు వారసత్వంగా వస్తాయా?
టీనేజ్ అమ్మాయిలతో పేరెంట్స్ ఎలా మెలగాలి?
రెండవ కూతురు
ఏకాగ్రత పెంచుకోవడం ఎలా?
మనిషి జీవితం జీవించడానికా? శోధించడానికా?
ఫ్రీ థింకింగ్
పోరాటమా? బ్రతుకా?
more..
ఆడపిల్ల